Watching TV : అధిక సమయం టీ.వీ చూసే అలవాటుందా?…అయితే జాగ్రత్త?..

ముఖ్యంగా కాళ్లలోని సిరల్లో రక్తం గడ్టకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత అది ఊపిరితిత్తుల వరకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. దీని కారణంగా పల్మనరీ ఎంబాలిజం ప్రమాదముందని వెల్లడించారు.

Watching TV  : అధిక సమయం టీ.వీ చూసే అలవాటుందా?…అయితే జాగ్రత్త?..

Waching Tv

Updated On : January 24, 2022 / 12:04 PM IST

Watching TV : ప్రతిరోజు ఎక్కవ సమయంలో టీ.వీ ముందే గడిపేస్తున్నారా…అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఎందుకంటే టీవీని ఎక్కువ సేపు చూడకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. .టీవీని ఎక్కువ సేపు చూస్తే కళ్లు దెబ్బతినటంతోపాటు దృష్టి లోపం సమస్యలు వస్తాయని ఇప్పటికే వైద్యులు కూడా హెచ్చరికలు జారీచేశారు. అయితే తాజాగా మరో ఆసక్తికర విషయం బయటపడింది. ఎక్కువ సేపు అదే పనిగా టీవీ చూస్తుంటే మాత్రం వారు డేంజర్లో పడ్డట్టేనని పరిశోధకులు తేల్చారు. ప్రతిరోజూ నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూస్తే శరీరంలో రక్తం గడ్డకట్ట వచ్చని యూకే శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

ప్రతి రోజు నాలుగు గంటలకు మించి టీవీ చూస్తే శరీరంలో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కవ శాతం పెరుగుతాయని యూకేలోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడించింది. తద్వారా ఎన్నో అనారోగ్య సమసయలు వస్తాయని వారు నిర్ధారణకు వచ్చారు. బ్రిటన్ శాస్త్రవేత్తలు టీవీ వీక్షణ సమయంపై అధ్యయనం చేపట్టారు. టీవీ ఎక్కువ సేపు చూడడం వల్ల వీనస్ థ్రోంబోలిజమ్ బారినపడే ప్రమాదముందని శాస్త్రవేత్తలు తేల్చారు.

ముఖ్యంగా కాళ్లలోని సిరల్లో రక్తం గడ్టకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత అది ఊపిరితిత్తుల వరకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. దీని కారణంగా పల్మనరీ ఎంబాలిజం ప్రమాదముందని వెల్లడించారు. ఎక్కువ సేపు టీవీ చూసే వారు, అసలు టీవీ చూడని లేదా అరుదుగా చూసే వారిలో వీనస్ థ్రోంబోలిజమ్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పరిశోధకులు విశ్లేషించారు. అరగంట పాటు నిలబడి స్ట్రెచింగ్ చేయాలి. అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. ఇక టీవీ చూస్తున్నప్పుడు జంక్ ఫుడ్, ఇతర ఫాస్ట్ ఫుడ్ వంటివి అస్సలు తీసుకోవద్దు.

సుదీర్ఘ సమయం టి.విని చూడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తలెత్తటంతోపాటు కాళ్లల్లో, చేతుల్లో, పొత్తికడుపు మరియు ఊపిరితిత్తుల్లో ఉండే నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు వ్యాయామాలు చేస్తూ టీ.వీ చూసేవారిలో రక్త గడ్డకట్టే సమస్య చాలా తక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ముఖ్యంగా 60 ఏళ్ళ పైబడిన వారిలో రక్తం గడ్డ కట్టే సమస్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు. టీ,వి. చూసే సమయంలో చక్కెర పానీయాలు, స్నాక్స్ వంటి వాటి జోలికి వెళ్ళకపోవటమే మంచిది. వాటిని తీసుకుంటే బరువు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి.