Coconut Oil : వంటల్లో కొబ్బరి నూనె వాడితే!
సంతానోత్పత్తికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. ఆహారంలో కొబ్బరి నూనెను జోడించడం వల్ల సంతానోత్పత్తికి దోహదం చేస్తుంది. కొబ్బరి నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి, అవి సహజమైన క్రిమినాశకాలు.

Slice Of Fresh Coconut On A Table Cloth .
Coconut Oil : చర్మం, జుట్టు సంరక్షణకు కొబ్బరి నూనె గొప్పగా ఉపయోగపడుతుంది. స్క్రబ్స్, మాయిశ్చరైజర్స్, ఆయిల్, సబ్బు మరెన్నో కొబ్బరి ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే కొబ్బరి నూనెతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. అయితే మనదేశంలోని కేరళ వంటి ప్రాంతాల్లో తరతరాలుగా కొబ్బరి నూనెను వంట అవసరాలకు ఉపయోగిస్తున్నారు. వంట చేసేటప్పుడు కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
కొబ్బరి నూనెలో దాదాపు 100 శాతం కొవ్వు ఉంటుంది, ఇందులో 90 శాతం సంతృప్త కొవ్వులు ఉంటాయి. కొబ్బరి నూనెను చల్లని, గది ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు గడ్డకట్టటానికి ఇదే కారణం. కొవ్వు అనేది కొవ్వు ఆమ్లాలు అని పిలువబడే చిన్న అణువులతో రూపొందించబడింది. కొబ్బరి నూనెలో అనేక రకాల సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. కొబ్బరి నూనెలో ఎక్కువగా కనిపించే కొవ్వు రకం మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ముఖ్యంగా లారిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ ఉంటుంది, ఫైబర్, ఇతర విటమిన్లు ,ఖనిజాలు ఉండవు. కొవ్వు ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగం. కొబ్బరినూనె శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాల మూలం. ఎ,డి,ఈ,కె వంటి కొవ్వులో కరిగే విటమిన్‌లను శరీరం గ్రహించడంలో సహాయపడతాయి.
గుండె ఆరోగ్యం: కొబ్బరి నూనెలో సహజ సంతృప్త కొవ్వులు ఉంటాయి, ఇవి మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయి. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL), మంచి కొలెస్ట్రాల్, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) చెడు కొలెస్ట్రాల్. హెచ్ డీఎల్ ని పెంచడం ద్వారా, ఇతర కొవ్వులతో పోలిస్తే కొబ్బరి నూనె గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని చాలా మంది నిపుణులు నమ్ముతున్నారు. కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల రక్తంలో ప్రసరించే లిపిడ్ల స్థాయిలు మెరుగుపడతాయి, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గడం: బరువు పెరగడానికి ఒక కారణం ఏమిటంటే, శక్తి కోసం ఉపయోగించే దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోవటం. కొబ్బరి నూనెలోని ఎమ్ సీటీలు శరీరం బర్న్ చేసే కేలరీల సంఖ్యను పెంచుతాయి. ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరినూనె తిన్న తర్వాత కడుపు నిండుగా ఉంటుందని, దీనివల్ల ఎక్కువగా తినలేరు. ఆకలిని తగ్గించడంలో కొబ్బరినూనె సహాయపడుతుంది. కీటో డైట్‌లో కీలకమైన పదార్థాల్లో కొబ్బరినూనె ఒకటి.
సంతానోత్పత్తికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. ఆహారంలో కొబ్బరి నూనెను జోడించడం వల్ల సంతానోత్పత్తికి దోహదం చేస్తుంది. కొబ్బరి నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి, అవి సహజమైన క్రిమినాశకాలు. కడుపులోని చెడు బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది, క్లోరైడ్ ఉత్పత్తిలో శరీరానికి సహాయపడుతుంది, కడుపు ఆమ్లాలను సమతుల్యం చేస్తుంది. నిరంతరం బహిర్గతమయ్యే యాసిడ్ ద్వారా అన్నవాహికకు జరిగిన నష్టాన్ని కొంతవరకు తగ్గిస్తుంది.
కొబ్బరి నూనెను అధికంగా తీసుకోవడం కొన్ని అవాంఛనీయ దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. కొబ్బరి నూనెలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. దానిని తక్కువ మొత్తంలో తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నప్పటికీ అధిక వినియోగం వల్ల ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది.