Growth In Children : పిల్లల్లో ఎదుగుదల కోసం ఈ పౌడర్ ను రోజుకు రెండు స్పూన్ లు తీసుకుంటే సరి!

పిల్లలకైనా, పెద్దలకైనా యాక్టివ్‌గా ఉండేందుకు దోహదం చేసేది పోషకాహారమే. కాబట్టి పిల్లలకు ప్రొటీన్‌ అధికంగా ఉండే పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలి. అలా అందించటం వల్ల వారిలో అలసట, నీరసం, జుట్టు రాలడం, చర్మం పై ముడతలు వంటి సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి.

Growth In Children : పిల్లల్లో ఎదుగుదల కోసం ఈ పౌడర్ ను రోజుకు రెండు స్పూన్ లు తీసుకుంటే సరి!

L nuts, dry coconut, flax seeds, watermelon seeds, almonds, alum jaggery powder

Updated On : November 21, 2022 / 9:48 AM IST

Growth In Children : చిన్నారులు తీసుకునే ఆహారంలో ఐరన్‌, అయొడిన్‌, ఫోలేట్‌, విటమిన్‌ ఎ, జింక్‌ వంటి సూక్ష్మ పోషకాలు లోపించడం వల్ల వారిలో ఎదుగుదల సరిగ్గా ఉండదు. అంతేకాకుండా జీవితకాలం పాటు పోషకాల లోపం కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పోషకాలతో కూడిన ఆహారాన్ని చిన్న వయస్సు నుండే తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం కారణంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది.

పిల్లలకైనా, పెద్దలకైనా యాక్టివ్‌గా ఉండేందుకు దోహదం చేసేది పోషకాహారమే. కాబట్టి పిల్లలకు ప్రొటీన్‌ అధికంగా ఉండే పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలి. అలా అందించటం వల్ల వారిలో అలసట, నీరసం, జుట్టు రాలడం, చర్మం పై ముడతలు వంటి సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, కంటి చూపు మందగించడం, మతిమరుపు, బీపీ, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, క్యాల్షియం లోపంతో వచ్చే ఎముకల సమస్యలు , రక్తహీనత, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి అనేక సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

పిల్లల నుండి పెద్దల వరకు ఆరోగ్యానికి మేలు చేసే పోషకవిలువలగల పొడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకుగాను ముందుగా వాల్ నట్స్ ను, ఎండు కొబ్బరిని, అవిసె గింజలను, పుచ్చకాయ గింజలను, బాదం పప్పును, పటిక బెల్లాన్ని తీసుకోవాలి. వీటన్నింటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా మార్చుకోవాలి. ప్రతిరోజు రాత్రి సమయంలో నిద్రకు రెండు గంటల ముందుగా పాలల్లో చిన్నారులకైతే ఒక స్పూన్ పొడిని, పెద్దలైతే రెండు స్పూన్ ల పొడిని వేసుకుని తీసుకోవాలి. ఇలా రోజు తీసుకుంటే బీపీ, షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. ఈ పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంతోపాటు అనారోగ్యాల బారిన పడకుండా రక్షిస్తాయి.