Junk Food : పిల్లలపై జంక్ ఫుడ్ ప్రభావం!

జంక్ ఫుడ్స్ ను అధికంగా తీసుకునే పెద్ద వయస్సు వారిలో మధుమేహం, గుండె జబ్బుల వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఆస్తమా, అలర్జీ సమస్యలు చవిచూడాల్సి వస్తుంది.

Junk Food : పిల్లలపై జంక్ ఫుడ్ ప్రభావం!

Junk Food

Updated On : May 2, 2022 / 4:51 PM IST

Junk Food : తక్కువ పోషకాలుండి, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్నే జంక్ ఫుడ్ గా చెప్తారు. చిప్స్, వేపుళ్లు, తీపి పదార్ధాలు, తియ్యని పానీయాలు, చాక్లెట్లు, బర్గర్లు, పిజ్జాలు , సమోసాలు, కచోరీ, నూడుల్స్, టిక్కీ తదితరాలన్నీ ఫాస్ట్ ఫుడ్స్ జాబితాలోకే వస్తాయి. నూనెల్లో వేయించటం మూలంగా వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు తక్కువగా ఉంటాయి. అధిక కొవ్వులు కలిగి ఉండి శరీరానికి ఎక్కువ కేలరీలు అందిస్తాయి. పోషకాలున్న ఆహారంతోపాటు, జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎటొచ్చి అచ్చం జంక్ ఫుడ్ మాత్రమే తీసుకునే వారు మాత్రం ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ముఖ్యంగా పెద్ద వారి కంటే పిల్లలపై జంక్ ఫుడ్ ప్రభావం అధికంగా ఉంటుంది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకునే చిన్నారులకు ఆస్థమా, ఎక్సేమా తోపాటు ఇతర రోగాల భారిన పడే అవకాశాలు ఉంటాయి. వారిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. తినే సమయంలో టేస్టీగా అనిపించినా తరువాత వాటి పర్యవసానాలు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. స్ధూలకాయం, మధుమేహం వంటి సమస్యలు చిన్నవయస్సులోనే వచ్చే అవకాశం ఉంటుంది. కూల్ డ్రింక్స్ వంటి వాటి వల్ల దంతక్షయం వచ్చి పండ్ల సమస్యలు వస్తాయి.

జంక్ ఫుడ్స్ ను అధికంగా తీసుకునే పెద్ద వయస్సు వారిలో మధుమేహం, గుండె జబ్బుల వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఆస్తమా, అలర్జీ సమస్యలు చవిచూడాల్సి వస్తుంది. తీసుకునే ఆహారం విషయంలో సమతుల్యత పాటించటం తప్పనిసరి. జంక్ ఫుడ్ తినాలని పించే సమయంలో కొన్ని కూరగాయ ముక్కలను కోసుకుని తినటం మంచిది. కూల్ డ్రింక్స్ కు బదులుగా బత్తాయి, ద్రాక్ష వంటి జ్యూస్ లను తాగటం మేలు. చక్కెర తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మెదడు చురుకు దనాన్ని తగ్గించే జంక్ ఫుడ్స్ ను ఎదుగుతున్న దశలో ఉన్న పిల్లలు తినకపోవటమే మంచిది.