Fight Against Cancer : క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో కీటో డైట్ ఓ ఆయుధంగా దోహదపడుతుందా ? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే ?
పరిశోధకులు క్షీణించిన హార్మోన్‌ను కార్టికోస్టెరాయిడ్‌తో భర్తీ చేసినప్పుడు, కీటో డైట్ కణితులను తగ్గించింది, కానీ క్యాచెక్సియాను నివారించలేదు. క్యాన్సర్ అనేది మొత్తం శరీరానికి సంబంధించిన వ్యాధి. ఇది పెరగటానికి సాధారణ జీవ ప్రక్రియలను పునరుత్పత్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Keto diet
Fight Against Cancer : కీటోజెనిక్ డైట్‌లో చాలా తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్‌లను తీసుకోవడం, వాటిని కొవ్వుతో భర్తీ చేయడం ద్వారా, శరీరం శక్తి కోసం కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది. బరువు తగ్గడం, కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటంతోపాటు, క్యాన్సర్‌తో పోరాడటానికి కీటో డైట్ కూడా ఉపయోగపడుతుంది. కొత్త అధ్యయనం ప్రకారం బరువు తగ్గించే ఆహారం తీసుకోవటం ద్వారా కొవ్వును కరిగించుకోవటం తోపాటు, బరువు సైతం తగ్గేందుకు ఉపకరిస్తుంది.
READ ALSO : Breast Cancer : రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 25% తగ్గించే కొత్త కాంబినేషన్ థెరపీ !
అదేవిధంగా ఈ తరహా ఆహారం వివిధ రకాల క్యాన్సర్‌లతో పోరాడటానికి కూడా సహాయపడుతుందని సెల్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో పరిశోధకులు తెలిపారు. ప్యాంక్రియాటిక్ , కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్న ఎలుకలలో నిర్వహించిన అధ్యయనంలో, కీటో విషపూరిత లిపిడ్ ఉపఉత్పత్తులను కూడబెట్టి, ఫెర్రోప్టోసిస్ అనే ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణాలను చంపుతుందని కనుగొన్నారు. ఇది కణితి పెరుగుదలను నెమ్మదింపచేస్తుంది. అయితే అదే సమయంలో ఇది క్యాచెక్సియాకు కూడా కారణమవుతుంది. క్యాచెక్సియా అనే ప్రాణాంతక వ్యాధి. క్యాచెక్సియా ఉన్న రోగులు మరియు ఎలుకలు ఆకలిని కోల్పోవడం, విపరీతమైన బరువు తగ్గడం, అలసట, రోగనిరోధక శక్తిని తగ్గించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి సమర్థవంతమైన చికిత్స లేదు.
READ ALSO : బ్లడ్ క్యాన్సర్.. ముందస్తు సంకేతాలు ఇవే
ఈ అధ్యయనంలో, కీటో యొక్క క్యాన్సర్ పోరాట ప్రయోజనాలతోపాటు దాని ప్రాణాంతకమైన దుష్ప్రభావం మైన క్యాచెక్సియాకు దారితీయకుండా ఉండేందుకు పరిశోధకులు అధ్యనాలు చేపట్టారు. కార్టికోస్టెరాయిడ్స్ అనే సాధారణ మందులతో కీటోను జత చేయడం వల్ల క్యాన్సర్‌తో ఎలుకలలో క్యాచెక్సియాను నివారిస్తుందని వారు కనుగొన్నారు. వాటిలో కణితులు తగ్గిపోయాయి. అంతేకాకుండా ఎలుకలు ఎక్కువ కాలం జీవించాయి. ఆరోగ్యకరమైన ఎలుకలు సైతం కీటో డైట్ వల్ల బరువు కోల్పోయి. జీవక్రియ మెరుగుపడినట్లు అధ్యయన బృందానికి చెందిన జానోవిట్జ్ చెప్పారు.
READ ALSO : Benefits Of Garlic : క్యాన్సర్ నివారణకు, జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపరచటంలో వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు !
పరిశోధకులు క్షీణించిన హార్మోన్‌ను కార్టికోస్టెరాయిడ్‌తో భర్తీ చేసినప్పుడు, కీటో డైట్ కణితులను తగ్గించింది, కానీ క్యాచెక్సియాను నివారించలేదు. క్యాన్సర్ అనేది మొత్తం శరీరానికి సంబంధించిన వ్యాధి. ఇది పెరగటానికి సాధారణ జీవ ప్రక్రియలను పునరుత్పత్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రీప్రొగ్రామింగ్ కారణంగా, ఎలుకలు కీటో డైట్ నుండి పోషకాలను ఉపయోగించకపోను వృధా చేస్తాయి. అయితే స్టెరాయిడ్‌తో, అవి చాలా మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. క్యాన్సర్ కు ఇతర చికిత్సల కంటే అవి ఎక్కువ కాలం జీవించినట్లు గుర్తించారు.
READ ALSO : Bowel Cancer : ప్రేగు క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు !
కీటోతో కలిపి సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్సల కోసం కార్టికోస్టెరాయిడ్ మోతాదును నిర్ధారించేందుకు అధ్యయన బృందం తమ పరిశోధనను కొనసాగిస్తోంది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా , చికిత్సను మరింత సమర్థవంతంగా చేయగలిగితే, రోగులందరికి ప్రయోజనం చేకూరుతుందని అధ్యయన నిపుణులు అంటున్నారు.