Garlic Boosts Immunity : వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందా?
పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల చర్మం, జుట్టు, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది సల్ఫర్‌తో పాటుగా అవసరమైన ఖనిజాలు కలిగి ఉన్నందున శరీరం నుండి విషపదార్ధాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

garlic
Garlic Boosts Immunity :పురాతన కాలంలో నుండి అనేక గృహ చికిత్సలలో వెల్లుల్లిని ఉపయోగిస్తూ వస్తున్నారు. దీనిలో ఉన్న ఔషదలక్షణాలే ఇందుకు కారణం. ఆయుర్వేదం సైతం దీని యొక్క ఔషదలక్షణాల గురించి ప్రముఖంగా వివరించింది. రోగనిరోధక శక్తిని పెంచటంలో వెల్లుల్లి లక్షణాలు కలిగి ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. బలమైన రోగనిరోధక శక్తిని నిర్మించుకునేందుకు రోజువారి ఆహారంలో వెల్లుల్లిని తీసుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.
READ ALSO : Hyderabad : మియాపూర్‌లో 27 కిలోల బంగారం స్వాధీనం
ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో అద్భుతమైన మసాలాగా వెల్లుల్లిని ఉపయోగిస్తున్నారు. వంటకాలకు రుచిని కలిగిస్తుంది. అందుకే పురాతన కాలం నుండి వంటకాలలో దీనిని వాడుతున్నారు. వెల్లుల్లిలో విటమిన్ బి1, బి2, బి3, బి6, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, జింక్, ఐరన్, మాంగనీస్, కాల్షియం వంటి విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
వెల్లుల్లిని రోగనిరోధక శక్తి బూస్టర్‌గా మార్చేది దానిలో ఉండే అల్లిసిన్. ఇది అనేక వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మశూచి, కరోనరీ వ్యాధులు, సీజనల్ గా వచ్చే ఇన్ఫెక్షన్లు మొదలైన అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.
READ ALSO : Kasani Gnaneshwar : తెలంగాణలో టీడీపీ పోటీపై కాసాని జ్ఞానేశ్వర్ కీలక వ్యాఖ్యలు
జెర్మ్స్‌తో పోరాడేందు వెల్లుల్లిలోని ప్రధాన పదార్ధం అల్లిసిన్ సహాయపడుతుంది. వెల్లుల్లిని రోగనిరోధక శక్తి పెంచడానికి పచ్చిగా తినవచ్చు. వెల్లుల్లిని నమలడం వల్ల నోటిలోని అల్లిసిన్ విడుదలై శరీరం దానిని గ్రహిస్తుంది. ఒక రోజులో 2-3 పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలితినవచ్చు. సూప్‌లు, సలాడ్‌లు మొదలైన వాటిలో వాడుకోవటం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు.
పెరిగిన ట్రైగ్లిజరైడ్స్ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. గుండెపోటుకు దారితీయవచ్చు. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉండటం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిని సహజంగా తగ్గించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతుంది.
READ ALSO : Hyderabad: ఎన్నికలయ్యాకే ఇళ్లు కొంటామంటున్న బయ్యర్లు.. ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు?
పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల చర్మం, జుట్టు, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది సల్ఫర్‌తో పాటుగా అవసరమైన ఖనిజాలు కలిగి ఉన్నందున శరీరం నుండి విషపదార్ధాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే మూలకాలు రక్తప్రవాహం నుండి వ్యర్ధాలను ఫిల్టర్ చేయడానికి అవసరమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడానికి కాలేయాన్ని ప్రేరేపిస్తాయి.
బాక్టీరియా దాడులు, పరాన్నజీవి, వివిధ ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల చికిత్సకు వెల్లుల్లి సారాలను ఉపయోగిస్తారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, టేప్‌వార్మ్స్, సాధారణ ఫ్లూ , వైరల్ ఫీవర్ వంటి వ్యాధులను నయం చేయడానికి వెల్లుల్లి సారాన్ని ఉపయోగించవచ్చు. వెల్లుల్లిలోని అల్లిసిన్ రక్తంలో చక్కెర స్థాయిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అలాగే, ముడి తేనెతోకలిపి పచ్చి వెల్లుల్లి తీసుకుంటే బరువును కంట్రోల్ లో ఉంచవచ్చు. కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
READ ALSO : Alasanda Cultivation : అలసంద సాగులో పంటకోత.. కోత అనంతరం జాగ్రత్తలు !
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిని సూచనలు, సలహాలు పొందటం మంచిది.