Chyawanprash : రోగనిరోధక శక్తి పెంచే చవన్ ప్రాశ్…ఇంట్లోనే తయారీ ఎలాగంటే?..

ఈ చ్య‌వ‌న్ ప్రాశ్ ను 5 నుంచి 10 గ్రాముల ప‌రిమాణంలో ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి క‌నీసం గంట ముందు తీసుకోవాలి. వెంట‌నే అర‌క‌ప్పు గోరువెచ్చ‌ని పాలు లేదా నీళ్లు తాగాలి.

Chyawanprash : రోగనిరోధక శక్తి పెంచే చవన్ ప్రాశ్…ఇంట్లోనే తయారీ ఎలాగంటే?..

Chyawanprash (1)

Updated On : December 16, 2021 / 10:07 AM IST

Chyawanprash : కరోనా మూడో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపధ్యంలో ప్రస్తుతం మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం ముప్పును ఎదుర్కోనేలా మన శరీరాలను సిద్ధం చేయటమే.. ఇందుకోసం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోనే ప్రయత్నాలు ఇప్పటి నుండే ప్రారంభించాలి. మారిన జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా అనారోగ్య స‌మ‌స్య‌లు అధికమయ్యాయి. ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌స్య‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ వ్యాధులు మూలకారణం రోగ నిరోధ‌క శ‌క్తి మనశరీరంలో స‌రిగ్గా లేక‌పోవ‌డమేనని గ్రహించాలి. శరీరానికి ఎది అవసరమో, ఎది అనవసరమో చాలా మందికి తెలియపోవటం వల్ల అవసరం లేని వాటిని ఆహారంగా తీసుకోవం వల్ల జీర్ణ‌క్రియ దెబ్బతిని వ్యాధుల సంక్రమణకు కారణభూతం అవుతంది. ఈ క్రమంలో మనలోని రోగనిరోధక వ్యవస్ధను పెంచుకునేందుకు ఎన్నో ఏళ్ళుగా వినియోగిస్తున్న చ్య‌వ‌న్‌ప్రాశ్‌ వంటి వాటిని తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వివిధ రకాల వనమూలికలతో తయారు చేసిన చవన్ ప్రాశ్ ను రోజు వారిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తుంది. వర్షకాలం, చలికాలంలో వచ్చే దగ్గు,జలుబు,జ్వరం వంటి అనేక ఇన్ ఫెక్సన్ల నుండి చవన్ ప్రాశ్ రక్షణగా పనిచేస్తుంది. ఇప్పటికే ఆయుర్వేదంలో ఇది ఒక శక్తి వంతమైన మూలికా ఔషదంగా నిరూపితమైంది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్ధ పనితీరు మెరుగుపడుతుంది. దీని వల్ల ఎలాంటి సైడెఫెక్ట్ ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారిగా చవన్ ప్రాశ్ తీసుకుంటే దీర్షాయుష్షుతోపాటు, వృద్ధాప్య చాయలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

చవన్ ప్రాశ్ తయారీలో వినియోగించే శక్తివంతమైన మూలికలు, సుగంధ ద్రవ్యాలు, మినరల్స్, విటమిన్ సితో కూడి ఉండటంతో రోగనిరోధక శక్తి పెంచటంతోపాటు, ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు, జీర్ణక్రియ పెంపు, గుండె పనితీరు మెరుగుపరచటం, జ్ఞాపకశక్తితోపాటు మెదడు పనితీరును మెరుగుపరచటంలో దోహదం చేస్తుంది. ప్రకృతి సిద్ధంగా లభించే వన మూలికలతో ఈ చవన్ ప్రాశ్ ను తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల కంపెనీలు చవన్ ప్రాశ్ ను తయారు చేసి విక్రయిస్తున్నాయి. అయితే మన ఇంటి వద్దే సులభమైన మార్గంలో దీనిని తయారు చేసుకునేందుకు అవకాశం ఉంది. దీని త‌యారీలో దాదాపుగా 45 నుంచి 50 ర‌కాల మూలిక‌లు వినియోగిస్తారు. ఇంటి వ‌ద్ద దీన్ని త‌యారు చేసుకోవ‌డం క‌ష్టం. ఇందులో ప్ర‌ధానంగా వాడే మూలిక ఉసిరికాయ. దీన్ని ఉత్తమ ర‌సాయ‌నం అంటారు. అన్ని మూలికలు ఉపయోగించకపోయినా ముఖ్యమైన కొన్ని మూలికలను ఉపయోగించి ఇంట్లోనే చవన్ ప్రాశ్ ను తయారు చేయటమెలాగో తెలుసుకుందాం…

కావ‌ల‌సిన‌వి : ఉసిరికాయ‌లు50, వెదురు ఉప్పు20గ్రా., పిప్ప‌ళ్ల చూర్ణం10గ్రా., దాల్చిన చెక్క పొడి పావు చెంచా, యాల‌కుల పొడి పావు చెంచా , వేప పొడి పావుచెంచా, తేనె 30 గ్రా., నెయ్యి30గ్రా., నువ్వుల నూనె 30గ్రా., చ‌క్కెర250గ్రా., బ్రహ్వీ ఆకులపొడి పావు చెంచా, కుంకుమపువ్వు పావుచెంచా తీసుకోవాలి.

