Digestion : జీర్ణక్రియ నోటితోనే మొదలవుతుందా? దంతాలు జీర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసా ?
జీర్ణం కావడానికి అనువుగా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయటం లో దంతాలు సహాయపడతాయి. కాబట్టి దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవటం మంచిది. పండ్లు, కూరగాయలు, కాల్షియం, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

digestive system
Digestion : జీర్ణక్రియ అనేది పొట్టలో పేగులు నిర్వహించే ప్రక్రియ మాత్రమే కాదు. జీర్ణక్రియలో నోరు కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. నిజానికి, దంతాలు జీర్ణక్రియలో అత్యంత ముఖ్యమైనవి. జీర్ణక్రియలన్నీ నోటి లోపలే మొదలవుతాయి. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం నుండి జీర్ణమయ్యే రూపంలోకి మార్చడం వరకు, దంతాలు, నాలుక, లాలాజలం ముఖ్య విధులను నిర్వర్తిస్తాయి.
READ ALSO : High Blood Pressure : అధిక రక్తపోటు సమస్య గుండెకు ప్రమాదకరమా ?
జీర్ణ వ్యవస్థలో దంతాలు నిర్వర్తించే విధులు ;
తీసుకునే ఆహారాన్ని బాగా నమలాలి. నమలినప్పుడు ఘన ఆహారాలు చిన్న ముక్కలుగా దంతాలక్రిందపడి నలిగి మెత్తగా మార్చబడతాయి. ఆహారాన్ని చిన్న ముక్కలుగా నమలడం వల్ల పొట్టలోని జీర్ణ రసాలు మెరుగ్గా పనిచేస్తాయి. జీర్ణక్రియ, పేగుల పనితీరు బాగుంటుంది. అంతేకాకుండా పోషకాలు శరీరానికి అందుతాయి. ఆకలి ఉండటంతోపాటుగా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
READ ALSO : Tooth Decay : దంతాలు పుచ్చిపోవటానికి కారణాలు తెలుసా! పుచ్చిపోకుండా ఉండాలంటే ఏంచేయాలి?
దంతాలు ఆహారాన్ని నమిలి పెద్దగా మారుస్తున్నప్పుడు , నోటిలోని గ్రంథులు మరింత లాలాజలాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రేరేపితమవుతాయి. లాలాజలం తీసుకున్న ఆహారాన్నిపేస్ట్‌గా మారుస్తుంది. దీని వల్ల ఆహారం మింగడం సులభంగా ఉంటుంది. ఈ ప్రక్రియ పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. లాలాజలం అమైలేస్ వంటి ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది, ఇది పిండి పదార్ధాలను సాధారణ చక్కెరలుగా విభజించి తద్వారా కార్బోహైడ్రేట్ల రసాయన జీర్ణక్రియను ప్రారంభిస్తుంది.
READ ALSO : CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
జీర్ణం కావడానికి అనువుగా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయటం లో దంతాలు సహాయపడతాయి. కాబట్టి దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవటం మంచిది. పండ్లు, కూరగాయలు, కాల్షియం, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చక్కెర ఆహారాలు, పానీయాలను పరిమితమోతాదులో తీసుకోవాలి. దంత ఆరోగ్యం కోసం ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు దంతాలు, నాలుకను శుభ్రం చేసుకోవాలి. అవసరమైతే దంతవైద్యుడిని కలసి తగిన సూచనలు, సలహాలు తీసుకోవాలి.
దంతాలు ఆరోగ్యంగా లేకుంటే, మీరు మీ ఆహారాన్ని సమర్థవంతంగా విచ్ఛిన్నం జరగదు. నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే జీర్ణక్రియ మాత్రమే కాకుండా ఇతర శారీరక విధులపై ప్రభావం పడుతుంది.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి సూచనలు , సలహాలు పొందటం మంచిది.