Garlic : చలికాలంలో భోజనానికి ముందుగా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఇన్ఫెక్షన్లు దరిచేరవా?
వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకునే వారు రక్తహీనత నుంచి త్వరగా బయటపడచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లిలోని రసాయనాలు ఐరన్ విడుదలను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. దీంతో అనీమియా సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Does taking two cloves of garlic before meals during winters cure infections?
Garlic : భారతీయ వంటలలో వెల్లుల్లికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఇంట్లో వంటకాల్లో దీనిని ఉపయోగిస్తారు. శాఖాహారమైనా, మాంసాహారమైనా తప్పనిసరిగా ఆహారంలో దీనిని చేరుస్తారు. వెల్లుల్లి ఆహారానికి రుచి, సువాసనను అందించటమేకాక అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వెల్లుల్లిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఇలా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
ముఖ్యంగా చలికాలంలో వెల్లుల్లి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. తరచూ ఆహారంలో భాగంగా దీన్ని తీసుకునే వారిలో జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు దరిచేరవు. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా గొంతు సంబంధిత సమస్యలు మనల్ని బాధించవు. అందుకే గొంతు నొప్పితో బాధపడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లి సహజ మార్గం. మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీర బరువు ఎక్కువగా ఉన్నవారు వెల్లుల్లి తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశాలున్నాయి. అనియంత్రిత రక్తపోటు వల్ల స్ట్రోక్, గుండెపోటు వంటి గుండె సమస్యలు వస్తాయి. ఇది మూత్రపిండాల వైఫల్యానికి కూడా కారణమవుతుంది. కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుకోవడం కోసం వెల్లుల్లి తీసుకోవటం మంచిది. శరీరంలో పేరుకున్న అధిక కొవ్వును కరిగించడంలో వెల్లుల్లి ఉపకరిస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించి, శరీర బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడి గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చు. వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్ మరియు పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి కణాలకు అవసరమైన పోషకాలు మరియు ఆక్సిజన్ శక్తిని అందిస్తాయి. ఇది క్యాన్సర్, మధుమేహం, అల్జీమర్స్ మరియు గుండె జబ్బుల ప్రభావాలను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది.
వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకునే వారు రక్తహీనత నుంచి త్వరగా బయటపడచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లిలోని రసాయనాలు ఐరన్ విడుదలను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. దీంతో అనీమియా సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకల పెళుసుదనాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరగడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడేందుకు సహాయపడుతుంది.
మెదడు పనితీరుపై ప్రభావం చూపించే అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల బెడద ఉండదు. వెల్లుల్లి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. చర్మానికి మేలు చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది. చర్మం ముడతలను పోగొడుతుంది. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. మొటిమలు లేకుండా క్లియర్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు. కీళ్ల నొప్పులు మరియు కండరాల నొప్పులకు వెల్లుల్లి నూనెను అప్లై చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. చలికాలంలో భోజనానికి ముందు రెండు వెల్లుల్లి రెబ్బలను అన్నం ముద్దతో కలిపి తీసుకోవటం మంచిదని నిపుణులు సైతం సూచిస్తున్నారు.