Eating sitting on the floor : నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
ఇప్పుడంతా ఎవరిదారిన వారు టీవీలు చూస్తూ, సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని భోజనాలు చేస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేచోట నేలపై కూర్చుని కలిసి భోజనాలు చేసేవారు. ఇలా చేయడం వల్ల బంధాలు బలపడటమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Eating sitting on the floor
Eating sitting on the floor : ఒకప్పుడు భారతదేశంలో కుటుంబ సభ్యులంతా నేలపై కూర్చుని భోజనాలు చేసేవారు. ఇది సంప్రదాయంగా కూడా భావించేవారు. ఇప్పుడు అందరూ సోఫా, డైనింగ్ టేబుల్, లేదా టీవీ ముందు కూర్చుని తినడానికి ఇష్టపడుతున్నారు. అలా రిలాక్స్‌డ్ గా తినడం తప్పు కాదు.. కానీ నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
After Meal : భోజనం తరువాత చేయకూడని పనులివే
నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట. ప్లేట్ నేలపై ఉండాలి.. తినడానికి శరీరాన్ని కొద్దిగా ముందుకు కదిలించాలి. ఈ చర్య వల్ల పొత్తికడుపులో ఉండే కండరాలు పనిచేస్తాయి. ఈ చర్య ఆమ్లాల స్రావాన్ని పెంచుతుందట. అంతేకాదు ఆహారం త్వరగా జీర్ణం అవడానికి అనుమతి ఇస్తుందట.
కింద కూర్చుని తినడం వల్ల శరీరానికి కదలిక పెరుగుతుంది. కొవ్వు కూడా తగ్గుతుందట. కింద కూర్చున్నప్పుడు అతిగా తినరట. శరీరం అలసట, బలహీనతలు తగ్గించడంలో ఎంతో మేలు జరుగుతుందట. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందట. మనం కూర్చుని తినడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటుందట. సుఖాసనలో బాడీ అంతటా రక్తం సమానంగా పంపిణీ జరుగుతుందట.
భోజనం తర్వాత స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లు తింటున్నారా?
నేలపై కూర్చుని భోజనం చేయడం ద్వారా కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. వెనుక భాగం నిటారుగా ఉంటుంది. కాళ్లకు బలాన్ని అందిస్తుంది. కింద కూర్చుని భోజనం చేసేవారు ఎక్కువ ఆయుర్దాయం కలిగి ఉంటారని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఎటువంటి సపోర్ట్ లేకుండా లేవగలిగే బలం, చురుకుదనం కింద కూర్చుని భోజనం చేయడం వల్ల ఉంటుంది.
కింద కూర్చుని పద్మాసనం, సుఖాసనం వేయడం మనస్సుకి ఒత్తిడి తగ్గుతుంది. నేలపై కూర్చుని శ్వాస వ్యాయామాలు చేయడం కూడా చాలా మంచిది. ఇలా చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. టీవీ ముందు కూర్చుని తినడం కంటే అందరూ చక్కగా ఒక చోట చేరి నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది. బంధాలు కూడా బలపడతాయి.