Fruits vs Fruit Juices : పండ్లు vs పండ్ల రసాలు.. వీటిలో ఏవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయో తెలుసా ?

సాధారణంగా, ఒక పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే దానిని జ్యూస్ రూపంలో తీసుకుంటే, కేలరీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీనికి కారణం ఒక గ్లాసు జ్యూస్ తాగితే అందులో చక్కెర కలపటం వల్ల కేలరీలు పెరుగుతాయి. ఇది చివరకు బరువు పెరగటానికి దారితీస్తుంది.

Fruits vs Fruit Juices : పండ్లు vs పండ్ల రసాలు.. వీటిలో ఏవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయో తెలుసా ?

Fruits vs fruit juices

Fruits vs Fruit Juices : పండ్లు , పండ్ల రసాలు ఈ రెండింటిలో వేటిని ఇష్టపడతారని ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి..మీరు ఏంచెప్పాలో అర్ధంకాక కొద్ది సేపు గందగోళానికి గురవుతారు. అయితే పండ్లనే నేరుగా తినేందుకు కొంత మంది ఆసక్తి చూపిస్తే, మరి కొందరు మాత్రం వాటిని జ్యూస్ రూపంలో చేసుకుని తాగే వారు మరికొందరు. ఈ విధానాల్లో ఎలా తీసుకోవటం మంచిదన్న విషయంపై చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Stomach Health : పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఇవే!

రసం కంటే పండ్లు మరింత ఆరోగ్యకరంగా , ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే జ్యూస్‌కు బదులుగా తాజా పండ్లను తినమని వైద్యులు సూచిస్తుంటారు. అంతేకాకుండా, ప్రతిరోజూ ఒక గ్లాసు పండ్ల రసాన్ని తాగడం వల్ల వైద్యుల వద్దకు వెళ్ళాల్సిన పని ఉండదని చెబుతారు. అయితే పండ్లరసం అంత ఆరోగ్యకరం కాదన్న విషయం చాలా మందికి తెలియదు. పండ్ల రసంతో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే, ఇందులో కేలరీలు, యాసిడ్ కంటెంట్, చక్కెర అధికంగా ఉండటం, ఫైబర్ తక్కువగా ఉండటం, కీలకమైన పోషకాలు లేకపోవడం వల్ల శరీరానికి ఆరోగ్య పరమైన ప్రయోజనాలు అందకుండా పోతాయి. పండ్లను,రసాల కంటే ఎక్కువ ఆరోగ్యకరమైనవిగా ఎందుకు పరిగణిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Arthritis Pain : కీళ్ల నొప్పులు తగ్గించే అద్భుతమైన 5 పండ్లు!

1. ఫైబర్ లేకపోవడం ;

ఫైబర్ మన శరీరానికి చాలా ముఖ్యమైన మూలకం. ఇది ప్రేగు కదలికలకు మేలు చేయటంతోపాటుగా కడుపు నిండుగా ఉంచుతుంది. అయితే మనం పండ్లకు బదులుగా జ్యూస్ తీసుకున్నప్పుడు, పండులోని ఫైబర్ మొత్తం ఫిల్టర్ అవుతుంది. శరీరానికి కావాల్సిన ఫైబర్ అందకుండా పోతుంది. కాబట్టి రసానికి బదులు ఫైబర్ కోసం పండ్లను నేరుగా తినటం మంచిది.

READ ALSO : Avoid Eating Raw Vegetables : ఈ నాలుగు రకాల కూరగాయలు, పండ్లు పచ్చిగా తినకూడదు తెలుసా ?

2. అదనపు కేలరీలు ;

సాధారణంగా, ఒక పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే దానిని జ్యూస్ రూపంలో తీసుకుంటే, కేలరీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీనికి కారణం ఒక గ్లాసు జ్యూస్ తాగితే అందులో చక్కెర కలపటం వల్ల కేలరీలు పెరుగుతాయి. ఇది చివరకు బరువు పెరగటానికి దారితీస్తుంది.

3. చక్కెర అధికం ;

ఇటీవలి కాలంలో మార్కెట్లోకి ప్యాక్డ్ పండ్ల రసాల టిన్ లు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని తీసుకుంటే శరీరానికి హానికరం. ప్యాక్ చేసిన పండ్ల రసాలలో ఎక్కువ చక్కెరలు ఉంటాయి. దీని వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.

READ ALSO : Terrac Garden : మిద్దెపై కూరగాయలు, పండ్లు పెంపకం

4. సూక్ష్మపోషకాల లోపం ;

పండ్ల రసం తయారీకి వివిధ రకాల ప్రక్రియలు అనుసరిస్తారు. దీని వల్ల పండ్లలో శరీరానికి ప్రధానంగా అవసరమైన విటమిన్ ఎ మరియు విటమిన్ సి మొదలైన అనేక సూక్ష్మపోషకాలు తొలగించబడతాయి. దీని వల్ల ఆపోషకాలు మనకు అందవు.

READ ALSO : Eating Fruits : బరువు ఎక్కువ ఉన్నవాళ్లు పండ్లు తినొచ్చా…?

కాబట్టి పండ్లను తినటం వల్లే మన శరీరానికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పండ్ల రసాలకు బదులగా ఆరోగ్యం కోసం , పోషకాలకోసం పండ్లను నేరుగా తీసుకోవటం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.