Fenugreek Leaves : రక్తంలో చక్కెర, చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే మెంతి కూర!

మెంతికూర ఆకులు రక్తంలోని లిపిడ్ లెవల్స్‌ పై మెరుగైన ప్రభావం చూపుతాయి. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈమెంతి ఆకులు తోడ్పతాయని పలు అధ్యయనాల్లో తేలింది. గర్భిణీలు తీసుకుంటే శిశువు ఎదుగుదులలో ఇందులోని పోషకాలు దోహదం చేస్తాయి.

Fenugreek Leaves : రక్తంలో చక్కెర, చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే మెంతి కూర!

Fenugreek Leaves

Updated On : July 20, 2022 / 3:44 PM IST

Fenugreek Leaves : పచ్చటి మెంతి కూర ఆకు ఎంతో రుచికరంగాను ఔషధ విలువలు కలిగినదిగా నిపుణులు సూచిస్తున్నారు. మెంతి కూర కొంచెం చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలన్నీ దీని ద్వారా లభిస్తాయి. ముఖ్యంగా మెంతి కూరతో చేసే పప్పును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. మెంతి ఆకులను ఎండబెట్టుకుని ఆహార పదార్ధాల్లో ఉపయోగిస్తారు. మెంతికూరలో అత్యధిక ఐరన్ వుంటుంది. మెంతులను రక్తహీనత వున్న రోగులకు ఔషధపరంగా ఉపయోగిస్తారు.

మెంతికూర లో ఉండే విటమిన్ కె, ఫాస్పరస్ ఎముకలకు బలాన్ని ఇస్తాయి. దీని వల్ల ఆస్టియోపోరోసిస్ సమస్య రాదు. మెంతికూర మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది. మహిళల్లో నెలసరి నొప్పులను దూరం చేస్తుంది. లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర బాగా పనిచేస్తుంది. లివ‌ర్‌ ను శుభ్రం చేయడమే కాకుండా గ్యాస్ పేగుల్లో ఏర్పడే సమస్యలు తొలిగించడంలో ఈమెంతి కూర ఎంతో కీలకంగా అని చేస్తుంది.

మెంతికూర ఆకులు రక్తంలోని లిపిడ్ లెవల్స్‌ పై మెరుగైన ప్రభావం చూపుతాయి. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈమెంతి ఆకులు తోడ్పతాయని పలు అధ్యయనాల్లో తేలింది. గర్భిణీలు తీసుకుంటే శిశువు ఎదుగుదులలో ఇందులోని పోషకాలు దోహదం చేస్తాయి. బాలింతలు మెంతి కూర తినడం వల్ల పాల వృద్ధి బాగుంటుంది. ఒత్తిడినీ దూరం చేస్తాయి. నీరసం వంటి వాటిని పోగొట్టి తక్షణ శక్తినందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పురుషుల్లో సంతాన శక్తి అభివృద్ధి చెందడానికి అవసరమైన టెస్టోస్టిరాన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది.

మెంతికూర విటమిన్ సి సమృద్ధిగా లభించే టొమాటోలతో కలిపి వండితే శరీరం వాటి నుంచి అందే పోషకాలను చాలా త్వరగా గ్రహిస్తుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా మెంతి కూర మేలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాసక్రియలోని అవరోధాలు సరిచేస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కీలకమవుతాయి. కీళ్ళనొప్పులను నయం చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మెంతి ఆకులను పేస్ట్‌గా చేసి జుట్టు కుదుళ్లకు పట్టించి కొంత సేపటి తరువాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యవంతంగా మారుతుంది.