Walnut Oil : రక్త ప్రసరణ మెరుగుపర్చటంతోపాటు, అనేక ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగించే వాల్నట్ అయిల్ !
వాల్నట్ నూనె లో ఉండే పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటం తోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల వచ్చే గుండె జబ్బులు దరిచేరవు.

walnut oil.
Walnut Oil : వాల్నట్ నూనెలో కూడా మంచి పోషకాలు , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిలో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం అని పిలువబడే ఒమేగా 3 కొవ్వు ఆమ్లం ఉంటుంది. దీనిని రోజువారీ ఆహారంలో భాగంగా చూసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. దీంతోపాటుగా జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఇందులో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు మరియు పాలీఫెనాల్స్ అని పిలువబడే మొక్కల సమ్మేళనాలు ఉన్నాయి.
వాల్నట్ ఆయిల్ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వాల్నట్ ఆయిల్ యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉందని ఒక పరిశోధన కనుగొంది, ఆరు రకాల బ్యాక్టీరియాను చంపడానికి దోహదపడుతుంది. ఇన్ఫెక్షన్ల వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. వాల్నట్ నూనె కి వంట చేసేటప్పుడు వాడితే కూరకి చేదు రుచి వస్తుంది కాబట్టి దీనిని నేరుగా వంటల్లో కాకుండా సలాడ్లలో ఆహారంలో చేర్చుకోవాలి.
READ ALSO : Walnut Oil : రక్త ప్రసరణ మెరుగుపర్చటంతోపాటు, అనేక ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగించే వాల్నట్ అయిల్ !
చర్మ ఆరోగ్యానికి రోజుకు మూడు చుక్కల వాల్నట్ నూనె తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నూనెతో ముఖానికి మసాజ్ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఫేస్ ప్యాక్ లో రెండు మూడు చుక్కలు వాల్నట్ ఆయిల్ ని ఉపయోగించవచ్చు. రక్త ప్రసరణ సక్రమంగా ఉండటం కోసం వాల్నట్ నూనె వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి, వాల్‌నట్స్‌లో లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది, వాల్నట్ నూనె తీసుకోవడం వలన రక్తపోటును నియంత్రించడంలో ఉంచి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
వాల్నట్ నూనె లో ఉండే పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటం తోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల వచ్చే గుండె జబ్బులు దరిచేరవు. బరువును నియంత్రించడంలో వాల్నట్ నూనె బాగా ఉపకరిస్తుంది. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. శరీర కొవ్వును తగ్గించటానికి సహాయపడుతుంది.
READ ALSO : Breast Cancer : మహిళలను బాధిస్తున్న రొమ్ము క్యాన్సర్ ! అవగాహన అవసరమే…
వాల్ నట్ ఆయిల్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడం ద్వారా చర్మం నుండి ముడుతలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ఇది చర్మం తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వాల్‌నట్‌లో ఉండే పోషకాలు జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. దీనిలోని ఇనుము రక్త ప్రవాహాన్ని మరియు ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరుస్తుంది చుండ్రును తగ్గించడానికి జింక్ తోడ్పడుతుంది.