Covid-19 : కొవిడ్ సోకిన గర్భిణుల్లో ఇన్పెక్షన్ ముప్పు ఎక్కువ!
కరోనా బాధిత వ్యక్తులతో పోలిస్తే గర్భిణుల్లో కరోనా సోకితే ముప్పు అధికంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన మహారాష్ట్రలో గర్బిణీలే ఎక్కువ మంది ఉన్నారు.

Covid 19 Infection Risk More Severe In Pregnant Women
Covid-19 Infection Risk : కరోనా కేసులు తగ్గిపోతున్నాయి.. వైరస్ పోయిందిలే అనుకుంటే పొరపాటే.. చిన్నపెద్ద అనే తేడాలేదు.. అందరికి వైరస్ ముప్పు ఉన్నట్టే.. ప్రత్యేకించి కొవిడ్ సోకిన గర్బిణుల్లో ఇన్ఫెక్షన్ ముక్కు ఎక్కువని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. సాధారణ కరోనా బాధిత వ్యక్తులతో పోలిస్తే గర్భిణుల్లో కరోనా సోకితే ముప్పు అధికంగా ఉంటుందని గుర్తించారు. అందుకే కరోనా బాధిత గర్భిణికి తక్షణ వైద్య పర్యవేక్షణ అవసరమని సూచిస్తున్నారు. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అధ్యయనం ఒక ప్రకటనలో తెలిపింది.
డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు
ఇటీవల కరోనా కేసులు ఎక్కువగా నమోదైన మహారాష్ట్రలో గర్బిణీలే ఎక్కువ మంది ఉన్నారని ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. రాష్ట్రంలోని పలు ఇన్సిస్టిట్యూట్‌లు, ఆస్పత్రుల సహకారంతో మొదటిసారి సమగ్ర అధ్యయనాన్ని ఐసీఎంఆర్ నిర్వహించింది. 2020 మార్చి నుంచి 2021 జనవరి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 4,203 మంది కరోనా సోకిన గర్భిణుల నుంచి సమాచారాన్ని ఐసీఎంఆర్ సేకరించింది.
అనంతరం ఆ డేటాను విశ్లేషించింది. ఆ డేటాలో 3,213 వరకు జననాలు ఉండగా, 77 వరకు గర్భస్రావాలు నమోదైనట్టు గుర్తించారు. 528 మందికి నెలలు నిండకముందే ప్రసవం అయినట్టు గుర్తించారు. అలాగే 328 మంది గర్భిణుల్లో రక్తపోటు సమస్యలు అధికంగా ఉన్నాయని గుర్తించారు. పిండ విచ్ఛిత్తి, మృతశిశువుల జననం నిష్పత్తి ఆరు శాతంగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది.
Revanth Reddy : శశిథరూర్‌కు రేవంత్ రెడ్డి క్షమాపణలు, వివాదానికి ఫుల్ స్టాప్