Breast Cancer : రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారించటం ఎలా?

తినే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. పండ్లు, కూరగాయలు ,తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Breast Cancer : రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారించటం ఎలా?

breast cancer

Updated On : October 25, 2023 / 7:53 AM IST

Breast Cancer : రొమ్ము క్యాన్సర్ పై మహిళలో అవగాహన కలిగి ఉండటం అవసరం. రొమ్ము ఆరోగ్యానికి సంబంధించి ముందస్తుగా గుర్తించడం అన్నది చాలా కీలకమైనది. రొమ్ము క్యాన్సర్ ప్రమాదానికి అనేక జన్యుపరమైన అంశాలు కారకాలైనప్పటికీ, జీవనశైలి అలవాట్లు సైతం రొమ్ము క్యాన్సర్ రావటానికి దారితీస్తాయి.

READ ALSO : Eating Too Much Fish : చేపలను ఎక్కువగా తినడం వల్ల పేగు ఆరోగ్యంపై ప్రభావంపడుతుందా ?

రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారకాలు ;

ఆహారం, పోషకాహారం : అధిక కొవ్వు కలిగిన ఆహారం, ముఖ్యంగా సంతృప్త కొవ్వులు, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పండ్లు, కూరగాయలతో కలగలిసిన సమతుల్యమైన, తక్కువ కొవ్వులు కలిగిన ఆహారం తీసుకోవడం రొమ్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

శారీరక శ్రమ: నిశ్చల జీవనశైలి అనగా ఎక్కవ సమయం ఒకే ప్రదేశంలో కూర్చుని ఉండటం ఊబకాయానికి దారితీస్తుంది. ఇది రొమ్ము క్యాన్సర్‌కు కీలకమైన ప్రమాద కారకం. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇందుకోసం రోజువారీగా వ్యాయామాలు, వాకింగ్ వంటి శారీరక శ్రమలు అవసరం.

READ ALSO : Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !

ఆల్కహాల్ వినియోగం: మద్యపానం కూడా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆల్కహాల్‌ను తగ్గించడం లేదా దానికి దూరంగా ఉండటం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ధూమపానం: ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని అందరికి తెలిసిందే. అయితే, ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ధూమపానం మానేయడం అనేది ఆరోగ్య పరంగా ఉత్తమైనది.

READ ALSO : Breastfeeding : చంటిబిడ్డలకు పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవటం మంచిదంటే ?

తినే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. పండ్లు, కూరగాయలు ,తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఎర్రటి మాంసాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు అనగా పిజ్జాలు, బర్గర్లు వంటి వాటిని పరిమితం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. శారీరక శ్రమ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన బరువు , హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవాలంటే వారానికి కనీసం 150 నిమిషాలపాటు ఒక మాదిరి వ్యాయామాలను చేయటం లక్ష్యంగా పెట్టుకోవాలి.ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతోపాటుగా రొమ్ము ఆరోగ్యం, ఏమాత్రం తేడాలున్నా ముందస్తుగా గుర్తించటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

READ ALSO : Fish Food : చేపలకు ఆహారంగా గుమ్మడికాయలు

గడ్డలు, రొమ్ములో మార్పుల క్రమం తప్పకుండా పరిశీలిస్తుండాలి. వయస్సు మరియు ప్రమాద కారకాల ఆధారంగా వైద్యులు సిఫార్సు చేసిన విధంగా స్క్రీనింగ్ మార్గదర్శకాలను అనుసరించటం ద్వారా రొమ్ము క్యాన్సర్ ను ప్రారంభదశలోనే గుర్తించటం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స అందించటం మంచిది.