వేడి నీటిలో నిమ్మరసం పసుపు కలిపి తాగడం, మామిడిపండు తినడం వల్ల కరోనా తగ్గదు.. WHO

  • Published By: veegamteam ,Published On : March 21, 2020 / 06:47 AM IST
వేడి నీటిలో నిమ్మరసం పసుపు కలిపి తాగడం, మామిడిపండు తినడం వల్ల కరోనా తగ్గదు.. WHO

Updated On : March 21, 2020 / 6:47 AM IST

కరోనా పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్  ధరిచేరకుండా ఉండటానికి నానా పాట్లు పడుతున్నారు. తినే తిండి దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని విషయాల్లో శుభ్రత పాటిస్తున్నారు. అయితే ఈ వైరస్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కొన్ని విషయాలు తెలిపింది. అవేంటో చూద్దాం..

* మీకు ఈత కొట్టాలనుందా?
అయితే ఈత కొట్టే కొలను లేదా స్విమ్మింగ్ పూల్‌లో ఎక్కువ మంది ఉండకుండా చూసుకోండి. తక్కువమంది ఉన్న దగ్గర ఈత కొడితే మంచిది. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండండి. తుమ్ము, దగ్గు ఉన్న వ్యక్తుల నుంచి ఒక మీటర్ దూరం ఉంచండి అని తెలిపింది.

1. రసం, కూర తినడం వల్ల కరోనా చావదు:
రసం లేదా కూర తినడం వల్ల మీకు వ్యాధి సోకకుండా ఉంటుందని అనుకోవడం మీ భ్రమ. ఇది నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని WHO పేర్కొంది.

2. ప్రతి 15 నిమిషాలకు నీళ్లు తాగాలసిన అవసరం లేదు:
నీళ్లు తరచుగా తగడం వల్ల COVID-19 ధరిచేరదని సూచించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని WHO తెలిపింది. కానీ, ప్రతిరోజూ సుమారు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని తెలిపింది.

3. నిమ్మకాయ, పసుపు వాడటం వల్ల కరోనాను నివారించలేము:
నిమ్మ కాయ, పసుపు COVID-19ని దూరం చేస్తోందని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తగినంత పండ్లు, కూరగాయలను తినాలని WHO చెబుతోంది.

4. ఎండ వల్ల కరోనా వైరస్ చావదు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఎండ వల్ల కరోనా వైరస్ నాశనమౌతోందనే మాటకి ఎలాంటి ఆధారాలు లేవు.

5. ధ్రవపదార్ధాలు, ఐస్‌క్రీం తినడం వల్ల ఎలాంటి నష్టం లేదు:
పరిశుభ్రంగా తయారుచేసిన ఆహారం, ఐస్‌క్రీం తినడం వల్ల వైరస్ వ్యాపిస్తుందని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని WHO స్పష్టం చేసింది.

6. పొడిదగ్గు కరోనా వైరస్ లక్షణం మాత్రమే కాదు:
కరోనావైరస్ సోకితే పొడిదగ్గు వస్తుందన్న మాట నిజమే. కానీ, సాధారణంగా దగ్గు, ముక్కు కారటం వంటి లక్షణాలు అందరిలో ఉంటాయి. దగ్గు వస్తే కరోనా ఉందనుకోవడం తప్పని WHO తెలిపింది. 

7. చికెన్ తింటే కరోనా రాదు:
పరిశుభ్రంగా తయారుచేసిన, బాగా ఉడికించిన చికెన్ తినడం సురక్షితం. దానివల్ల కరోనా రాదని WHO స్పష్టం చేసింది. 

8. మామిడిపండు తినడం వల్ల కరోనావైరస్ చావదు:
మామిడిపండు కరోనావైరస్‌ను చంపుతుందని శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ, ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తగినంత పండ్లు, కూరగాయలను తినాలని WHO తెలిపింది.

See Also | జనతా కర్ఫ్యూ, కరోనా వైరస్‌ని చంపేందుకు ప్రధాని మోడీ మాస్టర్ ప్లాన్