Exercise : బరువు తగ్గటానికి వారంలో ఎంత సమయం వ్యాయామానికి కేటాయించాలంటే!
అనారోగ్యాలు ఉన్న వ్యక్తులు బరువు తగ్గే ప్రయాణాన్ని ప్రారంభించే వైద్య నిపుణుడిని లేదా శిక్షణ పొందిన శిక్షకులను సంప్రదించాలి. బరువు తగ్గాలంటే శిక్షకులు నిర్ధేశించిన వారం సమయం వ్యాయామాలను క్రమం తప్పకుండా అనుసరించాలి.

Exercise
Exercise : బరువు తగ్గడానికి వ్యాయామం అత్యంత ప్రభావవంతమైన ,సురక్షితమైన మార్గం. బరువును తగ్గించుకోవటంలో మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి సహాయపడుతుంది. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అందుకే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే అదే సమయంలో అసలు ఎంత సమయంలో వ్యాయామం చేయలన్న విషయం తెలుసుకోవాల్సి అవసరం ఉంది. ఎందుకంటే అధిక సమయం వ్యాయామం చేయటం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. అంతేకాకుండా గుండెపై ఒత్తిడిపడుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. శక్తిని పెంచుకోవటంతోపాటు, నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చు. కండరాలు, ఎముకలు మరియు కీళ్లకు మంచిది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. బరువు తగ్గడానికి వారానికి ఎంత సమయం కేటాయించాలన్నది. శరీర బరువును బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కొంత మంది బరువు తగ్గటం అన్నది చాలా క్లిష్టమైనదిగా ఉంటుంది. మరి కొంతమంది కొద్ది పాటి వ్యాయామాలతో తక్కువ సమయంలోనే బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి.
అధిక శరీర బరువు ఉన్న వ్యక్తులు సన్నగా ఉన్న వారి కంటే వేగంగా బరువు కోల్పోతారు. అదేక్రమంలో యువకులు వేగంగా బరువు తగ్గే రేటును కలిగి ఉంటారు. స్త్రీలు పురుషుల కంటే నెమ్మదిగా బరువు కోల్పోతారు. ఒక వ్యక్తి వ్యాయామం చేయడం ద్వారా కోల్పోయే కేలరీల కంటే తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకున్నప్పుడు బరువు తగ్గడంలో ఫలితాలు వేగంగా పొందేందుకు అవకాశం ఉంటుంది. బరువు తగ్గే విషయంలో 8 గంటల నిద్ర చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తక్కువ నిద్రపోయే వ్యక్తులు బరువు తగ్గడం చాలా కష్టం, ఎందుకంటే ఇది హార్మోన్ అసమతుల్యతకు కారణం కావచ్చు.
అనారోగ్యాలు ఉన్న వ్యక్తులు బరువు తగ్గే ప్రయాణాన్ని ప్రారంభించే వైద్య నిపుణుడిని లేదా శిక్షణ పొందిన శిక్షకులను సంప్రదించాలి. బరువు తగ్గాలంటే శిక్షకులు నిర్ధేశించిన వారం సమయం వ్యాయామాలను క్రమం తప్పకుండా అనుసరించాలి. వ్యాయామాల వల్ల చురుకుదనం పొందటంతోపాటు, బరువు తగ్గించుకోవచ్చు. బ్రిస్క్ వాకింగ్ అనేది బరువు తగ్గడంలో సహాయపడే సులభమైన వ్యాయామం. చురుకైన నడక అనేది చురుకుగా ఉండటానికి ఉపయోగపడుతుంది. వస్తువుల కొనుగోలుకు మార్కెట్‌కి సైకిల్‌ను తీసుకెళ్లడం వల్ల వ్యాయామం చేయడమే కాకుండా ఇంధనం కొనుగోలు చేసే ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది.
యోగా చేయడం అనేది జీవక్రియ రేటును పెంచడానికి మరియు అదనపు పౌండ్లను తగ్గించడానికి దోహదపడుతుంది. వాకింగ్ కన్నా రన్నింగ్ చేయటం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. శరీర బరువును వేగంగా తగ్గించటంలో స్కిప్పింగ్ బాగా సహాయపడుతుంది. జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా, వారానికి నిర్ణీత సమయాన్ని కేటాయించి సులభంగా బరువును తగ్గవచ్చు.
అదేసమయంలో బరువు తగ్గాలనుకునే వారు అనారోగ్యకరమైన చిరుతిళ్లను తినటం మానుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ లు తగ్గించాలి. అయిల్ స్పైసీ ఆహారాలు జీర్ణం కావటం కష్టం. వీటి వల్ల శరీరంలో బరువు పెరిగి అదునపు కొవ్వులు పేరుకుపోతాయి. దీంతో బరువు పెరగటానికి అవకాశం ఉంటుంది. చక్కెర పానీయాలు, పదార్ధాలకు దూరంగా ఉండటం మంచిది. వీటి వల్ల అదనపు కేలరీలు పెరుగుతాయి. అతిగా తినకుండా శరీర అవసరాలకు తగినంత ఆహారాన్ని తీసుకోవటం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు.