Nfhs : చక్కెర వ్యాధి పట్టణ వాసుల్లోనే అధికం…ఎన్‌ఎఫ్‌హెచ్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు

సాధారణంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 180ఎంజీ/డీఎల్‌ కంటే ఎక్కువగా ఉంటే షుగర్‌ వ్యాధిగా పరిగణిస్తారు. వీరు క్రమం తప్పకుండా మందులు వాడి, ఆరోగ్య నియమాలు పాటించాలి.

Nfhs : చక్కెర వ్యాధి పట్టణ వాసుల్లోనే అధికం…ఎన్‌ఎఫ్‌హెచ్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు

Diabets

Updated On : November 17, 2021 / 1:23 PM IST

Nfhs : మధుమేహ వ్యాధిని – చెక్కర వ్యాధి, షుగర్ వ్యాధి అని సాధారణంగా అంటూ వుంటారు. శరీరాన్ని కొంచె కొంచెంగా తినేస్తూ, తెలియకుండా మనిషిని చావువైపు తీసుకెళ్లే ప్రమాదకరమైన వ్యాధి ఇది. శరీరములో ఉత్పత్తి అయే ఇన్సులిన్ హార్మోను శరీరములోని షుగర్ ను సమతుల్యము చేస్తుంది. శరీర అవసరానికి షుగర్ అందుబాటులో ఉండేలా చేయుటలో ఇన్సులిన్ ప్రధానపాత్ర వహిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గితే షుగర్ వ్యాధి వస్తుంది.

ఇటీవలికాలంలో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ చక్కెర వ్యాధి బారిన పడుతున్నారు. అధిక బరువు వున్న వాళ్ళు చిన్నవారైన – పెద్దవారికైన రావచ్చు. మానసిక వత్తిడికి లోనైనవారు. శారీరక శ్రమ లేనివారికి ఈ వ్యాధి వస్తుంది. కొన్ని సందర్భాలలో వారసత్వంగా కూడా సంక్రమిస్తుంది. అధికంగా ఆహారము తీసుకునే వాళ్లకు, కొన్ని రకాల మందులు దీర్ఘకాలం వాడడం వలన ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

మన దేశంలో డయాబెటిక్‌ రోగులు నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఒకప్పుడు 50 ఏండ్లు దాటినవారిలోనే కనిపించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 25-30 ఏండ్లలోపే దాపురిస్తున్నది. తాజాగా నిర్వహించిన నేషనల్‌ ఫ్యామిటీ హెల్త్‌ సర్వే-5 లో దేశంలో మధుమేహం విస్తరణపై విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

సర్వేలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

మనదేశంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా మధుమేహానికి గురవుతున్నట్లు తేలింది. ఈ వ్యాధికి గురవుతున్న పురుషుల్లో పట్టణప్రాంతాల వారు 21శాతం, గ్రామీణ ప్రాంతంవారు 16శాతం ఉంటున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం పురుషుల్లో సరాసరి 18శాతం మంది షుగర్‌ బారిన పడినట్లు గుర్తించారు. మహిళల్లో పట్టణ ప్రాంతాల్లో 18శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 13శాతం మంది షుగర్‌ బారిన పడుతున్నారు. మొత్తంగా 14శాతం మందికి మధుమేహం ఉన్నది.

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారినపడినవారిలో తమకు ఆ వ్యాధి ఉన్నదని గుర్తిస్తున్నవారు 54శాతంమంది. మనదేశంలో 49శాతం మంది మాత్రమే సరైన సమయంలో వ్యాధిని గుర్తిస్తున్నారు. 1980- 2014 మధ్యకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ప్రతి సంవత్సరం సంభవిస్తున్న మానవ మరణాలకు 9వ అతిపెద్ద కారణం మధుమేహమేనని 2019లో గుర్తించారు. 2000- 2016 మధ్యకాలంలో షుగర్‌ వ్యాధి మరణాలు 5 శాతం పెరిగాయి.

సాధారణంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి 180ఎంజీ డీఎల్‌ కంటే ఎక్కువగా ఉంటే షుగర్‌ వ్యాధిగా పరిగణిస్తారు. వీరు క్రమం తప్పకుండా మందులు వాడి, ఆరోగ్య నియమాలు పాటించాలి. 160-180 మధ్య కౌంట్‌ ఉంటే ప్రీ-డయాబెటిక్‌గా స్టేజ్‌గా పరిగణిస్తారు. వీరు ఆరోగ్య నియమాలు కచ్చితంగా పాటిస్తే సరిపోతుంది. టైప్‌-1 డయాబెటిస్‌ జన్యుపరంగా వస్తుంది. వీరు 5 శాతం మందే ఉన్నారు. మిగిలిన 95% మందిలో షుగర్‌ వ్యాధి వారి జీవనశైలి మార్పులవల్ల వస్తున్నది. వ్యాధిని ముందే గుర్తించి ఔషధాలు వాడుతూనే జీవనశైలిని క్రమబద్ధం చేసుకొంటే మధుమేహాన్ని అదుపుచేయవచ్చు.

ఆకలి ఎక్కువగా వుండి – చాలా మార్లు, ఎక్కువగా ఆహారం తీసుకోవడం, సాధారణంకన్నా ఎక్కవగా నీరు దప్పికకావడం – ఎక్కువగా నీరు త్రాగడం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్ళడం. బరువు తగ్గడం, గాయం తగిలినచో సరిగా మానకపోవడం – త్వరగా తగ్గకపోవడం, నీరసంగా, నిస్త్ర్రాణంగావుండడం, స్త్ర్రీలలో అసాధారణంగా తెల్లబట్ట కావడం, తరచుగా చర్మవ్యాధులు రావడం, కాళ్ళు,చేతులు ముఖ్యంగా పాదాలు అరచేతులు తిమ్మిరిగా వుండడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే షుగర్ వ్యాధిగా బావించి వైద్యుని వద్దకు వెళ్ళి తగిన చికిత్స పొందాలి.