Gap Between Teeth : పిల్లల్లో దంతాల మధ్య గ్యాప్ ఎందుకంటే?
దంతాల మధ్య ఖాళీల పళ్ళ మధ్య సందులనేవి కాల్సియం లోపము వలన వచ్చేవి కావు. కొన్ని సందర్భాల్లో వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

Gap Between Teeth In Children
Gap Between Teeth : దంతాల మధ్య గ్యాప్ ఉంటే అదృష్టంగా చాలా మంది భావిస్తుంటారు. వాస్తవానికి ఇందులో ఏమాత్రం నిజంలేదు. సాధారణంగా చిన్నారుల్లో దంతాలలో గ్యాప్ ఎక్కవగా కనిపిస్తుంది. దీనిని డైఆస్టిమాస్ అని పిలుస్తారు. తరచుగా రెండు ముందు దంతాల మధ్య ఈ గ్యాప్ వస్తుంది. వాస్తవానికి, ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో దాదాపు సగం మందికి ముందు దంతాల మధ్య గ్యాప్ ఉంటుంది. సాధారణంగా ఈ గ్యాప్ బిడ్డకు ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల వయస్సు వచ్చే సమయానికి దానంతటదే తొలగిపోతుంది. కొన్నిసార్లు దంతాలు , దవడల మధ్య పరిమాణంలో అసమతుల్యత ఉంటుంది. ఇది కూడా కొన్ని సందర్భాల్లో దంతాల మధ్య గ్యాప్ కు కారణమౌతుంది. చెడు అలవాట్లు, నాలుకతో దంతాలను నొక్కడం , వంటి కొన్ని చెడు అలవాట్లు దంతాల మధ్య అంతరానికి దోహదం చేస్తాయి.
పళ్ళ మధ్య గ్యాప్ కారణంగా తినే ఆహారం అందులో ఇరుక్కుని దుర్వాసన వస్తుంది. హడాహుడిగా పళ్ళు తోమటం, సరిగా తోమకపోవటం, చిగుర్లను మసాజ్ చేయటం వంటివి చేయకపోవటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పళ్ళను రోజు మూడు నుండి నాలుగు నిమిషాలు బ్రష్ చేసుకోవాలి. కొంతమందిలో దంతాలు తోముతుంటే చిగుర్ల నుండి రక్తం రావటం, పళ్ళు కదలటం వంటివి చోటు చేసుకుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వైద్యుల వద్దకు వెళ్ళి చిగుర్లు, పళ్లు క్లీన్ చేయించుకోవటం మంచిది.
దంతాల మధ్య ఖాళీల పళ్ళ మధ్య సందులనేవి కాల్సియం లోపము వలన వచ్చేవి కావు. కొన్ని సందర్భాల్లో వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నోటి పరిశుభ్రత పాటించకపోవటం కూడా దీని కారణమౌతుంది. చిన్న పిల్లలలో దౌడ పెరగడము వల్ల, పాలపళ్ళు సైజు అదేసైజు లో ఉండిపోవటం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది. నాలుకతో పళ్ళను నొక్కే అలవాటును మానుకుంటే డయాస్టెమాను నివారించవచ్చు. క్రమం తప్పకుండా బ్రషింగ్ మరియు ఫ్లాసింగ్ ద్వారా దంతాల ఖాళీలను నివారించవచ్చు. ప్రతి ఆరు మాసాలకు ఒకసారి పళ్ళను దంత వైద్యుల చేత క్లీన్ చేయించుకోవటం వల్ల పళ్ళ మధ్య సందులు వచ్చే అవకాశం ఉండదు. పుచ్చు పళ్ళ ను నివారించవచ్చు. ఇతరత్రా వ్యాధులను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.