Skipping : స్కిప్పింగ్ తో ఎత్తు పెరగొచ్చు, బరువు తగొచ్చు తెలుసా!
అదేక్రమంలో ఎత్తు పెరగాలనుకునే వారు రోజు వారిగా స్కిప్పింగ్ ను చేయటం వల్ల ఎత్తును సులభంగా పెరగవచ్చు. ఇది తగిన పోషకాహారం తీసుకోవటంపై న అధారపడి ఉంటుంది.

Skipping
Skipping : ఫిట్ నెస్ కు తోడ్పడే వ్యాయామాలలో స్కిప్పింగ్ కూడా ఒకటి. చిన్న వయస్సు వారు ఆటపాటల సమయంలో స్కిప్పింగ్ ను అడటాన్ని ఇష్టపడుతుంటారు. అథ్లెట్స్ ఎక్కువగా స్కిప్పింగ్ కు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే స్కిప్పింగ్ అనేది కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ కు దోహదం చేస్తుంది. హార్ట్ రేట్ ను మెరుగుపరుస్తుంది. గంటపాటు స్కిప్పింగ్ చేస్తే దాదాపు 1,600 కేలరీలు కరిగిపోతాయి. రోజు వారిగా స్కిప్పింగ్ చేయటం వల్ల శరీర శక్తి పెరుగుతుంది. ఒత్తిడిని తట్టుకునే శక్తి శరీరానికి కలుగుతుంది. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఎముకలు ధృఢంగా మారతాయి. ఎముకల పెళుసుతనం వంటి సమస్యలు తొలగిపోతాయి. కండరాలు బలంగా తయారవుతాయి.
స్కిప్పింగ్ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం పెరగటంతోపాటు ఎక్కువగా ఆక్సిజన్ పీల్చేందుకు అవకాశం ఉంటుంది. వత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజు వారిగా 20 నిమిషాలపాటు స్కిప్పింగ్ ప్రయత్నిస్తే క్రమేపి శరీరంలోని కొవ్వులు కరిగిపోయి బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో మంచి మొత్తంలో కేలరీలను బర్న్ చేయడంలో దీనిని మించిన వ్యాయామం లేదనే చెప్పాలి. అంతేకాకుండా జీవక్రియలు మెరుగవుతాయి.
అదేక్రమంలో ఎత్తు పెరగాలనుకునే వారు రోజు వారిగా స్కిప్పింగ్ ను చేయటం వల్ల ఎత్తును సులభంగా పెరగవచ్చు. ఇది తగిన పోషకాహారం తీసుకోవటంపై న అధారపడి ఉంటుంది. అదే క్రమంలో చేసే పనులపై ఏకాగ్రతను పెంచి మనస్సును ప్రశాంతంగా ఉంచటంలో ఎంతో సహాయపడుతుంది. బొడ్డు వద్ద ఉండే బెల్లీ ఫ్యాట్ ను స్కిప్పింగ్ తో ఈజీ గా పోగొట్టుకోవచ్చు. చర్మాన్ని యవ్వనంగా ఉంచటంతోపాటు, వృద్ధప్య ఛాయలు దరిచేరవు. స్కిప్పింగ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో స్కిప్పింగ్ వల్ల కాళ్లకు గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఫిట్ నెస్ నిపుణుల పర్యవేక్షణలో వీటిని ప్రారంభించటం మంచిది.