Breastfeed : బాలింతల్లో బిడ్డకు సరిపడా పాలు పడాలంటే!.

బాలింతల్లో పాలు పడేందుకు వెల్లుల్లి బాగా ఉపకరిస్తుంది. దీనిని తీసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా ఇతరత్రా ప్రయోజనాలు సైతం ఉంటాయి. పసిపిల్లల్లో గ్యాస్ సమస్యను, కడుపునొప్పి నివారణకు వెల్లుల్లి పనిచేస్తుంది.

Breastfeed : బాలింతల్లో బిడ్డకు సరిపడా పాలు పడాలంటే!.

Breastfeed

Updated On : March 24, 2022 / 3:20 PM IST

Breastfeed : బాలింతల్లో పాల ఉత్పత్తికి ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలిచ్చే తల్లుల్లో తినే ఆహారం విషయంలో అనేక సందేహాలు ఉంటాయి. తల్లిపాల ఉత్పత్తిని పెంచాలంటే బాలింతలు సమయానుకూలంగా ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా తీసుకునే ఆహారం సమతులంగా ఉండేలా చూసుకోవాలి. ప్రత్యేకించి ఇనుము, కాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ,డి వంటి పోషకాలు ఎక్కవగా అవసరం అవుతాయి.

ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో అధికంగా ఇనుము లభిస్తుంది. ప్రసవం అయ్యాక రక్తహీనతను నిరోధించటానికి ఓట్స్ ఫుడ్ బాగా ఉపకరిస్తుంది. రక్తహీనత ఉన్నవారిలో సహజంగానే పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం, ఖర్జూరాలు వంటి వాటిని తీసుకోవటం వల్ల రక్తాన్ని వృద్ధి చేసుకోవచ్చు. తద్వారా తల్లిపాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు.

బాలింతల్లో పాలు పడేందుకు వెల్లుల్లి బాగా ఉపకరిస్తుంది. దీనిని తీసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా ఇతరత్రా ప్రయోజనాలు సైతం ఉంటాయి. పసిపిల్లల్లో గ్యాస్ సమస్యను, కడుపునొప్పి నివారణకు వెల్లుల్లి పనిచేస్తుంది. పచ్చిబొప్పాయి తీసుకోవటం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. బొప్పాయిని ఉడికించి కూరగా కాని, సలాడ్ రూపంలో తీసుకోవటం మంచిది. అరటి, మామిడి, కర్భూజా వంటి పండ్లను తీసుకోవటం వల్ల పొటాషియం, విటమిన్ ఎ అధిక మోతాదులో అందుతాయి. ఇవి బాలింతల్లో మలబద్ధకాన్ని నివారిస్తాయి. పాలు బాగా పడేలా చేస్తాయి.

పాలకూర, క్యారెట్లు, చిలగదుంప, గుమ్మడి, టమాటోలు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తిని పెంచుతాయి. నట్స్ తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే సెరటోనిన్ స్ధాయిలు పెరుగుతాయి. తల్లిపాలు ఎక్కవగా తయారవ్వటానికి సహాయపడుతుంది. బీన్స్, బఠాణీలు, పాలు వంటి వాటిని తీసుకోవాలి. మాంసాహారులైతే చేపలు, కీమా వంటివి తినటం మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే చేపలు వంటివాటిని తినటం వల్ల పాలు తాగే పాపాయి మెదడు ఆరోగ్యం వృద్ధి చెందుతుంది.