jogging : ఎక్కువ రోజులు జీవించాలంటే….రోజూ జాగింగ్ చేయాలా?..

జాగింగ్‌ వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అదే విధంగా బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ కూడా మెరుగుపడుతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్‌గా జాగింగ్‌ చేసే వారిలో ఆయుష్షు పెరుగుతుందని కనుగొన్నారు.

jogging : ఎక్కువ రోజులు జీవించాలంటే….రోజూ జాగింగ్ చేయాలా?..

Jogging

Updated On : October 29, 2021 / 6:12 PM IST

jogging : ప్రతి రోజూ ఉదయం జాగింగ్‌ చేయడం చాలా మందికి అలవాటు. అలాంటి వారు ఆరోగ్యం విషయంలో ఎలాంటి చింత అవసరంలేదు. ఎందుకంటే రోజు జాగింగ్ చేసే వాళ్ళు ఎక్కువ కాలం జీవించగలుగుతారని పలు అధ్యయనాల్లో తేలింది. శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం, కండరాల పటుత్వానికి జాగింగ్ ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యంగా, చురుగ్గా,యవ్వనంగా కనిపించేందుకు జాగింగ్ తోడ్పడుతుంది. జాగింగ్ వల్ల అధిక బరువును సునాయాసంగా తగ్గవచ్చు.

బరువు తగ్గాలంటే ఆహారంపై అదుపుతోబాటు కొంత శారీరక వ్యాయామం అవసరం. రెగ్యుల జాగింగ్ గ్రేట్ కార్డియో వర్కౌట్. ఇది హార్ట్ మజిల్స్ ను బలోపేతం చేస్తుంది. గుండె మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. జాగింగ్ వల్ల రక్తం వేగంగా గుండెకు ప్రసరించేలా చేసి, గుండె సంబంధి సమస్యలను, వ్యాధులను దూరం చేస్తుంది. దీంతోపాటు శరీరంలోని కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది.

జాగింగ్‌ వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అదే విధంగా బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ కూడా మెరుగుపడుతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్‌గా జాగింగ్‌ చేసే వారిలో ఆయుష్షు పెరుగుతుందని కనుగొన్నారు. బ్లడ్‌గ్లూకోజ్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది. జాగింగ్‌ చేసే సమయంలో శరీరం నుంచి ఎండోర్ఫిన్స్‌ అనే హార్మోన్స్‌ విడుదల అవుతాయి. ఈ గ్రూప్‌ హార్మోన్లు మానసిక ప్రశాంతకు సహాయపడుతాయి. ఈ ఫీల్‌ గుడ్‌ హార్మోన్స్‌ సహజంగానే మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి.

జాగింగ్ వల్ల ఎముకల స్ట్రాంగ్ గా మారుతాయి. జాగింగ్ వల్ల కండరాలు కరగడం వల్ల బాడీ షేప్ మారి చూడటానికి అందంగా మారుతారు. జాగింగ్ వల్ల శరీరంలో ఎక్స్ ట్రా క్యాలరీలు తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే కనుక జాగింగ్ మంచి మార్గం. జాగింగ్ వల్ల శ్వాసవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుతుంది ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జాగింగ్ శారీరక శక్తిని పెంచుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.