International Year of millets 2023 : అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా 2023ను ఎందుకు పరిగణిస్తున్నారో తెలుసా?

గత దశాబ్దంలో భారత ప్రభుత్వం మిల్లెట్‌ల సాగు, వినియోగాన్ని ప్రోత్సహించడం ప్రారంభించింది, మిల్లెట్‌లను ముతక ధాన్యాలు అని పిలవడానికి బదులుగా న్యూట్రిసిరియల్స్ గా రీబ్రాండింగ్ చేయడం ప్రారంభించింది.

International Year of millets 2023 : అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా 2023ను ఎందుకు పరిగణిస్తున్నారో తెలుసా?

International Year of millets 2023 :

International Year of millets 2023 : సాంప్రదాయ భారతీయ వంటకాలలో ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన ప్రధానమైన, పోషక విలువలు కలిగిన మిల్లెట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎంతగా అంటే 2023ని “మిల్లెట్ల సంవత్సరం”గా ప్రకటించటమే ఇందుకు నిదర్శనం. మిల్లెట్స్ అనేది చిరు ధాన్యాల సమూహం. వీటిని తక్కువ భూమిలో , పరిమిత నీటిపారుదల సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో పండిస్తారు. వీటిని ధాన్యం రూపంలో గంజిగా మరియు బియ్యానికి ప్రత్యామ్నాయాలుగా, బ్రెడ్‌లు మరియు ఇతర ఆహారపదార్ధాలను తయారు చేయడానికి పిండిగా ఉపయోగించవచ్చు.

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నెమ్మదిగా పాతకాలపు ఆహారపు అలవాట్లు తిరిగి అనుసరిస్తున్నారు. దీనిని మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. డిసెంబరు 2022లో జరిగిన ఈ ప్రకటన జరిగింది. మిల్లెట్‌లు భారతదేశంలో, ఆఫ్రికాలోని కొన్ని భాగాల్లో అనేక శతాబ్దాలుగా ప్రధాన ఆహారంగా ఉన్నాయి. 5,000 సంవత్సరాల క్రితం చైనా నుండి ఈ తృణధాన్యాలు వచ్చినట్లు చరిత్రచెబుతుంది. జొన్న,జొన్నలు, సజ్జలు, కోర్రలు, వరిగెలు, రాగులు, గోధుమలు, ఓట్స్,
కులై, అరికెలు, అండు కొర్రలు, సమాలు, ఊద‌లు, కార్న్,ఉలవలు మొదలగునవి.

భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వీటిని సాగు చేస్తున్నారు. ఇవి రంగు, పరిమాణం మరియు ఆకృతిలో మారుతూ ఉంటాయి, కానీ దాదాపు ఒకే పోషకాహార విలువలను కలిగి ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి వీటిని వివిధ భారతీయ భాషలలో స్థానిక పేర్లుతో ఈ ధాన్యాలను పిలుస్తున్నారు. ఏది ఏమయినప్పటికీ, 1960లలో హరిత విప్లవం తర్వాత భారతదేశంలో మిల్లెట్ల సాగు, వినియోగం క్షీణించింది, భారత ప్రభుత్వం దేశీయ వినియోగం , ఎగుమతి రెండింటికీ ఆహార ఉత్పత్తిని పెంచడానికి హైబ్రిడ్, అధిక దిగుబడినిచ్చే గోధుమలు , బియ్యం పండించే విధంగా రైతులను ప్రోత్సహించింది.

అప్పటి నుండి మిల్లెట్‌లు గ్రామీణ మరియు గిరిజన వర్గాల ఆహారంగా చూస్తున్నారు. రాగి ముద్ద ,జొన్న రొట్టె వంటి మోటైన వంటకాలను చౌకగా, కడుపు నింపే భోజనంగా పరిగణిస్తున్నారు. అయితే శీతాకాలపు జలుబులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుందని నేటికీ చాలా మంది విశ్వసిస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో మిల్లెట్ ఆధారిత భోజన సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతూ, ఈ వంటల గురించి తరతరాలుగా తెలుసుకుంటూనే ఉన్నారు.

ప్రస్తుతం మిల్లెట్ల యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను అర్థం చేసుకోవడం ప్రారంభమైంది. ఆధునికీకరణ, పెరుగుతున్న సౌకర్యాలతో సాంప్రదాయకంగా ఉన్న ఆహారాలను అందరూ మరచిపోయారు. అందుకే భారతీయులు ప్రపంచంలోనే అత్యధిక మధుమేహం రేటును కలిగి ఉన్నారు. బియ్యం మరియు గోధుమల వంటి ఆహారాలను తీసుకోవటమే ఇందుకు కారణమని పోషకాహార నిపుణులు సైతం చెబుతున్నారు.

మిల్లెట్స్ సహజంగా గ్లూటెన్ రహితం కాదు, అవి ప్రాసెస్ చేసిన గోధుమలు మరియు బియ్యం కంటే చాలా ఎక్కువ ఇనుము మరియు కాల్షియంను కలిగి ఉంటాయి. వాటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి లేదా ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న వారికి మిల్లెట్స్ మంచి ఎంపిక. ఉదాహరణకు వంద గ్రాముల రాగి ధాన్యంలో 344 గ్రా కాల్షియం ఉంటుంది, బియ్యంలో 33 గ్రా మరియు గోధుమలలో 30 గ్రా మాత్రమే ఉంటుంది.

మిల్లెట్లకు తిరిగి ప్రాచుర్యం తీసుకురావలన్న ఆలోచన వెనుక వ్యవసాయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మిల్లెట్‌లు ఎక్కువ నీరు లేదా ఎరువులు అవసరం లేకుండా సాగు చేసేందుకు అనుకూలమైన పంటలు. ఎలాంటి పరిస్థితులలో అయినా వీటిని సాగు చేయవచ్చు. ఎలాంటి పంటలు పండని భూముల్లో సైతం మిల్లెట్స్ పంటలు సాగుచేయవచ్చు. అంతేకాకుండా ప్రధాన పంట కాలాల మధ్య వీటిని సాగుచేపట్టవచ్చు. స్వంత సూక్ష్మపోషకాలతో సాగు భూమిలోని మట్టి నాణ్యతను పెంచటలో సహాయపడతాయి.

గత దశాబ్దంలో భారత ప్రభుత్వం మిల్లెట్‌ల సాగు, వినియోగాన్ని ప్రోత్సహించడం ప్రారంభించింది, మిల్లెట్‌లను ముతక ధాన్యాలు అని పిలవడానికి బదులుగా న్యూట్రిసిరియల్స్ గా రీబ్రాండింగ్ చేయడం ప్రారంభించింది. మిల్లెట్ ఉత్పత్తికి భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్లను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన విధానాలను అనుసరిస్తుంది భారత ప్రభుత్వం. మిల్లెట్స్ సాగును ప్రోత్సహించటం ఒకవైపు, మరోవైపు వాటిని విదేశాలకు ఎగుమతి చేయటం ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని అర్జింజటం మరో వైపు ఇలా ప్రత్యేక లక్ష్యాన్ని భారత ప్రభుత్వం నిర్ధేశించుకుంది. అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నదే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది.

మిల్లెట్‌లు ప్రస్తుతం భారతీయ ఆహార వంటకాల్లోకి తిరిగి చేరుతున్నాయి., సంపన్నమైన వర్గాలు ఆరోగ్య క్షేమం కోసం వారి రోజువారి ఆహారాలలో తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాలను చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అలవాట్లు అటు క్రిందిస్ధాయి వర్గాలు అనుసరించేందుకు మరింత అవకాశం ఏర్పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెస్టారెంట్ లు, ఫుడ్ కోర్టులు సైతం ప్రస్తుతం మిల్లెట్స్ తో తయారు చేసిన ఆహారాలను స్పెషల్ గా ఆహార ప్రియులకు అందిస్తున్నారు. మిల్లెట్స్ తో విభిన్న శైలిలో రాగి పిజ్జాలు, రాగిపాన్ కేక్ లు, మిల్లెట్ మిశ్రమాలతో శాఖాహార హలీమ్, మిల్లెట్ బిస్కెట్స్ వంటి వాటిని రుచికరంగా తయారు చేసి విక్రయిస్తున్నారు.

అదే క్రమంలో మిల్లెట్లువిస్తృత ఆధారితంగా మారాలంటే, వాటిని సాంప్రదాయ వంటకాలు, వంట పద్ధతులలో కాకుండా నేటి తరానికి మరింత ఆమోదయోగ్యమైన రూపంలో అందించాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. అప్పుడే వాటిని వినియోగం బాగా పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్త మౌతుంది. ఇప్పటికే కొన్ని ఆహారపదార్ధాల తయారీ కంపెనీలు నూడుల్స్, పాన్‌కేక్ మిక్స్‌లు, అల్పాహార తృణధాన్యాలు వంటి స్నాక్స్ , రెడీమేడ్ ఆహారపదార్ధాల రూపంలో అందిస్తున్నాయి.