monsoon..Electricity : వర్షాకాలంలో విద్యుత్‌తో జర భద్రం, ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి
వర్షాకాలంలో విద్యుత్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షంతో పాటు గాలి కూడా వీస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి. పలు సూచనలు పాటించాలి.

Electricity Precautions in Rainy Season
Alert with electricity rainy season : వర్షాకాలం కాలు బయట పెట్టాలంటే అప్రమత్తంగా ఉండాల్సిందే. మరి ముఖ్యంగా నగరాల్లో. కాలు బయటపెడితే భారీ వాన నీటిలో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అనే భయం. దాంట్లో పడితే ఇక ప్రాణాలపై ఆశ వదిలేసుకోవాల్సిందే. అంతేకాదు వర్షాకాలంలో విద్యుత్ విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షంతో పాటు గాలి కూడా వీస్తే ఇక విద్యుత్ స్థంబాలు నేలకూలతాయి. అప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాన నీటితో చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగులుతుంటాయి. ఆ సమయంలో వాటిని తాకితే ఇక పెను ప్రమాదమే సంభవిస్తుంది. నీటితో పుట్టిన విద్యుత్ కూడా నీటి తడి తగిలితే ప్రాంతకంగా మారుతుంది.
వర్షాకాలంలో ట్రాన్స్ ఫార్మర్ల వద్ద అస్సలు నిలబడకూడదు. వీలైంతన వరకు విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పనులమీద బయటకు వెళ్లిన సమయంలో వర్షం కురిస్తే ట్రాన్స్ ఫార్మర్ల వద్ద నిలబడకూడదు. అలాగే ఎక్కడైనా విద్యుత్ తీగలు కిందకు వంగినట్లుగా గానీ..రోడ్డుమీద పడి ఉన్నట్లుగా గానీ కనిపిస్తే వాటి వద్దకు వెళ్లకూడదు. అలాగే ఎవ్వరిని వెళ్లకుండా అప్రమత్తం చేయాలి. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేస్తే వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మరి వర్షాకాలంలో విద్యుత్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
-వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల క్రింద, ట్రాన్సఫార్మర్ల వద్ద అస్సలు నిలబడవద్దు..
-వీలైనంతవరకు విద్యుత్ వైర్లకు, స్టే వైర్లకు, ట్రాన్సఫార్మర్లకు, ఇతర విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి.. పశువులను, పెంపుడు జంతువులను కూడా విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి..
-రోడ్ మీద గానీ..నీటిలో కాని విద్యుత్ తీగ పడి వున్నట్లుగా గుర్తిస్తే తీగను తొక్కకూడదు… వాటి మీద నుండి వాహనాలు నడపకూడదు..
-విద్యుత్ తీగలు తెగిపడినట్లుగా గుర్తిస్తే వెంటనే సమీప విద్యుత్ సిబ్బందికి దృష్టికి తీసుకెళ్లాలి..
-విద్యుత్ స్తంభాలను, స్టే వైర్ల ను తాకకూడదు. ఒక వేళ ఎవరైనా తాకి విద్యుత్ షాక్ బారిన పడ్డప్పుడు వారిని రక్షించడానికి విద్యుత్ ప్రవాహకాలైన లోహపు రాడ్లను ఉపయోగించకూడదు. చెక్క లేదా -ప్లాస్టిక్ తో చేసిన పైప్ లను మాత్రమే వినియోగించాలి..
-చెట్ల కొమ్మలపై, వాహనాలపై, భవనాలపై తెగి పడ్డ తీగలు ఉన్నట్లయితే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
-గాలులు వీసే మయంలోను..వర్షం కురుసేసమయంలోను విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసుకోవాలి..వెంటనే కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలి..
-లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు నీటి ప్రవాహం అధికంగా నున్నప్పుడు వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి..
-ఉరుములు, మెరుపులు వచ్చిన సమయంలో ట్రాన్స్ ఫార్మర్ల వద్ద గానీ, సెల్ టవర్ల వద్దగానీ, చెట్ల కింద గానీ నిలబడవద్దు..