Night Dinner : రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా… అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..
నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఊబకాయానికి దారితీస్తుందని నిపుణులు వెల్లడించారు. చాలా ఆలస్యంగా ఆహారం తినడం వల్ల ఆహారం సరిగా జీర

Dinner
Night Dinner : వేళకు భోజనం చేయకపోతే ఎన్నో అనర్ధాలను చవిచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో భోజనాన్ని చాలా మంది ఆలస్యంగా చేస్తుంటారు. పొద్దు పోయేంత వరకు ముచ్చట్లతో కలాం గడిపి నిద్రపోయే ముందుగా భోజనం చేసి బెడ్ పై వాలిపోతుంటారు. ఇలా చేయటం వల్ల అనేక అనే ఇబ్బందులు తప్పవని పరిశోధనల ద్వారా తేలింది. పరిశోధనల ప్రకారం మనం రాత్రి తినే భోజనానికి నిద్రకు మధ్య సుమారు మూడు గంటల వ్యవధి తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మనం తిన్న ఆహారం క్రమపద్ధతిలో జీర్ణమవుతుంది. ఇలా చేయటం వల్ల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవచ్చు.
నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఊబకాయానికి దారితీస్తుందని నిపుణులు వెల్లడించారు. చాలా ఆలస్యంగా ఆహారం తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాక అందులో ఉన్నటువంటి కేలరీలు మన శరీరంలో పేరుకుపోయి ఊబకాయానికి దారితీస్తుంది.అదేవిధంగా రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోయి మధుమేహానికి దారితీస్తుంది. అదే విధంగా అధిక రక్తపోటు సమస్యకు కూడా కారణమవుతుంది. తిన్నవెంటనే నిద్రపోవటం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిపుణులు సూచిస్తున్నారు.
విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల ఆ ప్రభావం మెదడు పనితీరు పై పడుతుందని తేలింది. ఈ క్రమంలోనే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు వెల్లడించారు. నిద్రపోవడానికి మూడు గంటల ముందుగా ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల జీర్ణక్రియ సజావుగా ఉండటంతోపాటు ఆరోగ్యవంతంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.