ఇదిగో ప్రాసెస్ : Facebookలోనూ Money పంపొచ్చు!

ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం ఇప్పుడెంతో ఈజీ అయిపోయింది. డిజిటల్ ప్లాట్ ఫాంలు వచ్చాక ఆన్ లైన్ లావాదేవీలు మరింత పెరిగిపోయాయి. ప్రతిఒక్కరూ తమ వ్యాలెట్ల నుంచి ట్రాన్సాక్షన్లు చేసుకుంటున్నారు. షాపింగ్ చేసినా లేదా ఏదైనా ప్రొడక్టు కొన్నా అన్నింటికి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం కామన్‌గా మారింది.
డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాంల్లో పాపులర్ అయిన వాటిలో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్ పేమెంట్స్ ఇలా ఎన్నో డిజిటల్ పేమెంట్స్ సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. మనీ షేరింగ్ అప్లికేషన్లలో Cash App, Venmo వంటి నగదును బదిలీ చేసుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంటాయి.
వ్యాలెట్స్, నగదు అవసరం లేకుండానే ఈజీగా మనీ షేరింగ్ చేసుకోవచ్చు. వీటి మాదిరిగానే Facebook Messenger యాప్ ద్వారా కూడా డబ్బులు పంపుకోవచ్చు. ఇతరుల నుంచి డబ్బులు తిరిగి పొందవచ్చు కూడా. డెబిట్ కార్డు లేదా పేపాల్ అకౌంట్ల ద్వారా ఫేస్ బుక్ మెసేంజర్ నుంచి నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. మీరు వాడేది ఏ డివైజ్ అయిన పర్వాలేదు.. కంప్యూటర్ (PC) లేదా మొబైల్ ద్వారా ఈజీగా Facebook అకౌంట్ నుంచి డబ్బులు పంపుకోవచ్చు. అది ఎలానో ఓసారి చూద్దాం..
కంప్యూటర్ (PC) నుంచి ఇలా :
* మీ కంప్యూటర్ Mac లేదా PCలో Facebook అకౌంట్ ఓపెన్ చేయండి.
* మీరు ఎవరికి డబ్బులు పంపుతారో వారితో Conversation మొదలుపెట్టండి.
* Messengerలో Top Menuలో ఎవరికి పంపుతున్నారో వారి కాంటాక్టు సెలెక్ట్ చేయండి.
* మీ స్ర్కీన్ లో కనిపించే Contacts లిస్టులో వారి Chat కాంటాక్టు ఎంచుకోండి.
* Chat Boxలో కుడివైపు కిందిభాగంలో $ సింబల్ కనిపిస్తుంది.
* ఆ డాలర్ ఐకాన్ పై క్లిక్ చేశాక అమౌంట్ ఎంటర్ చేయండి.
* ఇక్కడే మీ Debit కార్డు వివరాలను ఎంటర్ చేయండి.
* Pay బటన్ పై Click చేయండి.. మీ ట్రాన్సాక్షన్ పూర్తి అయినట్టే.
Mobile డివైజ్ నుంచి ఇలా:
* iPhone, Android లేదా tablet నుంచి Messenger App ఓపెన్ చేయండి.
* Facebook Messengerలో Username & Password ఎంటర్ చేసి Login అవ్వండి.
* Top-right Cornorలో New message ఐకాన్ పై Click చేయండి.
* ఇదివరకే ఆ కాంటాక్టు వ్యక్తితో చాట్ చేస్తే.. అతడి పేరుతో Inboxలో Tap చేయండి.
* Chat box ఎడమవైపు మీకు ఒక $ సింబల్ కనిపిస్తుంది.
* ఇదివరకే మెసేంజర్ ద్వారా డబ్బులు పంపకుంటే Blue (OK) బటన్‌పై Tap చేయండి.
* ఎవరికి పంపుతున్నారో వారి కాంటాక్టు ఓపెన్ చేసి Money ఎంటర్ చేయండి.
* Pay అనే బటన్ పై Tap చేయండి.
* ఇక్కడ మీకో Paypal అకౌంట్ లేదా Debit Card ఆప్షన్ కనిపిస్తాయి.
* Payment Method ఎంపిక చేసుకుని అడిగిన వివరాలు ఎంటర్ చేయండి.
* Saveపై Tap చేసి.. Pay పై Click చేయండి.. అంతే మీ ట్రాన్సాక్షన్ పూర్తి అయినట్టే.
* మీ పేమెంట్ ఇన్ఫో మొత్తం.. బ్యాంకు స్థాయి సెక్యూరిటీతోనే స్టోర్ అయి ఉంటుంది.