Tattoos: ఆ దేశాల్లో టాటూ నిషిద్దం అని మీకు తెలుసా

ఒకప్పుడు పచ్చబొట్టు.. ఇప్పుడదే ట్రెండీగా టాటూ అయిపోయింది. ఎంతో ఇష్టపడి వేయించుకున్నా.. ఆవేశంలో వేయించుకున్నా శరీరంతో పాటే నిలిచిపోయి ఉండే టాటూలకు అన్ని దేశాల్లో అనుమతి లేదు.

Tattoos: ఆ దేశాల్లో టాటూ నిషిద్దం అని మీకు తెలుసా

Tattoo

Updated On : February 28, 2022 / 10:09 AM IST

Tattoos: ఒకప్పుడు పచ్చబొట్టు.. ఇప్పుడదే ట్రెండీగా టాటూ అయిపోయింది. ఎంతో ఇష్టపడి వేయించుకున్నా.. ఆవేశంలో వేయించుకున్నా శరీరంతో పాటే నిలిచిపోయి ఉండే టాటూలకు అన్ని దేశాల్లో అనుమతి లేదు. టాటూలతో విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలి.

జపాన్
గతంలో నేరస్థులను త్వరగా గుర్తు పట్టడానికి పచ్చబొట్టులు వేసేవారు. ఆ తర్వాతి క్రిమినల్ అసోసియేషన్స్ దీనిని అలవాటుగా మార్చుకున్నాయి. ఇప్పటికీ కొన్ని స్విమ్మింగ్ పూల్స్, హోటల్స్, స్పాలు, పబ్లిక్ బాతింగ్ ఏరియాల్లో టాటూలు నిషేదం.

ఇరాన్
2015లోనే ఇరాన్ టాటూలను నిషేదించింది. ప్రత్యేకించి ఇది పాశ్చాత్య సంస్కృతి అంటూ స్పైక్‌డ్ హెయిర్ లాంటి వాటికి అనుమతి నిరాకరించింది.

యూఏఈ
టాటూలు శరీరాన్ని పాడు చేస్తాయని భావిస్తుంది యూఏఈ. అది కూడా ఇస్లామిక్ ప్రక్రియను వ్యతిరేకించినట్లే అవుతుందని భావిస్తారు.

Read Also : ఆ దేశంలో మహిళలదే పరిపాలన..మగవారికి పౌరసత్వం కూడా ఉండదు

టర్కీ
ఇక్కడ కూడా ఇస్లామిక్ లానే అప్లై అవుతుండటంతో టాటూలను దూరం పెట్టేశారు. ప్రత్యేకించి స్టూడెంట్లు వాటి జోలికి పోకూడదు.

చైనా
షాంగై, బీజింగ్ లతో పలు రూరల్ ఏరియాల్లో మినహాయిస్తే టాటూలకు చైనాలో అనుమతి లేదు.

వియత్నాం
జపాన్, చైనాలకు మాదిరిగా వియత్నాంలోనూ క్రిమినల్స్, గ్యాంగ్ స్టర్స్ మాత్రమ యాటిట్యూడ్ చూపించుకోవడానికి టాటూలు వేయించుకుంటుంటారు. మిగిలిన వాళ్లు దాదాపు టాటూలకు దూరమే.

శ్రీలంక
శ్రీలంకలో టాటూలు నిషేదం ఎంతలా ఉంటుందంటే.. ఓ బ్రిటిష్ మహిళను టాటూల కారణంగా అరెస్టు చేసింది.

విదేశాలకు వెళ్లాలనుకునేవారు టాటూలు వేయించుకోవడం ఎంతవరకూ కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. శరీరంలో బయటకు కనిపించేలా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోండి.