Asthma : ఆస్తమా సమస్యతో బాధపడేవారు అపోహలను తొలగించుకోనేందుకు !

ఇన్హేలర్ మందులకు చాలా తక్కువ మోతాదులు అవసరం అవుతాయి. తక్కువ దుష్ప్రభావాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఉపయోగించుకునేందుకు ఇవి సురక్షితం. దురదృష్టవశాత్తు, ఉబ్బసం రోగులు ఇన్హేలర్ మందుల కంటే నోటి ద్వారా మందులను తీసుకోవటాన్నే ఇష్టపడతారు. ఇన్‌హేలర్‌ల ఉపయోగం గురించి తెలియకపోవడం , అవగాహన లేకపోవడం దీనికి కారణం.

Asthma : ఆస్తమా సమస్యతో బాధపడేవారు అపోహలను తొలగించుకోనేందుకు !

Asthma sufferers

Asthma : మనం పీల్చే గాలి నాణ్యతలో లోపముంటే దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయిజ. కోవిడ్-19 మహమ్మారి నేపధ్యంలో దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులలో, ఉబ్బసం అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. ఇది పెద్దలతోపాటు పిల్లలపైన ప్రభావం చూపుతుంది.ఇది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, దగ్గు మరియు శ్వాసలోపం, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) అధ్యయనం ప్రకారం, భారతదేశం 30 మిలియన్ల మందికి పైగా ఆస్తమాటిక్స్‌ తో బాధపడుతున్నట్లు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా 13.09% మంది ఉన్నారు.

READ ALSO : Diabetes : వాయుకాలుష్యంతో మధుమేహం ముప్పు! పట్టణ వాసుల్లోనే అధికమా?

కోవిడ్ సంక్షోభం నుండి ప్రపంచం బయటపడుతున్ననేపధ్యంలో అనేక అపోహల కారణంగా ఉబ్బసం వ్యాధిని నిర్ధారణ చేయటంలో జాప్యం జరుగుతుంది. చాలా దేశాలలో, ఈ నియంత్రించదగిన శ్వాసకోశ స్థితిపై దృష్టి పెట్టవలసి ఉంది. రోగనిర్ధారణ, సరైన చికిత్స అందించటంలో ఆలస్యానికి ముఖ్యంగా రోగులలో నెలకొని ఉన్న అపోహలే కారణం. నిరంతరం అవగాహన ద్వారా ఆస్తమా వ్యాప్తిని తగ్గించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సమతుల్య ఆహారంతో మాత్రమే ఆస్తమాను ఎదుర్కోవచ్చా ;

ఆహారంలో ఆస్తమా చికిత్స లేదా నిర్వహించగల వైద్యపరమైన ఆధారాలు లేవు. సమతుల్య ఆహారం రోగులకు వారి ఆరోగ్య పరిస్థితులను పెంపొందించడంలో సహాయపడుతుంది, అయితే ఆస్తమా చికిత్సకు ఆహారాన్ని నేరుగా ఉపయోగపడతాయన్న ఆధారాలు లేవు. ఆస్తమా రోగులకు సరైన పోషకాలు , విటమిన్లు తీసుకోవడం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం , వైద్యుడు సూచించిన మందులు తీసుకోవటం ప్రధానమైనవి.

READ ALSO : Asthma : ఆస్తమాతో బాధపడేవారికి మేలు చేసే 5యోగాసనాలు ఇవే?…

ఇన్‌హేలర్‌లు, నెబ్యులైజర్‌లు చికిత్సలో కీలకమా ;

ఇన్హేలర్ మందులకు చాలా తక్కువ మోతాదులు అవసరం అవుతాయి. తక్కువ దుష్ప్రభావాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఉపయోగించుకునేందుకు ఇవి సురక్షితం. దురదృష్టవశాత్తు, ఉబ్బసం రోగులు ఇన్హేలర్ మందుల కంటే నోటి ద్వారా మందులను తీసుకోవటాన్నే ఇష్టపడతారు. ఇన్‌హేలర్‌ల ఉపయోగం గురించి తెలియకపోవడం , అవగాహన లేకపోవడం దీనికి కారణం. డాక్టర్స లహా మేరకు వాటిని ఉపయోగించినప్పుడు, నోటి ద్వారా తీసుకునే మందులతో పోలిస్తే రోగి యొక్క ఆస్తమా సమస్యను ఎదుర్కోవాలంటే ఇన్ హెలర్ లు, నెబ్యులైజర్ లు మెరుగుగా పనిచేస్తాయని చెప్పవచ్చు.

READ ALSO : ఆస్తమా రోగులు తినాల్సిన పండ్లు, కూరగాయలు..

వయసు పెరిగే కొద్దీ ఆస్తమా తగ్గుతుందా ;

ఆస్తమాను చిన్న వయస్సులోనే గుర్తించినట్లయితే దానికి చికిత్స చేయవచ్చు, అయితే ఇది నయం కాదు. లక్షణాలు తగ్గినప్పటికీ, ప్రధానంగా వ్యాధి యొక్క సాధారణ పరిస్ధితుల కారణంగా కొన్ని రోజులు, నెలలు లేదా సంవత్సరాల తర్వాత తిరిగి ఆస్తమా లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. వైద్యుల సూచన మేరకు క్రమమైన చికిత్స ద్వారా ఆస్తమాను సమస్య నుండి ఉపశమనం పొందివచ్చు. జీవితంలోని ఏ దశలోనైనా దీని ప్రభావాన్ని నివారించడం చాలా అవసరం.

READ ALSO : Asthma : ఆస్తమాతో జాగ్రత్త! ఎందుకొస్తుందో తెలుసా?

ఆస్తమా రోగులు వ్యాయామం చేయకూడదు, శారీరక శ్రమలకు దూరంగా ఉండాలన్న వార్తల్లో వాస్తవ మెంత ;

వ్యాయామం ఆస్తమా నుండి ఉపశమనం పొందడంలో , ఉబ్బసం యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది, అయితే ఆస్తమా రోగులు వ్యాయామాలు చేసే ముందుగా వైద్యుడిని సంప్రదించటం మంచిది.