Diet During Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లు, జాగ్రత్తలపై నిపుణుల సూచనలు

రక్తంలో హిమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండాలి. కాని పిల్లల కోసం తాపత్రయపడడమే తప్ప ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవాళ్లుచాలా తక్కువ. అందం మీద కాన్షియస్ తో సరిగా తినడం లేదు. దాంతో సరైన పోషకాహారం అందక రక్తం తక్కువగా ఉంటోంది.

Diet During Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లు, జాగ్రత్తలపై నిపుణుల సూచనలు

Pregnancy Diet

Updated On : September 16, 2023 / 3:09 PM IST

Diet During Pregnancy : తల్లి కావాలనే కల పెళ్లయిన ప్రతి ఆడపిల్లకీ ఉంటుంది. అయితే తల్లి కావాలంటే శరీరం అందుకు తగిన ఆరోగ్యంతో ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్లు, ముసలమ్మలగైడెన్స్ ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. కాని ఇప్పుడా ఉమ్మడి కుటుంబాలు లేవు.. గైడ్ చేసే  పెద్దవాళ్లూ లేరు. అసలే నువ్వు మామూలు మనిషివి కావు.. అంటూ ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్పేవాళ్లు. ఇప్పడు తల్లయ్యే వాళ్లకి ఆ అవగాహన ఉండడం లేదు. చాలామంది ఇంటర్నెట్ పై ఆధారపడుతున్నారు. దాంట్లో ఎన్ని కరెక్టో తెలియదు. ఇక ఇంటర్నెట్ వాడని వారికైతే ఆ మాత్రం జాగ్రత్తలు కూడా తెలియవు. అందుకే ప్రెగ్నెన్సీ గురించి నిపుణులను అడిగి ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకుందాం.

READ ALSO : MLA Ganta Srinivasa Rao: చంద్రబాబు అరెస్టు విషయంలో జూ.ఎన్టీఆర్ తీరుపట్ల గంటా ఆసక్తికర వ్యాఖ్యలు

ఆడపిల్లల ఆరోగ్యానికి ప్రధానంగా కావలసింది రక్తం. తగినంత రక్తం శరీరంలో లేకుండా గర్భం దాల్చితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. గర్భం దాల్చడమంటే శరీరంలో ఎన్నెన్నో మార్పులు వస్తాయి. హార్మోన్లలో తేడాలు వస్తాయి.అప్పటివరకూ డామినెంట్ గా ఉన్న ఈస్ట్రోజన్ తగ్గుముఖం పట్టి, ప్రొజెస్టిరాన్ హార్మోన్ డామినెంట్ అవుతుంది. ఈ క్రమంలో శారీరకంగా ఎన్నో మార్పులు.. ఇవన్నీ తట్టుకునే శక్తి శరీరానికి ఉండాలి. ఇందుకోసం పెళ్లయి, గర్భం దాల్చిన తరువాత కాకుండా, నెలసరి మొదలైనప్పటి నుంచే తగిన జాగ్రత్తలు పాటించాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. టీనేజిలో ఉన్నప్పటి నుంచే పండ్లు, కూరగాయలతో కూడిన సమతులాహారం ఇవ్వాలి. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచే క్యారెట్, బీట్ రూట్ వంటి వాటిని ఎక్కువగా ఇవ్వాలి. ఇలా గర్భం రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ 60 శాతం సేఫ్ అవుతుంది.

గర్భవతులు – ఆహారం

 ప్రెగ్నెన్సీ సేఫ్ గా ఉండాలన్నా, డెలివరీ సేఫ్ గా జరగాలన్నా తీసుకునే ఆహారం చాలా ఇంపార్టెంట్. మంచి ఆహారం తీసుకుంటేనే తగినంత రక్తం ఉంటుంది. లేకుంటే అనేక సమస్యలు ప్రసవాన్ని కాంప్లికేట్ చేస్తాయి. అందుకే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పోషకాలతో సమతుల్యంగా ఉన్న ఆహారం తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.

READ ALSO : Hearing Loss : వినికిడి ప్రమాదం రాకుండా ఉండాలంటే ?

