Essential Nutrients : మహిళల ఆరోగ్యానికి అవసరమైన 4 పోషకాలు ఇవే!…

మహిళలు తమ ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచుకునేందుకు వారి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. 

Essential Nutrients : మహిళల ఆరోగ్యానికి అవసరమైన 4 పోషకాలు ఇవే!…

Essential Nutrients For Women's

Updated On : March 6, 2022 / 2:47 PM IST

Essential Nutrients : స్త్రీలలో శరీరం జీవితాంతం అనేక మార్పులను ఎదుర్కొంటుంది. మహిళలు, పురుషుల కంటే విభిన్నమైన జీవనశైలిని, శరీరాలను కలిగి ఉండటం వల్ల వారి పోషకాహార అవసరాలు సైతం విభిన్నంగానే ఉంటాయి. అందుకు తగినట్లుగా స్త్రీలు తగిన పోషకాహారాన్ని తీసుకోవటం ఎంతో అవసరం. రోజువారిగా తీసుకునే ఆహారంలో మహిళలు ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని అందేలా చూసుకోవటం చాలా ముఖ్యం. పోషకాహారాలు లేని ఆహారాలను తీసుకోక పోవటమే మంచిది. మహిళలు తమ ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచుకునేందుకు వారి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.  మహిళలకు అవసరమైన నాలుగు పోషకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. ఐరన్ ; ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణ పోషకాహార లోపం ఇనుము. రక్త లోపాన్ని భర్తీ చేయడానికి, మహిళలు తప్పనిసరిగా ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకు కూరలు, డార్క్ చాక్లెట్ , టోఫు, తృణధాన్యాలు , చికెన్ వంటి వాటిల్లో ఐరన్ అధికంగా లభిస్తుంది. తీసుకునే ఆహారంలో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలి. శరీరంలో ఐరన్ స్ధాయి తక్కువగా ఉంటే రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునేలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

2. అయోడిన్ ; మహిళల ఆరోగ్యానికి అయోడిన్ అతి ముఖ్యమైన ఖనిజం. ఇది లోపిస్తే మహిళల శరీరం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరాశ, బరువు పెరుగుట, సంతానోత్పత్తి తగ్గడం ,పాలిచ్చే తల్లులలో బరువు పెరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. అయోడిన్ లోపించిన సందర్భాలలో, స్ట్రాబెర్రీలు, సేంద్రీయ చీజ్, చిక్కుళ్ళు వంటి ఆహారాలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.

3. జింక్ ; మహిళలకు అవసరమైన పోషకాలలో జింక్ కూడా ఒకటి. శరీరానికి అది తక్కువ మొత్తంలో మాత్రమే అవసరం. ఈ పోషకం వల్ల శరీరంలో300 కంటే ఎక్కువ ఎంజైమ్‌ల కార్యకలాపాలకు, ప్రోటీన్ సంశ్లేషణ, గాయం నయం, కణాల పెరుగుదల, రోగనిరోధక వ్యవస్థ పెంచటానికి దోహదం చేస్తుంది. మహిళలు రోజు వారిగా కొద్ది మొత్తంలో అయినా మనం తీసుకునే ఆహారాల్లో జింక్ కు లభించేవి ఉండేవిధంగా చూసుకోవటం మంచిది. గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, పుట్టగొడుగులు, కాబూలీ చనా, రాజ్మా, బాదం, వాల్ నట్స్, జీడిపప్పు , జొన్నలు , రాగుల్లో జింక్ లభిస్తుంది.

4. కోలిన్ ; కోలిన్ అనేది మహిళలకు అవసరమైన పోషకాలలో ఒకటి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, కండరాల నియంత్రణ , మెదడు నాడీ వ్యవస్థ ఇతర విధులు దానిపై ఆధారపడతాయి. శరీర కణాల చుట్టూ ఉండే పొరల ఏర్పాటుకు కోలిన్ అవసరం. చాలా మంది మహిళల్లో ఇది తగినంతగా లభించదు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వారి పిల్లల అభివృద్ధికి అదనపు కోలిన్ అవసరం. జంతు ఆధారిత ఆహారంలో కోలిన్ ఉంటుంది. మాంసం, పౌల్ట్రీ, చేప, పాల ఉత్పత్తులు, గుడ్లు ద్వారా కొలిన్ అందుతుంది.