Besan Flour : చర్మసౌందర్యానికి శనగపిండితో ఫేస్ ప్యాక్స్!
ఒక టేబుల్ స్పూన్ వేప ఆకుల పొడి, ఒక స్సూన్ శనగపిండి, ఒక స్పూన్ పెరుగు తీసుకుని మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని ఫేస్ పై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Face Fax
Besan Flour : చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో శనగపిండి ఎంతగానో ఉపయోగపడుతుంది. మచ్చలు, మొటిమలు, ఎండ కారణంగా నల్లగా మారిన చర్మాన్ని, ఇతర చర్మ సంబంధమైన సమస్యలను తొలగించటంలో శనగపిండి ఒక ఔషధంగా పనిచేస్తుంది. చర్మంపై జిడ్డును నియంత్రించి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. శనగపిండిలో ఆల్కలైజింగ్ లక్షణాలు చర్మ సమతుల్యతను కాపాడుతుంది. చర్మం లోపల ఉండే దుమ్ము, విష పదార్థాలను తొలగిస్తుంది.
శనగపిండితో ఫేస్ ప్యాక్స్ ;
1. పెరుగు,శనగపిండి ఫేస్ ప్యాక్ ; పెరుగును సెనగ పిండితో కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి. ముఖంపై అప్లై చేసుకుని 15 నిముషాల పాటు ఉంచండి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెరుగు చర్మంపై ఉండే జిడ్డును తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే లాక్టిక్ ఆమ్లం మృత చర్మ కణాలను తొలగిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే జింక్ తరచుగా వచ్చే మొటిమలను తగ్గిస్తుంది.
2. గుడ్డు, శనగపిండి ఫేస్ ప్యాక్ ; గుడ్డులో తెల్లసొన తీసుకుని బాగా కలపండి. దీనికి శనగపిండి కొంచెం తేనె వేసి బాగా కలపాలి. చర్మంపై రాసుకుని 10-15 నిమిషాలు ఉంచుకోవాలి. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో 3సార్లు ఇలా చేయటం వల్ల గుడ్డు తెల్ల సోనా లో ఉండే ఎంజైమ్‌లు చర్మం పై ఉండే ముడతలను తగ్గిస్తుంది. చర్మ కణాల పునర్నిర్మాణ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ రాసుకోవడం ద్వారా చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
3. గ్రీన్ టీ, శనగపిండి ఫేస్ ప్యాక్ ; వేడి నీటిని తీసుకుని అందులో గ్రీన్ టీ బాగ్ వేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. గ్రీన్ టీ నీరు చల్లారిన తరువాత శెనగపిండి కలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. మిశ్రమాన్ని ముఖంపై ఫేస్ ప్యాక్ రాసుకుని 15 నిమిషాలు ఆరనివ్వండి. అనంతరం నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది. చర్మ ఉపరితలంపై దెబ్బతిన్న చర్మాన్ని మెరుగుపరచడానికి యాంటీఆక్సిడెంట్లు సహాయపడతాయి.
4. శనగపిండి, నిమ్మ రసం ఫేస్ ఫ్యాక్ ; రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు అన్ని కలుపుకుని మిశ్రమం చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాలపాటు ఉండాలి. అనంతరం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మలోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చటానికి దోహదపడుతుంది. ఎండకారణంగా వచ్చే నల్లని మచ్చలు తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.
5. శనగపిండి , వేప ఫేస్ ఫ్యాక్ ; ఒక టేబుల్ స్పూన్ వేప ఆకుల పొడి, ఒక స్సూన్ శనగపిండి, ఒక స్పూన్ పెరుగు తీసుకుని మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని ఫేస్ పై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయటం వల్ల చర్మంపై ముడతలు, మొటిమలు తొలగిపోతాయి. వేపలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చర్మ రుగ్మతలను తొలగించటంలో సహాయపడతాయి.