Summer Heat : వేసవి కాలంలో ఏ సమయంలో బయటకు వెళ్ళకూడదు ? ఎవరికి ప్రమాద ముప్పు ఎక్కువ
తప్పనిసరిగా బయటకు వెళ్లాలనుకుంటే ఎండ తీవ్రత అధికంగా సమయాన్ని నివారించేందుకు ప్రయత్నించండి. సాధారణంగా మధ్యాహ్న సమయంలో సూర్యుడు అత్యధికంగా ఉన్నప్పుడు తప్పనిసరై బయటకు వెళ్ళాల్సి వస్తే తేలికపాటి, వదులుగా ఉండే దుస్తులను ధరించండి.

summer heat
Summer Heat : వేసవి ఉష్ణోగ్రతలు పెరగినప్పుడు వడగాలులు నుండి మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వడదెబ్బ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్బాల్లో ఇది ప్రాణాంతకం కావచ్చు, అధిక వేడిలో కారణంగా ఆరోగ్యానికి కలిగే నష్టాల గురించి ప్రతిఒక్కరిలో అవగాహన ఉండటం చాలా ముఖ్యం. బయట ఉష్ణోగ్రత 40°C కంటే ఎక్కువగా ఉంటే ఇంట్లోనే ఉండటమే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO : Sunstroke : వేసవిలో వడదెబ్బ…ఆరోగ్యం విషయంలో జాగ్రత్త
బయటకు వెళకుండా ఇంట్లోనే ఉండటం వల్ల వడదెబ్బ కారణంగా తలెత్తే అనారోగ్య పరిస్ధితులనుండి రక్షణ పొందవచ్చు. వేడి వాతావరణ పరిస్థితులు శరీరం అంత ప్రభావం చూపిస్తాయి. అదేసమయంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు పని కార్యకలాపాల వల్ల శరీరం అలసిపోతుంది. దీంతోపాటు నీరసించి పోతారు.
తప్పనిసరిగా బయటకు వెళ్లాలనుకుంటే ఎండ తీవ్రత అధికంగా సమయాన్ని నివారించేందుకు ప్రయత్నించండి. సాధారణంగా మధ్యాహ్న సమయంలో సూర్యుడు అత్యధికంగా ఉన్నప్పుడు తప్పనిసరై బయటకు వెళ్ళాల్సి వస్తే తేలికపాటి, వదులుగా ఉండే దుస్తులను ధరించండి. సూర్యుని నుండి మిమ్మల్ని రక్షించుకోవటానికి టోపీ మరియు సన్ గ్లాసెస్ ఉండేలా చూసుకోండి. అలాగే, నిర్జలీకరణాన్ని నివారించడానికి పుష్కలంగా నీరు సేవించాలి.
READ ALSO : Stay Cool At Home : వేసవిలో ఏసీ లేకుండా ఇంట్లో కూల్‌గా ఉండటం ఎలాగంటే?
వేసవిలో ఏసమయంలో బయటకు వెళ్ళకూడదు ;
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, బయటికి వెళ్లవలసి వస్తే ముఖ్యంగా ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య బయటికి వెళ్లవద్దు. అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉండి చికిత్స పొందుతున్న వారైతే బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అస్వస్థతగా అనిపించినా, తల తిరగడం, గందరగోళం వంటి లక్షణాలు ఉంటే వైద్య సలహా తీసుకోవడం మంచిది.
వడగాలుల వల్ల ఎవరికి ప్రమాదం ఎక్కువ ;
చిన్న పిల్లలు మరియు వృద్ధులకు వేడి గాలుల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది.. చిన్నపిల్లలు , పెద్దలు వేడి వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులకు వేడి ఉష్ణోగ్రతల వల్ల సంబంధిత అనారోగ్యాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయట వేడిగా ఉన్నప్పుడు వృద్ధుల ఆరోగ్యపరిస్ధితి గురించి ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తుండటం మంచిది. ఎందుకంటే వృద్ధులు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలను కలిగి ఉంటారు, వారు వేడి అలసట మరియు హీట్ స్ట్రోక్ వంటి వాటివల్ల ఎక్కువ ఇబ్బంది లోనయ్యే అవకాశం కలుగుతుంది.
READ ALSO : Watermelon : వేసవిలో శరీరాన్ని చల్లగా,ఆరోగ్యంగా ఉంచే పుచ్చకాయ !
వేసవిలో వడగాలులు ప్రమాదకరం, కాబట్టి ఉష్ణోగ్రత 40 ° C కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండటం మంచిది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సివస్తే తగిన జాగ్రత్తలు పాటించటం మంచిది. పిల్లలు మరియు వృద్ధులు ఎదురయ్యే ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండి ఎలాంటి పరిస్ధితి ఎదురైనా వైద్య సలహా తీసుకోవటం మంచిది.