Coffee Powder : చర్మ సౌందర్యానికి కాఫీపొడి
చాలా మందిలో కళ్ళ క్రింద నల్లవలయాలు ఏర్పడతాయి. కాఫీలో ఉండే కెఫిన్ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.

Cofee Powder
Coffee Powder : నిద్రలేవగానే చాలా మందికి కాఫీ తాగటం అలవాటు. పనివత్తిడితో అలసిపోయినా కాస్తన్ని కాఫీ తాగితే వత్తిడి కాస్త మటుమాయం అవ్వటంతోపాటు రోజంతా చురుకుగా ఉంటారు. కాఫీని తాగటానికికే కాకుండా ఆపొడిని చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటానికి కూడా ఉపయోగించుకోవచ్చు. నిత్యం పొల్యూషన్ వాతావరణంలో తిరిగే వారికి చర్మం పొడిబారిపోవటంతోపాటు, పలు సమస్యలు వస్తాయి. అలాంటి వారికి కాఫీ పొడి ప్యాక్ చక్కని ఫలితాన్ని ఇస్తుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మాన్ని కాలుష్యరహిత కారకాల నుండి కాపాడతాయి.
కాఫీ మాస్క్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముడతలు, మచ్చలు తొలగిపోయి మొఖంలో తేజస్సు పెరుగుతుంది. కాఫీ పౌడర్, కోకా పౌడర్‌ను ఒక బౌల్‌లో తీసుకుని కొద్దిగా పాలు పోసి పేస్టులా చేయాలి. తరువాత రెండు చుక్కల తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
ఒక బౌల్‌లో కొద్దిగా కాఫీ పొడి తీసుకుని అందులో 3 టేబుల్‌స్పూన్ల అలోవెరా జెల్ వేసి ముఖంపై నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. పదినిమిషాల తరువాత కడిగేసుకోవాలి. చర్మం సౌందర్యం నిగారింపు సాధ్యమౌతుంది. ఇలా చేయటం వల్ల స్కిన్ కాన్సర్ వంటి ప్రాణాంత వ్యాధుల నుండి చర్మాన్ని కాపాడుకోవచ్చు. సూర్యడి వేడి నుండి ఉత్పత్తి అయ్యే అల్ట్రా వయెలెట్ రేస్ నుండి కాఫీలోని కెఫిన్ చర్మాన్ని రక్షిస్తుంది.
కెఫిన్ టిష్యూ రిపేర్ తోపాటు, సెల్ గ్రోత్ కి దోహదపడుతుంది. చర్మం మృదువుగా మంచి కాంతివంతంగా మారుతుంది. కాఫీ , బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ తో పేస్టు తయారు చేసుకుని దాన్ని మనచర్మంపై రాసుకుని మసాజ్ చేసుకుంటే స్కిన్ టైట్ గా మారుతుంది. మూడు టేబుల్‌స్పూన్ల కాఫీ పొడి, రెండు టేబుల్‌స్పూన్ల షుగర్, మూడు టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనెను కలిపి మిశ్రమంలా చేసి ముఖం నెమ్మదిగా రబ్ చేయాలి. పది నిమిషాల తరువాత శుభ్రంగా కడగాలి ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
చాలా మందిలో కళ్ళ క్రింద నల్లవలయాలు ఏర్పడతాయి. కాఫీలో ఉండే కెఫిన్ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు కాఫీలో ఉండే న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తాయి. చూసే వారికి ఆ వలయాలు సరైన నిద్రలేకపోవటం వల్ల ఏర్పడ్డాయన్న బావన కలుగుతుంది. అలాంటి వారు కళ్ళ క్రింద నల్లటి వలయాలు కనిపించకుండా మేకప్ ఎక్కువగా వేయాల్సి వస్తుంది. ఒక టేబుల్‌స్పూన్ కాఫీపౌడర్‌లో ఒక టీస్పూన్ తేనె, నాలుగైదు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసి కళ్ల కింద రాయాలి. పావుగంట తరువాత కడిగేసుకోవాలి. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి కాఫీ సహాయపడుతుంది.