పండ్లు, కూరగాయలు తినటం వల్ల చర్మం మిలమిలా మెరిసిపోతుంది

సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలలో పూట్ర్స్, కూరగాయలు తినటం, వ్యాయామం చేయటం, ఒత్తిడి లేకుండా ఎక్కువ సేపు నిద్రపోవటం వల్ల చర్మం బంగారు వర్ణంలో మిలమిలా మెరిసిపోతుందని వారు కనుగొన్నారు. తాజాగా చేసిన పరిశోధనల వల్ల చర్మం రంగు మారటం గుర్తించామని అన్నారు.
మెుక్కల నుండి లభించే పండ్లు, కూరగాయలు తినటం వల్ల చర్మం బంగారు వర్ణంలోకి మారిపోతుంది. ఉదాహరణకు క్యారెట్లు, నారింజ పండ్ల నుంచి కెరోటిన్, టమోటాల నుంచి ఎరుపు లైకోపీన్ వంటి పదార్ధాలు లభిస్తాయి. అందుల వల్ల చర్మం మెరిసిపోతుంది. తద్వారా మనం ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనబడతాం.
మెుక్కల నుంచి లభించే కెరోటినాయిడ్స్ ని పిగ్మెంట్స్(వర్ణద్రవ్యం) అని అంటారు. ఇవి యాంటీఆక్సిడెంట్లుగా మన శరీరంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఆక్సీకరణ శక్తి దెబ్బ తినకుండా కాపాడటంలో సహాయపడతాయి. అందుకే మన శరీరానికి కావాల్సినన్ని యాంటీఆక్సిడెంట్ నిల్వలు ఉండటం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి, ఒక వ్యక్తి చర్మం రంగులో మార్పు వస్తుంది.
సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సైకాలజీ అండ్ న్యూరోసైన్స్ ప్రోపెసర్ డేవిడ్ పెరెట్ ఈ అధ్యయనం గురించి వివరిస్తూ మేము శరీరంలో కొవ్వు స్థానాలను కొలవటానికి impedance meter పరికరాన్ని ఉపయోగించాం అన్నారు. ఈ పరిశోధన వల్ల 21 మందిలో ఫిట్నెస్ ద్వారా చర్మం రంగులు మారాటం కనిపించింది. అంతేకాకుండా 90 శాతం వారు ఆరోగ్యంగా ఉండటం గమనించాం. అంటే దీని అర్ధం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే చర్మం మెరిసిపోవటాన్ని ఇతరులు గుర్తిస్తారని చెప్పారు.
See Also | భారత్ లో తొలి కరోనా మరణం!