Fruits : తాజా పండ్లు, ఎండు ఫలాలు వీటిలో ఏవి తినటం మంచిది?

భోజనానికీ మధ్యలో ఆకలి నియంత్రణకు తీసుకునే అల్పాహారంగా కూడా పండ్లను ఎంచుకోవచ్చు. కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఎండుఫలాలను మితంగానే తీసుకోవటం మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారు దీన్ని దృష్టిలో ఉంచుకోవటం మంచిది.

Fruits : తాజా పండ్లు, ఎండు ఫలాలు వీటిలో ఏవి తినటం మంచిది?

Fresh Fruits And Dried Fruits

Updated On : June 6, 2022 / 3:56 PM IST

Fruits : పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరు చెప్తుంటారు. శరీర పోషణకు, నిర్వహణకు కావాల్సిన కీలకమైన పోషకాలను పండ్లు అందిస్తాయి. ప్రతి ఆహారంలోనూ కొవ్వులు ఉంటాయి కానీ పండ్లలో ఉండవు. ప్రకృతి సహజంగా దొరికే పండ్లలో కొవ్వులు, సోడియం, కేలరీలు చాలా తక్కువ. కొలెస్ట్రాల్‌ ఉండనే ఉండదు. శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా సాగేందుకు, గుండె బలిష్టంగా ఉండేందుకు పొటాషియం అవసరం. అరటి, రేగు, గంగరేగు, యాపిళ్లు, కర్భూజ, పంపర పనస, కమలా తదితర పండ్లతో పొటాషియం లభిస్తుంది. పీచు పదార్థాలు అధికంగా ఉన్న పండ్లు తినడం వల్ల తక్కువ కేలరీలతోనే కడుపు నిండినట్లు అవుతుంది. పండ్లను ఆహారంతో పాటు తీసుకోవడం కంటే విడిగా తింటేనే తేలిగ్గా జీర్ణం అవుతాయి. ఏ రోజులో ఏ సమయంలో అయినా పండ్లను తినొచ్చు.

తాజావైనా, ఎండువైనా పండ్లు శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి. వీటిల్లో పీచు, పొటాషియం, రాగి, ఐరన్‌, క్యాల్షియం, విటమిన్లు వంటి ఎన్నో పోషకాలుంటాయి. అయితే ఎండు ఫలాలను తయారుచేసే క్రమంలో వేడికి గురిచేసినపుడు కొంతవరకు విటమిన్‌ సితోపాటు, నీటి మోతాదు తగ్గుతాయి. ఖర్జూరం, అంజీరా వంటి ఎండుఫలాల్లో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి. పీచు కూడా ఎక్కువే. ద్రాక్ష పళ్లలో 1.4 గ్రాముల పీచు ఉంటే.. ఎండు ద్రాక్షలో 5.4 గ్రాములు ఉంటుంది.

భోజనానికీ మధ్యలో ఆకలి నియంత్రణకు తీసుకునే అల్పాహారంగా కూడా పండ్లను ఎంచుకోవచ్చు. కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఎండుఫలాలను మితంగానే తీసుకోవటం మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారు దీన్ని దృష్టిలో ఉంచుకోవటం మంచిది. రంగు చెడిపోకుండా ఉండటానికి కొన్ని పళ్లకు సల్ఫర్‌ డయాక్సైడ్‌ కూడా కలుపుతుంటారు. ఇది ఆస్తమా వంటి జబ్బులున్న వారికి ఇబ్బందులు తీసుకురావొచ్చు. కాబట్టి డ్రై ఫ్రూట్స్​ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే తినటం మంచిది. వివిధ రుతువులలో దొరికే పండ్లతో పాటు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే యాపిల్‌, అరటి,కర్భూజ లాంటి పండ్లను తరచూ తీసుకోవచ్చు. అయితే రోజు ఒకే రకమైన పండు తినడం కంటే వేర్వేరు రకాల పండ్లను తినడం వల్ల వివిధ పోషకాలు శరీరానికి అందుతాయి.

జ్యూస్‌లు తాగినా లాభం అంతంతమాత్రంగానే ఉంటుంది. జ్యూస్‌ తయారీ ప్రక్రియలో పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు, లవణాలను పోతాయి. తాజాపండ్లు తింటే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. పండ్ల రసాలు తాగితే బరువు పెరుగుతారు. ఎందుకంటే అందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. తాజా పండ్లు మన కడుపును తేలికగా నింపి, ఆకలిని తీరుస్తాయి. ఎండు ఫలాలకు ఆ పరిస్ధితి ఉండదు. తక్షణ శక్తి అవసరం అయినప్పుడు ఎండు ఫలాలు త్వరగా శక్తిని అందిస్తాయి. తీపి తినాలనిపించినప్పుడు స్వీట్లకు బదులు డ్రైఫ్రూట్స్‌ను వాటితో చేసిన లడ్డూలను తినవచ్చు.