Barley Water : జీర్ణక్రియకు టానిక్‌గా పనిచేసే బార్లీ నీరు

బార్లీ నీరు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్ర మార్గపు అంటువ్యాధులు , మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఉపయోగించవచ్చు. శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపుతాయి.

Barley Water : జీర్ణక్రియకు టానిక్‌గా పనిచేసే బార్లీ నీరు

Barley water

Updated On : October 13, 2023 / 12:33 PM IST

Barley Water : బార్లీ నీరు ఆరోగ్యకరమైన పానీయం. బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించటం ద్వారా తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ తోపాటు ఇతర పోషకాలు ,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థకు అద్భుతమైన టానిక్‌గా , మలబద్ధకానికి సహజ నివారణగా పనిచేస్తుంది. బార్లీ నీరు శరీరాన్ని చల్లబరిచే లక్షణాలు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. బార్లీ వాటర్ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పానీయంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Harish Rao : బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత పట్లోళ్ల శశిధర్ రెడ్డి

బార్లీ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. జీర్ణ ఆరోగ్యం ; బార్లీ నీరు జీర్ణశ వ్యవస్థకు అద్భుతమైన టానిక్. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బార్లీ వాటర్ లోని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్ధకం కోసం ఒక ఔషధంగా ఉపయోగించవచ్చు. బార్లీలో ఉండే డైటరీ ఫైబర్ పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బార్లీ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్ ను తొలగించటంలో ఒత్తిడిని నివారించటంలో సహాయపడుతుంది.

2. శరీరాన్ని చల్లబరిచే లక్షణాలు ; బార్లీ వాటర్ బాడీ టెంపరేచర్ తగ్గించడానికి , వేడి-ప్రేరిత సమస్యలను నివారించడానికి సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరానికి హైడ్రేషన్ అందించడం ద్వారా, బార్లీ నీరు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి డీహైడ్రేషన్ నిరోధించడానికి సహాయపడుతుంది.

READ ALSO : Rajeev Kanakala : చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ మౌనం ఎందుకు.. స్పందించిన రాజీవ్ కనకాల..

3. కిడ్నీలకు మంచిది ; బార్లీ నీరు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్ర మార్గపు అంటువ్యాధులు , మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఉపయోగించవచ్చు. శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపుతాయి. కాలేయం , రక్త శుద్ధి కోసం ఒక అద్భుతమైన డిటాక్స్ డ్రింక్ గా చెప్పవచ్చు. బార్లీ వాటర్‌లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా వివిధ వ్యాధులను నివారిస్తాయి.

4. బరువు తగ్గడం ; బార్లీ వాటర్ బరువు తగ్గించే ఒక అద్భుతమైన ఏజెంట్. బార్లీ LDL , ట్రైగ్లిజరైడ్స్ నిరోధించడానికి సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గవచ్చు. బరువును తగ్గించుకోవటానికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ ధాన్యంగా ఎంపిక చేసుకోవచ్చు.

READ ALSO : X removes : ఎక్స్ సంచలన నిర్ణయం…వందలాది హమాస్ ఉగ్రవాదుల ఖాతాల తొలగింపు

5. రక్తపోటును తగ్గించటానికి ; బార్లీ నీరు శరీరం నుండి అదనపు నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటును కంట్రోల్ లో ఉంచేందుకు సహాయపడుతుంది.

6. మధుమేహానికి ; బార్లీ నీటిలో ఉండే కరిగే ఫైబర్ బీటా-గ్లూకాన్ మన జీర్ణవ్యవస్థలోని గ్లూకోజ్ అణువులతో బంధిస్తుంది. చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. షుగర్ స్ధాయిలను నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. దీని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) మధుమేహులకు మేలు కలిగిస్తుంది.

బార్లీ నీటిని తయారు చేసే విధానం ;

ముందుగా బార్లీ గింజలను తీసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో వేసి బాగా కడగాలి. అనంతరం ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో బార్లీ గింజలు వేయాలి. ఈ నీటిని బాగా మరిగించాలి. తర్వాత ఫిల్టర్ చేసి కావాలంటే నిమ్మరసం కూడా దానిలో కలుపుకోవచ్చు. గోరువెచ్చగా ఉండగానే తీసుకోవచ్చు.