డేంజర్ బెల్స్ : కోలుకున్న కరోనా బాధితుల్లో ఎనిమిదిలో ఒకరు 140 రోజుల్లోనే మరణిస్తున్నారు!

డేంజర్ బెల్స్ : కోలుకున్న కరోనా బాధితుల్లో ఎనిమిదిలో ఒకరు 140 రోజుల్లోనే మరణిస్తున్నారు!

Updated On : January 19, 2021 / 6:40 PM IST

Covid Recovered patients die with in 140days : కరోనా వైరస్ భయం వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నా బతుకుతామన్న గ్యారెంటీ లేదనే భయం, ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా నుంచి రికవరీ అయిన 140 రోజుల్లోనే బాధితులు ఆస్పత్రి పాలై మరణిస్తున్నారంటూ ఓ కొత్త డేటాలో వెల్లడైంది. కోలుకున్నాక ఐదు నెలల్లోనే మళ్లీ కరోనాతో ఆస్పత్రి పాలవుతున్నారంట. రికవరీ పేషెంట్లలో ఎనిమిది మందిలో ఒకరు కరోనాతో మరణిస్తున్నారని డేటా పేర్కొంది.

యూనివర్శిటీ ఆఫ్ లిచెస్టర్, ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటాస్టిక్స్ (ONS)కు చెందిన బాంబ్ సేల్ రీసెర్చ్ తమ అధ్యయనంలో కనుగొంది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్చ్ అయిన బాధితుల్లో 29.4శాతం మంది ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలతో మళ్లీ ఆస్పత్రుల్లో చేరుతున్నారని పరిశోధనలో తేలింది. వీరిలో 12.3 శాతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మరణించారు. అంటే.. డిశ్చార్ అయిన కరోనా బాధితుల్లో దీర్ఘకాలం వైరస్ ప్రభావం ఉంటుందని అంటున్నారు.

అందుకే బాధితులను ఎక్కువ రోజులు మానిటర్ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. కోలుకున్న కరోనా బాధితుల్లో ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్, దీర్ఘకాలిక కాలేయం, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. దీని కారణంగానే బాధితులు మరణిస్తున్నారని సైంటిస్టులు తమ రీసెర్చ్‌లో గుర్తించారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాక కూడా వైరస్ ప్రభావంతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, దాంతో మళ్లీ ఆస్పత్రుల్లో చేరి చివరికి ప్రాణాలు కోల్పోతున్నారని ప్రొఫెసర్ కమలేశ్ ఖౌంటీ పేర్కొన్నారు.

కోలుకున్న బాధితుల్లో దాదాపు 30శాతం మంది మళ్లీ ఆస్పత్రుల్లో చేరుతున్నారని ఆయన అన్నారు. దీర్ఘకాలిక కోవిడ్ సమస్యల కోసం వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అధ్యయనంలో భాగంగా 47,780 మంది డిశ్చార్జ్ అయిన కరోనా బాధితుల డేటా ఆధారంగా పరిశోధన చేశారు. దీనిపై ఇంకా పూర్తి రివ్యూ చేయలేదు. కానీ, ఈ విషయంలో సీరియస్ గా తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. లేటెస్ట్ గవర్నమెంటు డేటా ప్రకారం… కరోనా పాజిటివ్ తేలిన 28 రోజుల్లోనే 89,261 మంది మరణించారు. ఇదేగానీ నిజమైతే.. కరోనా మరణాల సంఖ్య భారీగా పెరగనుంది.