Amla Immune Booster : కరోనా కాలంలో ఉసిరితో ఇమ్యూనిటీని పెంచుకోండిలా..
అసలే కరోనా కాలం.. కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా పూర్తిస్థాయిలో కరోనా వ్యాప్తిని నిర్మూలించలేని పరిస్థితి. కరోనా బారినుంచి బయటపడాలంటే ఒకే ఒక ఆయుధం.. ఇమ్యూనిటీ.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం..

Amla Immune Booster
Amla Immune Booster : అసలే కరోనా కాలం.. కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా పూర్తిస్థాయిలో కరోనా వ్యాప్తిని నిర్మూలించలేని పరిస్థితి. కరోనా బారినుంచి బయటపడాలంటే ఒకే ఒక ఆయుధం.. ఇమ్యూనిటీ.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం.. కరోనా వంటి అనేక వైరస్ మహమ్మారుల నుంచి రక్షించుకోవాలంటే తప్పనిసరిగా ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు పోషక నిపుణులు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్ సి చాలా అవసరం.. సిట్రిక్ ఆమ్లం కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. అయితే విటమిన్ సి సమృద్ధిగా లభించే వాటిలో ఉసిరికాయ ఒకటి. వగరుగా ఉండే ఈ ఉసిరి వల్ల అనేక అరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ప్రధానంగా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఉసిరి అద్భుంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
కరోనా బారిన పడినవారిలో తొలి రోజు నుంచి కోలుకునేంత వరకు విటమిన్ సి కీలకంగా పనిచేస్తుంది. సి విటమిన్ టాబ్లెట్లు వాడటం కంటే.. నేరుగా ఉసిరిని కాయగా లేదా పొడిరూపంలో తీసుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో సి విటమిన్ శరీరానికి అందుతుందని సూచిస్తున్నారు. విరివిగా లభించే ఉసిరి కాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అనేక వైరస్ లను నివారించగల శక్తి ఉంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, రక్త కణాల హీనతను కూడా తగ్గించగలదు. జీర్ణశక్తిని పెంచడంలో ఉసిరి చేసే మేలు అంతాఇంతా కాదు.. కరోనా పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉసిరి మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌గా పని చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్ సీ, కాల్షియం, బీ–కాంప్లెక్స్, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, ఇతర విటమిన్లు, ఖనిజ లవణాలు ఉసిరిలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో ఉసిరి దివ్యఔషధంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఉసిరి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను పారదోలుతుంది. మార్కెట్‌లో ఉసిరి కాయల పొడి, టాబ్లెట్ల రూపంలో లభిస్తోంది. తేనెతో కలిపి ఉసిరిని తీసుకుంటే ఆస్తమా, శ్వాసకోశ సమస్యల నుంచి వెంటనే త్వరిత ఉపశమనం లభిస్తుంది.