Drinking Water : సరైన మోతాదులో నీరు తీసుకోకపోతే గుండె పోటు సమస్యలు వస్తాయా?

నీరు తాగడం ద్వారా ఊబకాయం, తలనొప్పి, జీర్ణక్రియ వంటి అనేక సమస్యలను అధిగమించవచ్చు. సరైన సమయంలో, సరైన మోతాదులో నీటిని తీసుకోవడం అన్నది చాలా అవసరం.

Drinking Water : సరైన మోతాదులో నీరు తీసుకోకపోతే గుండె పోటు సమస్యలు వస్తాయా?

Does not drinking enough water lead to heart problems?

Updated On : November 18, 2022 / 12:43 PM IST

Drinking Water : ఆహార నియమాలను సక్రమంగా పాటించకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎక్కువ మోతాదులో ఉప్పు, చక్కెర ఇంకా అలాగే కొవ్వులను తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక లవణం కారణంగా కూడా రక్తపోటు తీవ్రత అనేది బాగా పెరుగుతుంది. ఉప్పుతో సోడియం మోతాదు ఎక్కువైతే గుండె వైఫల్యం వంటి తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. అందుకే శరీరానికి సరిపడినంత మోతాదులో రోజువారిగా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే నీరు తాగాలి. రోజులో ఎంత నీరు తాగాలి అన్న విషయంపై అవగాహన లేకపోతే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దాహం వేసినప్పుడల్లా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఈ చలికాలంలో ఎక్కువగా దాహం వేయదు. నీరు తాగటం అనేది మరిచిపోతాం, తక్కువ నీరు త్రాగడం వల్ల, మనం డీహైడ్రేషన్ బారిన పడాల్సి వస్తుంది. దీనివల్ల అవయవాలను దెబ్బతింటాయి. చలికాలంలోనూ తగినంత నీరు తాగాలి.

నీరు తాగడం ద్వారా ఊబకాయం, తలనొప్పి, జీర్ణక్రియ వంటి అనేక సమస్యలను అధిగమించవచ్చు. సరైన సమయంలో, సరైన మోతాదులో నీటిని తీసుకోవడం అన్నది చాలా అవసరం. రోజులో తాగిల్సిన నీరు అంతా ఒకేసారి కూడా తాగకుండా ప్రతి కొన్ని గంటలకు అవసరం మేరకు నీరు శరీరానికి అందించాలి. రాత్రిపూట మనం పడుకున్న తర్వాత శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది, కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే కనీసం ఒక గ్లాసు నీరు త్రాగాలి, లేకపోతే రక్తం చిక్కగా మారే ప్రమాదం ఉంటుంది. తద్వారా గుండెకు రవాణ అయ్యే మార్గంలో ఇబ్బందులు ఏర్పడి గుండెపోటుకు దారితీయవచ్చునని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

నీరు తాగే భంగిమల విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు. నీరు నిలబడి తాగకూడదు, నీటిని ఆహారంగానే పరిగణించి కూర్చే నీటిని తాగాలి. అయితే మరి కొందరు మాత్ర దీనిని కొట్టిపారేస్తున్నారు. కేవలం అపోహగానే చిత్రీకరిస్తున్నారు. అయితే హడావిడిగా తాగడం వల్ల సమస్యలు వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. చలికాలంలో లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు తాగటం శ్రేయస్కరం.