Green Tea Health benefits : గ్రీన్ టీ.. ఇలా తాగండి
ఉదయం టీఫిన్ చేయడానికి ముందే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ గ్రీన్ టీని పరగడుపున ఎప్పుడు కూడా తీసుకోవద్దు. బ్రేక్ ఫాస్ట్ తిన్న తరువాతే తీసుకోవాలి. నిజానికి గ్రీన్ టీ మాత్రమే కాదు.. కాఫీ, టీలు కూడా పరగడుపున తీసుకోకూడదు. దానివల్ల అసిడిటీ సమస్యలు రావచ్చు.

Green Tea Health benefits
Green Tea Health benefits : అందరికీ ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఏవి తినాలి? ఏం తాగాలి అంటూ ఆరోగ్య ప్రయోజనాలను వెతికిపట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ టీ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. దీన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేలడంతో ప్రతీ ఒక్కరూ గ్రీన్ టీ తాగుతున్నారు. మరి ఇది సరైనదేనా..?
READ ALSO : Green Tea : గ్రీన్ టీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందంటే?
బరువు తగ్గాలంటే గ్రీన్ టీ తాగండి… అంటూ రకరకాల కంపెనీల ప్రకటనలు చూస్తుంటాం. ఆ ప్రకటనల సంగతి పక్కన పెడితే గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదే. అందుకేనేమో.. బరువు తగ్గాలనుకునేవారు, అందమైన చర్మం కావాలనుకునేవారు గ్రీన్ టీని ఇష్టంగా తాగుతున్నారు. అయితే మంచిది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు.. ఎంత పడితే అంత తాగితే.. దుష్ఫలితాలు కలగొచ్చు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టుగా గ్రీన్ టీ కూడా మితి మీరి తాగితే నెగటివ్ ప్రభావాలను చూపిస్తుంది.
తిన్నాకే తాగాలి
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే అందులోని కెఫీన్, టానిన్స్ జీర్ణక్రియపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఏమీ తినకముందు గ్రీన్ టీ తాగడం వల్ల అసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. గ్రీన్ టీలోని టానిన్ అనే రసాయనం జీర్ణాశయంలో ఎక్కువ యాసిడ్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. అదే విధంగా పడుకునే ముందు కూడా గ్రీన్ టీ తీసుకోకూడదు.. ఇందులోని అమినో యాసిడ్స్ కండరాలను ఉత్తేజపరిచి నిద్రపోకుండా ప్రేరేపిస్తాయి.
READ ALSO : green tea problems : గ్రీన్ టీ తాగటం వల్ల లాభాలే కాదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్త!
బరువు తగ్గుతుందనుకుంటే..
శరీర బరువుని అదుపులో ఉంచి రక్తాన్ని మెరుగుపరుస్తుందని చాలామంది గ్రీన్ టీని తాగుతారు. అయితే ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే చాలామంచిది. లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్రీన్ టీ మోతాదుకు మించి తీసుకోకూడదు. రోజుకి 2 కప్పుల మించి గ్రీన్ టీ తాగితే.. అది శరీరంపై నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. బరువు తగ్గడం మాట అటుంచి అనారోగ్యం పాలయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.
ఎప్పుడు తాగాలి?
సాధారణంగా ఉదయం టీఫిన్ చేయడానికి ముందే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ గ్రీన్ టీని పరగడుపున ఎప్పుడు కూడా తీసుకోవద్దు. బ్రేక్ ఫాస్ట్ తిన్న తరువాతే తీసుకోవాలి. నిజానికి గ్రీన్ టీ మాత్రమే కాదు.. కాఫీ, టీలు కూడా పరగడుపున తీసుకోకూడదు. దానివల్ల అసిడిటీ సమస్యలు రావచ్చు.
గ్రీన్ టీ ఎప్పుడు కూడా భోజనానికి అరగంట ముందు.. భోజనం తర్వాత రెండు గంటల తర్వాత తీసుకోవడం వల్ల చక్కని లాభాలుంటాయని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా, ఎక్సర్‌సైజ్ చేసేవారు.. వ్యాయామానికి ముందు గ్రీన్ టీ తీసుకుంటే వర్కౌట్స్ కోసం ఎక్కువసమయం కేటాయించగలుగుతారు.
గ్రీన్ టీలోని యాంటీయాక్సిడెంట్స్ హార్మోన్ల పై ప్రభావం చూపిస్తాయి. దీంతో గ్రంథుల్లో మార్పులు వస్తాయి. అందువల్ల అతిగా కూడా గ్రీన్ టీ తాగొద్దు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. గ్రీన్ టీ కొన్ని సమ్మేళనాలు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. కాబట్టి దీన్ని ఉదయాన్నే తీసుకోవాలి. అలా కాకుండా సాయంత్రం సమయాల్లో తీసుకుంటే నిద్రలేమి సమస్య వస్తుంది.