ఉసిరి ; ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల మీ రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. మరియు జలుబు మరియు దగ్గుతో సహా వివిధ వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

వేపపొడి ; యాంటీ-మైక్రోబయల్ మరియు క్రిమినాశక లక్షణాలకు వేపకలిగి ఉంది. కుష్టు వ్యాధి, కంటి లోపాలు, ప్రేగులలోని పురుగులు, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, చర్మపు పూతల, హృదయ సంబంధ వ్యాధులు, జ్వరం, మధుమేహం, చిగుళ్ల వ్యాధి, కాలేయ సమస్యలు మరియు ఇతర వాటికి ఉపయోగిస్తారు. అంటువ్యాధులు నివారించటంలో బాగా తోడ్పతుంది.

పిప్పళ్ల చూర్ణం ; పిప్పళ్ల చూర్ణం అజీర్ణం, గుండెల్లో మంట, విరేచనాలు, కలరా, ఉబ్బసం మొదలైన వాటికి చికిత్స చేయడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది జీర్ణక్రియ మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బ్రహ్మీ ; శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న బ్రహ్మి ఆకులు మంటను తగ్గించడానికి, మెదడు పనితీరును పెంచడానికి, ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గించడానికి, రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

కుంకుమ పువ్వు ; యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కుంకుమపువ్వు చర్మం రంగును కాంతివంతం చేయడంలో మరియు ఛాయను మెరుగుపరచడంలో ప్రసిద్ధి చెందాయి. కుంకుమపువ్వులోని శక్తివంతమైన లక్షణాలు వాత , పిత్త దోషాలను పోగొడతాయి. ఒత్తిడి మరియు నిస్పృహ లక్షణాలనుండి ఉపశమనం కలిగిస్తాయి. బరువు తగ్గడానికి దోహదపడతాయి. ఇలా ఇందులో ఉపయోగించే వస్తువులు ఒక్కో విధంగా శరీర ఆరోగ్యంపై ప్రభావ వంతంగా పనిచేస్తాయి.

త‌యారు చేసే విధానం : ఉసిరికాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి ప‌లుచ‌ని వ‌స్త్రంలో మూట కట్టి, కుక్క‌ర్ లో ఆవిరిపై ఉడికించాలి. మెత్త‌గా ఉడికిన త‌రువాత స్టీలు జ‌ల్లెడ‌లో వేసి చేతితో రుద్దితుంటే గింజ‌లు, పీచు పైన ఉండిపోయి, మెత్త‌టి గుజ్జు కింద‌కి వ‌స్తుంది. ఆ త‌రువాత పాత్ర‌ను తీసుకుని వేడి చేసి నువ్వుల నూనె, నెయ్యి వేసి, ఉసిరికాయ గుజ్జును అందులో వేసి.. బాగా ఉడికించాలి. మరో గిన్నెలో చ‌క్కెర పాకం ప‌ట్టి, వేయించిన గుజ్జును వేసి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత చ‌ల్లార్చి తేనె, వెదురు ఉప్పు, పిప్ప‌ళ్ల చూర్ణం, దాల్చిన చెక్క పొడి, బ్రహ్మీపొడి, కుంకుమ పువ్వు పొడి, వేపపొడి, యాల‌కుల పొడి క‌లిపి శుభ్ర‌మైన గాజు సీసాలో భ‌ద్ర‌ప‌రుచుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న ఈ చ్య‌వ‌న్ ప్రాశ్ ను 5 నుంచి 10 గ్రాముల ప‌రిమాణంలో ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి క‌నీసం గంట ముందు తీసుకోవాలి. వెంట‌నే అర‌క‌ప్పు గోరువెచ్చ‌ని పాలు లేదా నీళ్లు తాగాలి. ఈ విధంగా క‌నీసం ఏడాది పాటు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే అధిక మోతాదులో తీసుకుంటే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆయుర్వేద వైద్యుని సూచనలు, సలహాలు పాటిస్తూ చవన్ ప్రాశ్ ను తయారు చేసుకుని వినియోగించటం ఉత్తమం.