Taro Root : ఆరోగ్యానికి మేలు చేసే… చామ దుంప
పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే చామ దుంపలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. చామ దుంప జిగురుగా ఉంటుంది.

Taro Root
Taro Root : దుంప జాతి కూరగాయల్లో చామ దుంప ఒకటి. దీనిని కూరగా చేసుకుని తింటే రుచిగా ఉంటుంది. చేమ దుంపల కూర తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. చామ దుంపల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
చామ దుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్న వారికి చక్కని ఔషదంగా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్ధను మెరుగుపరచటమే కాకుండా శరీరంలో ఇన్సులిన్ ను సమతుల్యంగా ఉండేలా చేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచేందుకు దోహదపతుంది.
చామ దుంపలను ఆహారంగా తీసుకోవట వల్ల అరుగుదల సమస్యలన్నీ తొలగిపోతాయి. రక్త ప్రసరణ సైతం మెరుగవుతుంది. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించేసి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దాంతో గుండె పోటు, ఇతర గుండె జబ్బులు రాకుండా రక్షణ లభిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే చామ దుంపలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. చామ దుంప జిగురుగా ఉంటుంది. దీని వల్ల తినడానికి చాలా మంది సంకోచిస్తుంటారు. చామ దుంపలను కూరగా చేసుకుని తినటం ఇష్టంలేని వారు కాల్చుకుని, ఉడికించుకుని, వేపుడుగా, ఇలా రకరకాలు తయారు చేసుకుని తినొచ్చు.
చామ దుంపలు శరీరంలో కణాల పనితీరు సక్రమంగా ఉండేలా దోహదం చేస్తుంది. క్యాన్సర్ నిరోధకారిగా పనిచేస్తుంది. క్యాన్సర్ తో బాధపడేవాళ్ళు చామ దుంపను తీసుకోవటం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చామ దుంపలను తీసుకోవటం వల్ల శరీరానికి తగినంత శక్తి అందుతుంది.
చామ దుంపలను అతిగా మాత్రం తినకూడదు. దీని వల్ల కొన్ని అనర్ధాలు వచ్చే ప్రమాదం ఉంది. చామ దుంపలు అతిగా తినటం వల్ల విరోచనాలు, వికారంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మోతాదుకు మించి మాత్రం వీటిని తీసుకోవటం ఆరోగ్యానికి అంత మంచిదికాదు.