Garlic : చలికాలంలో వెల్లుల్లి చేసే మేలు

శీతాకాలంలో వెల్లుల్లిని ఆహారాంలో భాగం చేస్తే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. సైనసైటిస్, జలుబు, ఫ్లూతో బాధపడేవారు వేడి వంటకాలు, పులుసులు, సూప్‌లలో వెల్లుల్లిని చేర్చి తినాలి.

Garlic : చలికాలంలో వెల్లుల్లి చేసే మేలు

Garlic

Updated On : November 12, 2021 / 9:53 AM IST

Garlic : చలికాలంలో వివిధ రకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇమ్మునిటీ సిస్టం బలంగా లేకపోతే జలుబు, దగ్గు.. ఇతర సీజనల్‌ రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. ఇందులో అనేక ఔషదగుణాలు ఉంటాయి. పురాతన కాలం నుండి వెల్లుల్లిని వివిధ రూపాల్లో వినియోగిస్తున్నారు. రుచి, సువాసన, తోపాటు ఎన్నో రుగ్మతలకు పోగొట్టేందుకు బాగా ఉపకరిస్తుంది. వెల్లుల్లిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకాలు ఉపిరితిత్తుల ఆరోగ్యానికి జీవం పోస్తాయి. చలికాలంలో తరచూ వచ్చే జ్వరం, కఫం, గొంతు నొప్పి సమస్యలకు వెల్లుల్లి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుపచడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి రెబ్బలు తరచూ తినడం మూలంగా గుండె జబ్బులను నివారించవచ్చు.

చలికాలంలో జలుబు, దగ్గు మామూలుగానే వస్తుంది. ఈవిధమైన సమస్యలకు వెల్లుల్లి చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. ఇన్‌ఫెక్షన్లు, ఇతర వ్యాధుల నుంచి వెల్లుల్లి రక్షణ కల్పిస్తుంది. వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లిలో విటమిన్ బి, సి, ఫోలేట్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. యూఎస్‌డీఏ ప్రకారం వంద గ్రాముల వెల్లుల్లిలో 150 కేలరీలు, 33 గ్రాముల పిండి పదార్థాలు, 6.36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

శీతాకాలంలో వెల్లుల్లిని ఆహారాంలో భాగం చేస్తే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. సైనసైటిస్, జలుబు, ఫ్లూతో బాధపడేవారు వేడి వంటకాలు, పులుసులు, సూప్‌లలో వెల్లుల్లిని చేర్చి తినాలి. ఐతే ఉడికించిన వెల్లుల్లి కంటే, పచ్చిగా ఉన్నప్పుడు తింటేనే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు చలికాలంలో బరువు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలు సులువుగా బరువుతగ్గడానికి సహాయపడతాయి.

శరీరంలోని హానికారకాలను బయటికి పంపడానికి, ఆరోగ్యకరమైన జీవక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దీనిలోని పోషకాలు బరువుతగ్గడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఉదయాన్నే పరగడుపున 5 పచ్చి వెల్లుల్లి రెబ్బలు, తేనెతో కలిపి తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.