Managing Uric Acid Levels : యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడే చేపలు !

అధిక-ప్యూరిన్ ఆహారాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. కాబట్టి మాకేరెల్ వంటి తక్కువ-ప్యూరిన్ ఎంపికలను ఎంచుకోవడం మంచిది.

Managing Uric Acid Levels : యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడే చేపలు !

managing uric acid

Updated On : September 30, 2023 / 1:49 PM IST

Managing Uric Acid Levels : యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచాలనుకునేవారికి వంజరం రకం చేపలను సిఫార్సు చేస్తారు. వంజరం చేపలను ఆహారంగా తీసుకోవటం ద్వారా ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్‌ ను విచ్ఛిన్నం చేసే సమ్మేళనాలుగా సహాయపడతాయి. వంజరం రకం  అత్యంత పోషకమైన చేపలుగా పరిగణించబడతాయి. వంజరం చేపల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

READ ALSO : Congress Manifesto : వారందరికీ ఉచిత ఇంటర్ నెట్ సౌకర్యం.. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కీలక నిర్ణయం

వంజరం చేపలు ప్రోటీన్, విటమిన్లు B2, B3, B6 మరియు B12 మరియు విటమిన్ D యొక్క అద్భుతమైన మూలం. నియాసిన్,ఐరన్, విటమిన్ B6,రిబోఫ్లావిన్, మెగ్నీషియం,ఫాస్పరస్, ఫోలేట్ మరియు సెలీనియంలను కూడా అందిస్తుంది. వంజరం కూడా సాల్మొన్ మాదిరిగానే రుచిగా ఉంటుంది. ఈ చేపలలో పాదరసం తక్కువగా ఉంటుంది. అయితే పిల్లలు , గర్భిణీ స్త్రీలు ఈ చేపలను తినకూడదు. ఈ చేపలు మెదడు పనితీరును పెంచగలవని నిపుణులు చెబుతున్నారు.

వంజరం వంటి చేపలను తీసుకోవడం ద్వారా, అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్న వ్యక్తులు లేదా గౌట్ వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నవారు యూరిక్ యాసిడ్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచటానికి వంజరం ఎలా ప్రయోజనకరంగా ఉంటుందంటే ;

తక్కువ ప్యూరిన్ : కొన్ని ఇతర రకాల సీఫుడ్, మాంసాలతో పోలిస్తే మాకేరెల్ తక్కువ ప్యూరిన్‌లను కలిగి ఉంటుంది. అధిక-ప్యూరిన్ ఆహారాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. కాబట్టి వంజరం వంటి తక్కువ-ప్యూరిన్ చేపలను ఎంచుకోవడం మంచిది.

READ ALSO : ఫేస్‌బుక్‌లో వాట్సాప్‌ స్టేటస్‌ షేరింగ్..!

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా : వంజరం చేపలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కు అద్భుతమైన మూలం, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి మాకేరెల్ వంటి ఒమేగా-3-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం గౌట్ లక్షణాల తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

ప్రోటీన్ మూలం: వంజరం చేప అధిక ప్రోటీన్‌ను అందిస్తుంది, ఇది మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనది. రెడ్ మీట్ కు ఇది మంచి ప్రత్యామ్నాయం.

యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచే కొన్ని భారతీయ చేప రకాలు :

కవల్లు చేపలు(సార్డినెస్): సార్డినెస్ అనేది యూరిక్ యాసిడ్ ను అదుపులో ఉంచటంలో సహాయపడే మరొక తక్కువ ప్యూరిన్ కలిగిన చేప. ఈ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

చందువా చేపలు (పాంఫ్రెట్ ): పాంఫ్రెట్ అనేది ఒక ప్రసిద్ధ భారతీయ చేప. దీనిని చందువా అని కూడా పిలుస్తారు. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తులకు సాధారణంగా సురక్షితమైనదిగా చెప్పవచ్చు. ఇది ప్రోటీన్ యొక్క లీన్ మూలం. ప్యూరిన్ దీనిలో తక్కువగా ఉంటుంది.

READ ALSO : Varahi Yatra: 1వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో నాల్గవ విడత వారాహి విజయ యాత్ర

బాసా చేప : క్యాట్ ఫిష్ తరహాలోనే ఉండే ఈ చేప భారతదేశంలో సాధారణంగా వినియోగించబడే మంచినీటి చేప. బాసాగా పిలవబడే దీనిలో ప్యూరిన్‌ తక్కువగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు దీనిని తీసుకోవటం మంచిది.

గొరక చేపలు (టిలాపియా): భారతదేశంలో లభించే చేప కానప్పటికీ, సాధారణంగా ప్యూరిన్‌ దీనిలో తక్కువగా ఉంటుంది. ఇది మంచి రుచి కలిగి ఉండే చేప.

సీలావతి చేప (రోహు): రోహు అనేది మరొక  మంచినీటి చేప. దీనిని సీలావతిగా పిలుస్తారు. ఇది అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్నవారు తీసుకోవచ్చు. ప్రోటీన్ తోపాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

READ ALSO : Hemoprova Chutia : 700 పేజీల భగవద్గీతను బట్ట మీద నేసిన చేనేత కళాకారిణి.. ఒకసారి చూసేయండి

నెత్తల్లు (అంకోవిస్): కవల్లు చేపలు లాగా, నెత్తల్లు చిన్న సైజులో ఉండే జిడ్డుగల చేపలు. వీటిలో ప్యూరిన్లు తక్కువగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.

చివరిగా యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలనుకునే వారు సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం చాలా అవసరం. కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవటం, హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటుగా ఈ చేపలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం అందించమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.