Drink Green Tea : గర్భిణులు గ్రీన్ టీ తాగితే కడుపులోని శిశువుకు ప్రమాదమా? గ్రీన్ టీకి గర్భిణులు దూరంగా ఉండటం మంచిదా?

గ్రీన్ టీ తాగటం అన్నది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ గర్భంతో ఉన్నప్పుడు మానేయడమే మంచిది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గర్భిణులకు అవసరమే అయినప్పటికీ ఇందులో ఉండే కెఫీన్ వల్ల కడుపులోని శిశువుకు నష్టం కలుగుతుంది. గ్రీన్ టీలో కెఫిన్ తక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ అధికంగా తాగితే మాత్రం ఇబ్బందులు కలుగుతాయి.

Drink Green Tea : గర్భిణులు గ్రీన్ టీ తాగితే కడుపులోని శిశువుకు ప్రమాదమా? గ్రీన్ టీకి గర్భిణులు దూరంగా ఉండటం మంచిదా?

pregnant women drink green tea

Updated On : August 22, 2022 / 1:03 PM IST

Drink Green Tea : ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. తినే ఆహారం బిడ్డ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా గర్భస్రావం అయ్యే అవకాశం అధికం. ఈ సమయంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అయితే కొన్ని రకాల ఆహారాలు పూర్తిగా మానివేయటం మంచిది. ముఖ్యంగా రోజువారిగా కొంత మంది గ్రీన్ టీ తీసుకోవటం అలవాటుగా మార్చుకుంటారు. అలాంటి వారు గర్భదారణ సమయంలో ఆలవాటు మానుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రీన్ టీ తాగటం అన్నది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ గర్భంతో ఉన్నప్పుడు మానేయడమే మంచిది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గర్భిణులకు అవసరమే అయినప్పటికీ ఇందులో ఉండే కెఫీన్ వల్ల కడుపులోని శిశువుకు నష్టం కలుగుతుంది. గ్రీన్ టీలో కెఫిన్ తక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ అధికంగా తాగితే మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. పిండం లోని డిఎన్ ఏకు నష్టం కలిగేలా చేయటంతోపాటు, ఎదుగుదలకు అవరోధంగా మారుతుంది.

గ్రీన్ టీలోని కెఫీన్ వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీని వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు కూడా వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంలో ద్రవాలు బయటికిపోతాయి. అతిగా తీసుకుంటే గర్భధారణ సమయంలో చాలా సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉంది.

అయితే గర్భిణీలు అధిక మొత్తంలో కాకుండా రోజుకు ఒకటి , రెండు కప్పుల గ్రీన్ టీకి పరిమితం కావటం వల్ల కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. అయితే రోజు మొత్తంలో తగినంత నీరు తాగతూ ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వచ్చే సమస్యల్లో హెచ్చుతగ్గుల రక్తపోటు ఒకటి. గ్రీన్ టీ అనేది యాంటీఆక్సిడెంట్స్ (పాలీఫెనాల్స్) యొక్క మూలం, ఇది సెల్ డ్యామేజ్ నివారణలో ఉపయోగపడుతుంది. అందుకే గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల రక్తం పోటు అదుపులో ఉంటుంది.

గ్రీన్ టీ గర్భధారణ సమయంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని జీవక్రియ పెరుగుతుంది, ఇది గర్భధారణ సమయంలో మూడ్ స్వింగ్‌లను ఎదుర్కోవడానికి పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి, ఇవి చర్మ సమస్యలకు కూడా దారితీస్తాయి. గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది ఎరుపు, దురద లేదా వాపు వంటి చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ శరీరంలో ఉండే టి-కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది, ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.