Dengue Cases : దేశవ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డెంగ్యూ నుండి రక్షించుకోవడానికి తీసుకోవలసిన అనేక జాగ్రత్తలు ఉన్నాయి. ఇంట్లో మరియు చుట్టుపక్కల దోమల సంతతిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం ముఖ్యం. కిటికీలు, తలుపులకు దోమతెరలు , స్క్రీన్లను ఉపయోగించాలి.

Dengue
Dengue Cases : దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అదే సమయంలో డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలి రోజుల్లో డెంగ్యూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో డెంగ్యూ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO : Seasonal Affective Disorder : వర్షాకాలంలో సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ ఎదుర్కోవటానికి ప్రభావవంతమైన మార్గాలు !
డెంగ్యూ అనేది దోమ కాటు ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్. డెంగ్యూ యొక్క అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు , దద్దుర్లుతోపాటుగా ఇతర లక్షణాలైన వికారం, వాంతులు, కడుపు నొప్పి , ఆకలిని కోల్పోవటం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. డెంగ్యూ వ్యాధికి సక్రమంగా చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చు.
READ ALSO : Monsoon Diet : వర్షకాలంలో ఆహారంలో నెయ్యిని తప్పనిసరిగా చేర్చుకోవడానికి 5 కారణాలు !
డెంగ్యూ నుండి రక్షించుకోవడానికి తీసుకోవలసిన అనేక జాగ్రత్తలు ఉన్నాయి. ఇంట్లో మరియు చుట్టుపక్కల దోమల సంతతిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం ముఖ్యం. కిటికీలు, తలుపులకు దోమతెరలు , స్క్రీన్లను ఉపయోగించాలి. ఆరుబయట ఉన్నప్పుడు పొడవాటి చేతుల చొక్కాలు, ప్యాంటు ధరించడం, దోమలు కుట్టకుండా స్ప్రేలు లేదా క్రిమి వికర్షకాలను ఉపయోగించడం వంటివి పాటించాలి. దోమల ఉత్పత్తికి నిలయంగా ఉండే మురుగు నీటిని, నీటి నిల్వలను నివారించాలి.
READ ALSO : Hungry at Night : రాత్రి నిద్రలో ఆకలేస్తోందా.. ఇలాంటి సమయంలో తినొచ్చా ? తినకూడదా ?
దోమల సంతతిని నియంత్రించడంతో పాటు, డెంగ్యూ సంకేతాలు, లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది. ఏవైనా లక్షణాలను గుర్తిస్తే సరైన చికిత్స కోసం వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి. అనారోగ్య సమయంలో పుష్కలంగా ద్రవాలు తీసుకోవటంతోపాటు, విశ్రాంతి తీసుకోవడం ద్వారా నిర్జలీకరణాన్ని నివారించటానికి చర్యలు తీసుకోవాలి.
READ ALSO : Stay Fit During Monsoons : వర్షాకాలంలో ఫిట్‌గా ఉండేందుకు 5 చిట్కాలు
చివరగా, డెంగ్యూ ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నట్లయితే, పొడవాటి చేతుల దుస్తులు ధరించడం , ఆరుబయట ఉన్నప్పుడు దోమ తెరలు ఉపయోగించడం వంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రయాణానికి ముందు వైద్యులను సంప్రదించటం మంచిది. తద్వారా డెంగ్యూ ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి ప్రయాణించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను సులభంగా ఎదుర్కోవచ్చు.