రక్తంలో హిమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండాలి. కాని పిల్లల కోసం తాపత్రయపడడమే తప్ప ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవాళ్లుచాలా తక్కువ. అందం మీద కాన్షియస్ తో సరిగా తినడం లేదు. దాంతో సరైన పోషకాహారం అందక రక్తం తక్కువగా ఉంటోంది. జీవనశైలి మారడం వల్ల ఎక్కువ మంది జంక్ ఫుడ్ కే అలవాటు పడిపోయారు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడానికి బదులుగా జంక్తోనే కడుపు నింపుకొంటున్నారు. దీంతో స్థూలకాయ సమస్య, తద్వారా ఎన్నో ఇతర సమస్యలు వస్తున్నాయి. గర్భంతో ఉన్నప్పుడు తగిన పోషకాలు అందకపోతే కడుపులో బిడ్డ పై కూడా దుష్ప్రభావం పడుతుంది. అందుకే గర్భంతో ఉన్నప్పుడు పోషకాహారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

గర్భంతో ఉన్నప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనేక కాంప్లికేషన్లు వస్తాయి. రక్తహీనత, అధిక రక్తపోటు ఈ రెండు సమస్యలూ గర్భవతులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. బిడ్డ ఎదుగుదలలో కూడా లోపానికి కారణమవుతాయి. తగినన్ని పోషకాలు అందకపోతే బిడ్డ ఎదుగుదల కుంటుపడుతుంది. తగినంత రక్తం లేకపోయినా, గర్భంతో ఉన్నప్పుడు రక్తపోటు పెరిగినా బరువు తక్కువ పిల్లలు పుట్టేందుకు కూడా ఆస్కారం ఉంటుంది.

READ ALSO : Pakistan : సంక్షోభ పాకిస్థాన్‌లో మళ్లీ పెట్రో ధరల పెంపు…333 రూపాయలకు చేరిన పెట్రోల్

నార్మల్ డెలివరీ కావాలంటే ;

ప్రసవం అంటేనే పునర్జన్మ ఎత్తినట్టుగా భావిస్తారు. డెలివరీ సవ్యంగా అయిపోవాలని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటారు. ఆపరేషన్ అవసరం అవుతుందంటే ఇక ఏ కాంప్లికేషనో ఉన్నట్టే అర్థం. అందుకే సిజేరియన్ లేకుండా నార్మల్ డెలివరీ అయ్యేందుకే ప్రయత్నం చేయాలి.

గర్భవతి అయినప్పటి నుంచి డెలివరీ నార్మల్ గా అవుతుందో లేదో, ఆపరేషన్ చేసి బిడ్డను తీయాల్సి వస్తుందో అనే బెంగ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొంత మంది మాత్రం బిడ్డ మంచి ముహూర్తంలో పుట్టాలని ముహూర్తం చూసుకుని ఆపరేషన్ ద్వారా బిడ్డను బయటకు తీయమని అడుగుతుంటారు. అంతేగాక ఇప్పటి ఆడపిల్లలకు ఓపిక ఉండడం లేదు. చిన్న నొప్పులను కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇక లేబర్ పెయిన్స్ సంగతి సరేసరి. నొప్పులు పడలేక తొందరగా డెలివరీ అయిపోవాలనే ఆత్రంతో సిజేరియన్ ఆపరేషన్ చేయమంటారు. కొద్దిమందికి మాత్రం రక్తహీనత ఉండడం వల్లనో, రక్తపోటు పెరగడమో, బిడ్డ అడ్డం తిరగడం వంటి కాంప్లికేషన్లు రావడం వల్లనోసిజేరియన్ చేయాల్సి వస్తుంది.  కానీ ఆపరేషన్ కన్నా నార్మల్ డెలివరీ కావడమే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు డాక్టర్లు.

READ ALSO : Pests in Rice : వరిలో పెరిగిన పురుగులు, తెగుళ్ల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

బీపీ పెరగడం వల్ల లేకపోతే తల్లికి రక్తహీనత ఉండడం వల్ల ఆపరేషన్ అవసరం అవుతుంది. డెలివరీ కాంప్లికేట్అవుతుందనుకున్నప్పుడు కూడా సిజేరియన్ చేస్తారు. నార్మల్ డెలివరీ కావాలంటే శారీరకంగా చురుగ్గా ఉండడం అవసరం. అన్నింటికి మించి తల్లికి విల్ పవర్ ఉండడం ఇంపార్టెంట్. కచ్చితంగా నార్మల్ గానే ప్రసవించాలనే గట్టి సంకల్పం ఉండాలి.