Goat Cheese : చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచే మేక చీజ్!

మేక పాలతో తయారైన చీజ్ ను ఆహారంగా తీసుకుంటే బరువు తగ్గవచ్చు. దీనిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయదు.

Goat Cheese : చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచే మేక చీజ్!

Goat Cheese

Updated On : April 27, 2022 / 1:04 PM IST

Goat Cheese : మేక చీజ్ ను మేకపాల నుండి తయారు చేస్తారు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్లు ,విటమిన్ ఎ, విటమిన్ బి 2, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, రాగి, జింక్ , సెలీనియం వంటి పోషకాలు మేక చీజ్ లో లభిస్తాయి. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ను గలిగి ఉండటంతోపాటు ఇది సులభంగా జీర్ణమవుతుంది. మేక చీజ్ లో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో దోహదపడతాయి. అధిక బరువు ,ఊబకాయం ఉన్నవారు రోజూ 60 గ్రా మేక చీజ్‌ను 12 వారాలపాటు తీసుకుంటే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను గణనీయంగా పెంచుకోవచ్చు.

మేక పాలతో తయారైన చీజ్ ను ఆహారంగా తీసుకుంటే బరువు తగ్గవచ్చు. దీనిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయదు. మేక చీజ్ బరువు తగ్గించటంలో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. మేక చీజ్ లో కాల్షియం, భాస్వరం, రాగి వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించటానికి ఇవి దోహదపడతాయి. మేక చీజ్‌లో క్యాప్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండి చర్మంపై మొటిమలకు కారణమయ్యే పి ఆక్నెస్ అనే బ్యాక్టీరియాతో పోరాడటానికి క్యాప్రిక్ ఆమ్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఆవు పాలతో తయారైన చీజ్ ను జీర్ణించుకోలేని వారు మేకపాలతో తయారైన చీజ్ ను తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఇందులో లాక్టోస్ సహజంగానే తక్కువ ఉంటుంది. దీని వల్ల జీర్ణ ప్రక్రియ సులభతరం అవుతుంది. మేక చీజ్ లో ఉండే ప్రొబయాటిక్స్ మంచి బ్యాక్టీరియా గట్ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది.