పౌరసత్వ చట్టం అంటే ఏంటి? అది మీకు కూడా వర్తిస్తుందా?

పౌరసత్వ సవరణ బిల్లు (CAB) దేశీయ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సమ్మతితో కొత్త చట్టంగా రూపుదాల్చింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించడం పట్ల ఇతర రాజకీయ పార్టీలతో పాటు దేశ వ్యాప్తంగా వ్యతిరేకత నెలకొంది. అసోం సహా ఇతర రాష్ట్రాల్లో ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. బిల్లుకు నిరసనగా ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో కొన్నిచోట్ల నిరవధిక కర్ఫ్యూ విధించారు. నిజానికి.. ఈ పౌరసత్వ సవరణ చట్టం.. మూడు దేశాల నుంచి వచ్చే శరణార్థులకు భారత పౌరసత్వాన్ని కల్పించే ఉద్దేశమిది.
పొరుగుదేశాల వారికి పౌరసత్వం కల్పించడంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అసోంలో మాత్రం భగ్గుమంది. అసోం వాసులంతా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలను ఉధృతం చేశారు. ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలను మూడు రాష్ట్రాల్లో విపక్ష అధికారిక పార్టీలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొత్త పౌరసత్వ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి.
ఇది రాజ్యాంగ విరుద్ధమని, ముస్లీలంకు వ్యతిరేకమని విమర్శలు గుప్పించాయి. కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును రాజకీయ పార్టీలు ఆశ్రయించాయి. మరోవైపు ప్రభుత్వం యోచించే ఆల్ ఇండియా NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)కు దీనికి సంబంధం ఏంటి? ప్రత్యేకించి అసోం నివాసులంతా ఎందుకీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు, అక్రమ వలసదారులకు కలిగే లబ్ది ఏంటి అనేదానిపై ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాల్సిన అవసరం ఉంది.
అసోంలోనే ఎందుకీ ఆందోళనలు? :
పౌరసత్వ సవరణ చట్టంతో అసోం రగిలిపోతోంది. కొత్త చట్టాన్ని నిరసస్తూ అసోం వాసులంతా పెద్దఎత్తునా ఆందోళనలను ఉధృతం చేశారు. అక్రమ వలసలపై అసోం ఉద్యమం ఈనాటిది కాదు..(1979-85) నుంచే పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి తమ ప్రాంతంలోకి చొరబడే వలసదారులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. కొత్త చట్టం కూడా బంగ్లాదేశ్ సహా ఇతర దేశాల నుంచి వలసదారులకు దేశంలోకి అనుమతించేలా ఉండటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ఎందుకంటే.. ఈ కొత్త చట్టం ప్రకారం.. దేశంలోకి చొరబడిన శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. తద్వారా తమ సంస్కృతి, భాషతో పాటు భూ వనరులు, ఉద్యోగావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త చట్టం.. అసోం 1985 ఒప్పందాన్ని ఉల్లఘించినట్టేనని అసోం వాసులంతా గట్టిగా వాదిస్తున్నారు. ఈ కొత్త చట్టం కింద.. డిసెంబర్ 31, 2014 నాటికి పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చిన వారిలో హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులంతా పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంది. వీరిలో ముస్లింలను మినహాయించడం తీవ్ర స్థాయిలో వివాదాస్పదానికి దారితీసింది.
పౌరసత్వానికి ఎవరూ దరఖాస్తు చేసుకోవచ్చు?
రాజ్యాంగం 6 ఆర్టికల్ కింద పాకిస్థాన్ నుంచి (ఇప్పుడా ప్రాంతం బంగ్లాదేశ్‌లో ఉంది) వచ్చిన వలసదారులకు భారత పౌరసత్వం లభిస్తుంది. అంటే.. 1948, జూలై 19 ముందే భారత్ లో ప్రవేశించి ఉండాలి. అప్పడు మాత్రమే పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది. అసోంకు వలసగా వచ్చినవారిలో తూర్పు పాకిస్థాన్ (తర్వాత బంగ్లాదేశ్) నుంచి ఎక్కువ సంఖ్యలో స్థిరపడ్డారు. 1971 తేదీ కంటే ముందే రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటే అట్టివారికే పౌరసత్వం లభిస్తుందని అసోం ఒప్పందంలో పొందుపరిచి ఉంది.
