When Self-isolate Need : కరోనా పాజిటివ్ వ్యక్తిని కలిస్తే.. సెల్ఫ్ ఐసోలేషన్‌ అవసరమేనా?

కరోనా పాజిటివ్ వ్యక్తిని కలిస్తే.. స్వీయ నిర్బంధం (Self-isolate)లోకి వెళ్లాలా? వద్దా అనే కన్ఫ్యూజ్‌లో ఉన్నారా? వైరస్ లక్షణాలు ఏమిలేవు.. చాలామందిలో అందరిలో కలవొచ్చా? లేదా ఐసోలేషన్ లో ఉండాలా? ఏది తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతుంది.

When Self-isolate Need : కరోనా పాజిటివ్ వ్యక్తిని కలిస్తే.. సెల్ఫ్ ఐసోలేషన్‌ అవసరమేనా?

Do I Need To Isolate After Contact With Someone Who Has Covid

Updated On : July 9, 2021 / 10:20 PM IST

isolate after contact with someone who has Covid : కరోనా పాజిటివ్ వ్యక్తిని కలిస్తే.. స్వీయ నిర్బంధం (Self-isolate)లోకి వెళ్లాలా? వద్దా అనే కన్ఫ్యూజ్‌లో ఉన్నారా? వైరస్ లక్షణాలు ఏమిలేవు.. చాలామందిలో అందరిలో కలవొచ్చా? లేదా ఐసోలేషన్ లో ఉండాలా? ఏది తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. అసలు ఎప్పుడూ ఐసోలేషన్ లోకి వెళ్లాలో నిపుణులు సూచిస్తున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తిని కలిసిన తర్వాత మీలో ఏమైనా ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా చెక్ చేసుకోండి. అంటే.. జ్వరం (37.8C) పైనా ఉండాలి. నిరంతర దగ్గు ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి.. ఎవరితోనూ కలవకుండా ఐసోలేషన్ లో ఉండొచ్చు.

అలాగే టెస్టు కూడా తప్పనిసరిగా చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న సమయం.. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పటిలా కరోనా లక్షణాలు ఉండటం లేదు. కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో ఒకలా.. అసలు వ్యాక్సిన్ వేయించుకోని వారిలో మరోలా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ మీకు వచ్చింది కరోనా? లేదా అనేది తెలుసుకోవాలంటే కొవిడ్ టెస్టు ఒకటే సరైన మార్గం.. అది కూడా RTPCR వంటి టెస్టు ద్వారా అయితే కచ్చితమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఏదైనా లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా ఐసోలేట్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా ఉంటే.. తక్షణమే సెల్ఫ్ ఐసోలేట్ :
– కరోనావైరస్ లక్షణాల్లో అధిక జ్వరం, నిరంతర దగ్గు లేదా రుచి లేదా వాసన కోల్పోవడం) ఉన్నప్పుడు..
– టెస్టులో కొవిడ్ పాజిటివ్ అని వచ్చినప్పుడు..
– కొవిడ్ లక్షణాలు ఉన్నవారితో మీరు కలిసి ఉన్నప్పుడు లేదా వారికి కొవిడ్ నిర్ధారణ అయినప్పుడు..
-NHS టెస్టు, కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా మీకు సెల్ఫ్ ఐసోలేట్ కావాలని సూచిస్తే..
– యూకే వంటి విదేశాలకు వెళ్లిన్నట్టు అయితే..

కరోనా సోకిన వ్యక్తిని మీరు కలిసి ఉండి.. మీలో ఎలాంటి లక్షణాలు లేకున్నా.. మీకు సెల్ఫ్ ఐసోలేట్ కావాలని సూచించినప్పుడు.. అలాంటి సమయాల్లో మాత్రం మీరు సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది.

సెల్ఫ్ ఐసోలేషన్ అంటే ఏంటి? :
సెల్ఫ్ ఐసోలేషన్ (Self-isolation) అంటే.. మీ ఇంటిని వదిలి బయటకు రావొద్దు అని అర్థం. మీకు కరోనావైరస్ వచ్చి ఉండొచ్చు. స్వీయ నిర్బంధం తప్పనిసరి అంటే.. మీకు మీరు బయటి ప్రపంచం నుంచి వేరు కావడం.. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటం.. పని, స్కూల్ లేదా ఇతరేతర ప్రజా రవాణా, పబ్లిక్ ప్లేసుల్లో ఇతరులతో కలవకుండా ఉండాలి. ఒకవేళ కలిస్తే.. మీలో కరోనా ఉంటే అది ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు.. మీరు ఐసోలేషన్ లో ఉండే గది కూడా బాగా వెంటిలేషన్ ఉండాలి. కిటికీలు కూడా ఎప్పుడూ తెరిచే ఉండాలి. మీరు ఉండే గదికి ఎవరూ రాకూడదు. మీ ఇంట్లో ఎవరో ఒకరు లేదా స్నేహితులు నిత్యావసరాలను మీకు అందించవచ్చు. అది కూడా కొవిడ్ నిబంధనలు తీసుకుంటూనే.. సామాజిక దూరానికి, షీల్డింగ్ కు, సెల్ఫ్ ఐసోలేషన్ కు చాలా తేడా ఉంది.

ఐసోలేషన్ అవసరమా? అంటే..
అవును.. ముందుగా NHS టెస్టు చేయించుకోండి.. ఆ టెస్టు ద్వారా మీకు సెల్ఫ్ ఐసోలేట్ కావాలంటూ అలర్ట్ వస్తుంది. మెసేజ్ టెక్స్ట్, ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా రావొచ్చు. ఒకవేళ వస్తే.. మిమ్మల్ని 10 రోజుల పాటు ఐసోలేట్ కావాలని సూచించవచ్చు. ఒకవేళ మీలో ఎలాంటి లక్షణాలు లేవు కదా.. నిర్లక్ష్యంగా ఉండరాదు.. మీలో లక్షణాలు బయటపడటానికి ముందే మీరు ఇతరులకు వైరస్ వ్యాపింపజేస్తారని మరిచిపోవద్దు.. ఒకవేళ మీలో కరోనా లక్షణాలు కనిపిస్తే.. మీతో పాటు ఇంట్లో ఉండేవారు కూడా 10 రోజుల పాటు తప్పక సెల్ఫ్ ఐసోలేట్ కావాల్సి ఉంటుంది. మీరు ముందుగా కరోనా టెస్టు చేయించుకోండి.. మీలో వైరస్ ఉందో లేదో చెక్ చేసుకోండి.