Internet వాడుతున్నారా? మీ పిల్లలను కంట్రోల్ పెట్టండిలా!

మీ ఇంట్లో పిల్లలు ఎక్కువగా Internet వాడుతున్నారా? ఎంతచెప్పినా వినడం లేదా? లేదంటే గొడవ చేస్తున్నారా? అయితే వారిని కంట్రోల్ చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఆన్ లైన్ లో గంటల కొద్ది గడిపే అలవాట్లు ఉన్న పిల్లల్లో చాలామంది చెడు వ్యసనాలకు బానిసయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఇంటర్నెట్ వాడే అవకాశం వారికి ఇస్తూనే.. అందులో రిస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు. చెత్త వెబ్ సైట్లు ఓపెన్ కాకుండా బ్లాక్ చేయొచ్చు. ఇంటర్నెట్ లో వారు ఏం సెర్చ్ చేస్తున్నారు.. ఏం చూస్తున్నారు.. ఇలా అన్నింటిపై Parents ఎప్పటికప్పుడూ నిఘా పెడుతూనే ఉండాలి.
Also Read: వాట్సాప్ Groupలో సరికొత్త ఫీచర్.. Messages అదే డిలీట్ చేస్తుంది!
పేరంట్స్ కళ్లుగప్పి కొన్నిసార్లు పిల్లలు తెలివిగా ఇంటర్నెట్ వాడుతుంటారు. ఇది పిల్లల ప్రైవసీకి ఎంతో ప్రమాదకరం కూడా. అందుకే మీరు వాడే కంప్యూటర్ కావొచ్చు లేదా స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ మరేదైనా డివైజ్ కావొచ్చు.. అన్నింటిలో Chrome browser తప్పనిసరిగా ఉంటుంది.
ఎక్కువ శాతం ఇంటర్నెట్ యూజర్లు క్రోమ్ బ్రౌజర్ వాడుతుంటారు. మీ పిల్లలు కూడా Chrome బ్రౌజర్ వాడుతున్నారా? అయితే అందులో parental controls ఎనేబుల్ చేయండి. అడల్ట్ కంటెంట్ వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా Block చేయండి. పిల్లలను ఆన్ లైన్ ఎక్స్ పీరియన్స్ నుంచి సేవ్ చేసేందుకు గూగుల్ క్రోమ్ కొన్ని టిప్స్ అందిస్తోంది. అవేంటో ఓసారి చూద్దాం..
1. Chromeలో Safe Search ఫీల్టర్ :
* పేరంటల్ కంట్రోల్స్ ద్వారా ఈజీగా పిల్లలపై బ్రౌజింగ్ రిజిస్ట్రక్షన్స్ సెట్ చేసుకోవచ్చు.
* క్రోమ్ బ్రౌజర్‌లో Safe Search టర్న్ ఆన్ చేస్తే సరిపోతుంది.
* గూగుల్ అకౌంట్ లాగిన్ అయ్యాక google.com/preferences అనే లింక్ Click చేయండి.
* SafeSearch Filters అనే ఆప్షన్ కింద Turn on Safe Search అనే ఆప్షన్ ఉంటుంది.
* Safe Search బటన్ దగ్గర Tick చేయండి.
* కుడివైపు కింది భాగంలో Save బటన్ పై Click చేయండి.
2. Google Family Link సెట్ చేయండిలా :
క్రోమ్ బ్రౌజర్ వాడే పిల్లలను ఇంటర్నెట్ నుంచి సమగ్ర స్థాయిలో సురక్షితంగా ఉంచేందుకు వీలుగా Google Family Link అనే App ప్రవేశపెట్టింది. ఈ యాప్ ను Chorme బ్రౌజర్ ద్వారా ఈజీగా Set చేసుకోవచ్చు. Browserకు Link చేసుకోవాలంటే కొత్తగా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి లేదా ఇదివరకే Gmail అకౌంట్ ఉన్నా సరిపోతుంది.
Also Read: మీ ఫోన్‌లో మల్టీపుల్ Instagram అకౌంట్లు Remove చేయండిలా!
మీరు iPhone లేదా Android డివైజ్ వాడేతే ఈ Family Link App డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి. ఒకసారి ఈ యాప్ సెట్ చేశాక పిల్లలకు స్ర్కీన్ టైమ్ లిమిట్ మాత్రమే ఉంటుంది. లిమిట్ దాటితే వాడే డివైజ్ ఆటోమాటిక్ గా Lock అయిపోతుంది. అంతేకాదు.. Limit, Web activity, ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ లేదా క్రోమ్ బుక్ వంటి ఎన్నో ఫీచర్లను ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు.
3. అడల్డ్ Websites Block చేయండిలా!
* Google Chrome బ్రౌజర్ ద్వారా పిల్లలు ఏది పడితే ఆ వెబ్ సైట్ యాక్సస్ చేయకుండా ఉండేలా కంట్రోల్ చేయొచ్చు. ఇందుకు క్రోమ్ బ్రౌజర్ Web Storeలో అద్భుతమైన extension ఒకటి ఉంది. అదే… Block Site extension. ఈ టూల్ ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు.. అక్కర్లేని వెబ్ సైట్లను ఈజీగా బ్లాక్ చేసుకోవచ్చు..
ఇదిగో ప్రాసెస్ : ఫాలో అవ్వండి ఇలా
* ముందుగా మీ Gmail అకౌంట్లో Login అవ్వండి.
* block site extension అని క్రోమ్ బ్రౌజర్ లో సెర్చ్ చేయండి.
* Block Site – Website Blocker for Chrome అనే లింక్ క్లిక్ చేయండి.
* Add to Chrome అనే బటన్ పై Click చేయండి.
* Add extension అనే Pop Up box వస్తుంది.. క్లిక్ చేయండి.
* మీ బ్రౌజర్ టాప్ రైట్ కార్నర్ లో Extension Icon యాడ్ అవుతుంది.
* ఆ ఐకాన్ పై Click చేసి Enable లేదా Disable చేసుకోవచ్చు.
* ఏ Website Block చేయాలో ఆ Tab ఓపెన్ చేసి Block site పై క్లిక్ చేయండి.
* అంతే.. ఆ సైట్ ఇంకా ఓపెన్ కాదు.. ఇలా ఎన్ని సైట్లు అయినా బ్లాక్ చేసుకోవచ్చు.
Also Read :Instagramలో Your Storyకి ఫొటోలు, వీడియోలు షేరింగ్ ఈజీ!