అక్రమ వలసదారుల విషయానికొస్తే, ఆశ్రయం లేదా శరణార్థి హోదా ఇవ్వడంపై భారతదేశానికి జాతీయ విధానం లేదు. అయితే, శరణార్థులుగా చెప్పుకునే విదేశీ పౌరులతో వ్యవహరించడానికి హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని కలిగి ఉంది. శరణార్థులకు ప్రభుత్వం.. పని అనుమతి లేదా దీర్ఘకాలిక వీసాలు ఇవ్వడం ద్వారా కేసుల వారీగా వ్యవహరిస్తోంది. విశేషమేమిటంటే, తాజా సవరణ వరకు ముఖ్యంగా మైనారిటీలు లేదా శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి పౌరసత్వ చట్టంలో ఎలాంటి నిబంధన లేదు.
ఇతరులకు పౌరసత్వ చట్టాలేమి ఉన్నాయి? :
పౌరసత్వ చట్టం 1955 కింద పౌరసత్వాన్ని పొందడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి. అందులో 1). పుట్టుకతోనే పౌరసత్వం. 2. సంతతి ద్వారా పౌరసత్వం, 3) రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం, 4) సహజతత్వం ద్వారా పౌరసత్వం, 5) స్వత్వ త్యాగం (నేచరాలైజేషన్) ద్వారా పౌరసత్వాన్ని పొందవచ్చు.
1. పుట్టుకతోనే పౌరసత్వం :
భారత్‌లో 1995లో పుట్టినా లేదా జనవరి 1, 1950 తర్వాత భారత్ లో పుట్టినవారంతా పౌరసత్వాన్ని పొందుతారు. ఆ తర్వాత చట్ట సవరణతో జనవరి 1, 1950, జనవరి 1, 1987 మధ్యకాలంలో పుట్టినవారికే పౌరసత్వం పొందేలా పరిమితి విధించారు. పౌరసత్వ సవరణ చట్టం 2003 ప్రకారం మరోసారి సవరించగా.. డిసెంబర్ 3, 2004 తర్వాత పుట్టిన వారంతా పౌరసత్వం పొందాలంటే తప్పనిసరిగా తమ తల్లిదండ్రుల్లో ఒకరైనా భారతీయులై ఉండాలి. వారిలో మరొకరు అక్రమ వలసదారుడు కాకూడదు.
ఒకవేళ పేరంట్స్ లో ఒకరైన అక్రమ వలసదారుడు అయితే 2004 తర్వాత పుట్టిన వారంతా భారత పౌరసత్వాన్ని తప్పక పొందాల్సి ఉంటుంది. అక్రమ వలసదారుల్లో విదేశీయుడు ఎవరైతే దేశంలోకి చెల్లుబాటు అయ్యే ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా వచ్చినా పాస్ పోర్టు, వీసా లేదా వ్యాలీడ్ డాక్యుమెంట్లతో ప్రవేశించి ఉండి.. పరిమిత సమయ కాలం దాటిన సమయంలో తప్పక భారత పౌరసత్వం పొందాల్సి ఉంటుంది.
2. సంతతితో పౌరసత్వం :
భారత్ బయట పుట్టిన వ్యక్తి.. పేరంట్స్ లో ఒకరైన భారతీయుడై ఉంటే వారికి పౌరసత్వం లభిస్తుంది. అదికూడా పుట్టిన ఏడాదిలోపే అధికార పరిధిలోని భారత కౌన్సులేట్ లో రిజిస్ట్రర్ చేసుకుని ఉండాలి.
3. నమోదుతో పౌరసత్వం :
రిజిస్ట్రర్ ద్వారా పౌరసత్వం పొందవచ్చు. అంటే.. వంశపారంపర్యం లేదా మ్యారేజీ ద్వారా భారత పౌరసత్వాన్ని పొందే వారికి సంబంధించినదిగా చెప్పవచ్చు. పౌరసత్వం పొందాలంటే తమ పూర్వీకులు ఎవరైనా భారత్ లో పుట్టి ఉండాలి లేదా భారత్ లో పుట్టినవారిని ఎవరైనా పెళ్లి చేసుకుని ఉండాలి. అలాంటి వారికి సంబంధించి వ్యక్తులకు మాత్రమే రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం లభిస్తుంది.
4. సహజతత్వం ద్వారా పౌరసత్వం :
పౌరసత్వంలో సెక్షన్ 6 కింద రాష్ట్రాల్లో సహజతత్వంతో ఒక ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే ముందు వారిలో ఎవరూ అక్రమ వలసదారుడు అయి ఉండరాదు. ఇండియాలో నిరంతరాయంగా 12 నెలల పాటు నివసించి ఉండాలి. అదనంగా 14ఏళ్లలో 12నెలల కాలానికి ముందే కనీసం 11ఏళ్ల పాటు (కొత్త చట్ట సవరణ కింద ఈ కేటగిరీలకు చెందిన వారికి ఐదేళ్ల సడలింపుతో) నివసించి ఉండాలి.
5. స్వత్వ త్యాగంతో పౌరసత్వం:
కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం.. దరఖాస్తుదారు విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, కళ, సాహిత్యం, ప్రపంచ శాంతి లేదా మానవ పురోగతికి విశిష్ట సేవలను అందించినట్లయితే.. అది చట్టంలోని అన్ని లేదా ఏదైనా షరతులను వదులుకోవచ్చు. పాకిస్తాన్ గాయకుడు అద్నాన్ సమీ లేదా ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఇలానే భారత పౌరసత్వం లభించింది.
ఎంతమందికి పౌరసత్వం ఇవ్వొచ్చు :
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన ముస్లింయేతర శరణార్థుల్లో లక్షల కోట్లాది మందికి ఉపశమనం కలిగించేలా ఈ సవరణ తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తావించారు. డిసెంబర్ 31, 2014 నాటికి ఇండియాలో ఏదేశ పౌరసత్వమూ లేని వ్యక్తులుగా 2లక్షల 89వేల 394 మందిని ప్రభుత్వం గుర్తించింది. 2016లో కేంద్ర హోంశాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టిన డేటా ఆధారంగా గుర్తించడం జరిగింది.
వీరిలో ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి (1,03,817), శ్రీలంక (1,02,467) ఎక్కువ మంది ఉండగా, టిబెట్ (58,155), మయన్మార్ (12,434), పాకిస్థాన్ (8,799), అఫ్గానిస్థాన్ (3,469) నుంచి ఉన్నారు. ఇవన్నీ అన్ని ప్రాంతాల్లోని పౌరసత్వం పొందని వ్యక్తులకు సంబంధించిన గణాంకాలు. డిసెంబర్ 31, 2014 తర్వాత శరణార్థిగా ఇండియాలోకి ప్రవేశించిన వారు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ వారిలో అక్రమ వలసదారుడు అయితే మాత్రం నాచురాలైజేషన్ (సహజతత్వం) ద్వారా పౌరసత్వానికి దరఖాస్తు చేయలేరు.
చట్టంబద్ధంగా.. రాజ్యాంగబద్ధంగా ఏం చర్చించాలి :
కొత్త చట్టం.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉందని న్యాయ నిపుణులు, విపక్ష నేతలంతా గట్టిగా వాదిస్తున్నారు. చట్ట సమానత్వం కల్పించే ఆర్టికల్ 14ను ఉల్లఘించినట్టేనని పార్లమెంటులో కొందరు నేతలు గళమెత్తారు. న్యాయస్థానాలు సూచించిన న్యాయం ప్రకారం.. ఆర్టికల్ 14 కింద షరతులను సంతృప్తి పరచడానికి, మొదట చట్టం ప్రకారం.. పాలన విషయాల్లో సహేతుకమైన తరగతిని సృష్టించేదిగా ఉండాలి.
మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం రాజ్యాంగంలోని లౌకిక స్వభావానికి విరుద్ధంగా చెప్పవచ్చు. ఇది పార్లమెంటు ద్వారా మార్చలేని ప్రాథమిక నిర్మాణంలో భాగంగా గుర్తించడం జరిగింది. మూడు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లలో మైనారిటీలను హింసించారు. ఇతర దేశాల్లో హింసకు గురిచేసే ఇతర వర్గాల వలసదారులకు చట్టం కారణం కాదని మరొక వాదన వినిపిస్తోంది.
దేశీయ ముస్లింలకు ఎందుకీ వ్యతిరేకత :
ఏ భారతీయుడికి ఈ సవరణ మినహాయింపు కాకూడదు. అసోంలోని NRC, కొత్త పౌరసత్వ చట్టం వేరుచేయలేదు. ఇక చివరి NRCలో 19 లక్షలకు పైగా ప్రజలను వదిలివేసింది. కొత్త చట్టం పౌరసత్వం పొందటానికి వదిలిపెట్టిన బెంగాలీ హిందువులకు సరికొత్త అవకాశాన్ని ఇస్తుంది. అదే ప్రయోజనం ముస్లింకు వదిలివేయడం కుదరదు. వారు న్యాయ పోరాటం చేయవలసిన అవసరం ఉంది.
భారత ముస్లింలలో భయాలకు ఆజ్యం పోస్తూ అసోంలో NRC ప్రక్రియ దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ప్రతిరూపం అవుతుందని అమిత్ షా సహా బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. NRCతో అనుసంధానంగా కొత్త చట్ట సవరణలో ఒక మతం వ్యక్తిని నిరాకరించడానికి వీలు కల్పించే చట్టంగా మారుతుంది. రాజకీయంగా.. ఈ చట్టం పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
అసోంకు ఎంత మినహాయింపు ఉంది?
అసోంలో, మూడు స్వయంపాలిత జిల్లాలకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. కానీ, కొత్త చట్టం ప్రధాన ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుంది. ఇది కూడా ఓ ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒకే రాష్ట్రానికి రెండు పౌరసత్వ చట్టాలు వర్తించవచ్చా? అసోం ఒప్పందం క్లాజ్ 5.8 ప్రకారం.. మార్చి 25, 1971న లేదా తరువాత అసోంకు వచ్చిన విదేశీయులను గుర్తించడం, బహిష్కరించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
అసోం ఒప్పందం ఏంటి.. ఇది NRCకి ఎలా దారితీసింది?
ప్రస్తుత NRC (1951 నాటి NRCకి అప్‌డేట్) 2013లో ప్రారంభమైంది. న్యూఢిల్లీలో 1985లో ఆగస్టు 15న భారత ప్రభుత్వాలు, అసోం ప్రభుత్వాలు, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్, ఆల్ అసోం గణ సంగ్రామ్ పరిషత్ సంతకం చేశాయి. తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు వ్యతిరేకంగా విద్యార్థుల నేతృత్వంలోని 6 ఏళ్ల ప్రజా ఉద్యమం ముగింపు దశకు చేరుకున్న సమయంలో ఈ మార్పు వచ్చిందని అంటున్నారు.
అసోంకు మాత్రమే వర్తించే 1983 నాటి అక్రమ వలసదారుల (ట్రిబ్యునల్స్ ద్వారా నిర్ణయించడం) చట్టంలో విదేశీయులను గుర్తించే ప్రక్రియను నిర్దేశించారు. అయితే 2005లో, దీన్ని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషనర్, సర్బానంద సోనోవాల్ (ఇప్పుడు అసోం సీఎం) ఈ నిబంధనలు చాలా కఠినమైనవి అని, వాస్తవికంగా అక్రమ వలసదారులను గుర్తించడం, బహిష్కరించడం దాదాపు అసాధ్యమని అప్పట్లోనే ఆయన తన వాదనను గట్టిగా వినిపించడం జరిగింది.