Muskmelon : వేసవిలో కర్భూజా తింటే… ఆరోగ్యానికి మంచిదే!…

కర్బూజా లో ఫైబర్ మరియు నీరు ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్, అజీర్తి మొదలైన సమస్యలను తొలగిస్తుంది. కర్బూజ లో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి.

Muskmelon : వేసవిలో కర్భూజా తింటే… ఆరోగ్యానికి మంచిదే!…

Watermelon

Updated On : March 4, 2022 / 6:43 PM IST

Muskmelon : వేసవిలో అనేక రకాల పండ్లు మనకు అందుబాటులో ఉంటాయి. వాటిలో కర్భూజా చాలా ప్రధానమైనది. కర్బూజ పండ్లు మనకి విరివిగానే దొరుకుతాయి. శరీరాన్ని చల్లబరచడమే కాకుండా వేసవితాపాన్ని తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పోషకాలతోపాటు వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో కర్భూజపండు బాగా ఉపయోగపడుతుంది. దప్పిక తీర్చటంతో పాటు శరీరంలోని నీటిశాతాన్ని కాపాడి తక్షణ శక్తినిస్తుంది.

కర్బూజాలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. వీటితో జ్యూస్ చేసుకుని తాగితే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. నిజానికి కర్బూజ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కప్పు కర్బూజ ముక్కల్ని తింటే 40 శాతం లైకోపెన్‌ లభిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు దరి చేరవు. క్యాన్సర్ మొదలు ఎన్నో సమస్యలను తొలగించడానికి ఈ పండు మనకి సహాయపడుతుంది. అధిక రక్తపోటు తగ్గించటంతో పాటు రక్తంలోని చక్కెరశాతాన్నిసమన్వయం చేయటంలో దోహదపడుతుంది.

కర్బూజా లో ఫైబర్ మరియు నీరు ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్, అజీర్తి మొదలైన సమస్యలను తొలగిస్తుంది. కర్బూజ లో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి. అలానే క్యాన్సర్ రాకుండా చూసుకుంటాయి. కర్బూజ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. క్యాన్సర్ రిస్క్ నుండి బయట పడే స్తాయి. ఇందులో ఉండే బీటాకెరోటిన్, లుటీన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళకి ఇందులో ఉండే నీరు కిడ్నీలను శుభ్రపరుస్తాయి. కర్బూజాను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది.

కర్భూజా ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. నిద్రలేమి సమస్య పోగొడుతుంది. మహిళలు నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులును తొలగిస్తుంది. పంటి నొప్పి, అల్సర్ దగ్గు మొదలైన సమస్యలను కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కర్బూజాలో అతితక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కర్బూజలో కొలెస్ట్రాల్ ఉండదు. కర్బూజలో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.